బాబుకు నిద్ర‌ప‌ట్ట‌నివ్వ‌ని వారిద్ద‌రి పంచాయితీ

June 25, 2018 at 12:35 pm
babu-akhila priya

“కాలం క‌లిసి వ‌స్తోంది.. ప‌దండి ముందుకు“- అని టీడీపీ అధినేత చంద్ర‌బాబు చెబుతుంటే.. “వ‌చ్చే కాలాన్ని రానివ్వండి మేం మాత్రం మారం. మాదంతా రివ‌ర్స్ గేర్‌!“- అంటున్నారు క‌ర్నూలు నేత‌లు. మ‌రో ఏడాదిలో ఎన్నిక‌లు ఉన్నాయి. ఎప్పుడెప్పుడు ఎన్నిక‌లు వ‌స్తాయా?  ఎప్పుడెప్పుడు రెచ్చిపోదామా? అని ఇక్క‌డి వైసీపీ నేత‌లు, ముఖ్యంగా శిల్పా బ్ర‌ద‌ర్స్‌.. ఎదురు చూస్తున్నారు. టీడీపీలోని వ‌ర్గ విభేదాల‌ను త‌మ‌కు అనుకూలంగా మార్చుకుని ప్ర‌జ‌ల్లోకి వెళ్లేందుకు కూడా వారు వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నారు. మ‌రి ఇలాంటి స‌మ‌యంలో మ‌రింత ప‌క‌డ్బందీగా వ్య‌వ‌హ‌రించాల్సిన టీడీపీ నేత‌లు.. ఒక‌రిపై ఒక‌రు ఆధిప‌త్యం ప్ర‌ద‌ర్శిస్తున్నారు. ఒక‌రిపై వ‌ర‌కు వ‌ర్గాలు, కూట‌మ‌లు పెట్టుకుని కాలం వెళ్ల‌దీస్తున్నారు. 

 

నిన్న మొన్న‌టి వ‌ర‌కు మంత్రి అఖిల ప్రియ‌, ఏవీ సుబ్బారెడ్డిల మ‌ధ్య మొద‌లైన చిచ్చు.. ఇంకా ఆర‌నేలేదు. చంద్ర‌బాబు ఎన్నిసార్లు జోక్యం చేసుకున్నా కుక్క‌తోక టైపులో వీరిద్ద‌రూ త‌మ హ‌వా సాగిస్తున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆళ్ల‌గ‌డ్డ‌పై దృష్టి పెట్టిన ఏవీ సుబ్బారెడ్డిని త‌రిమి కొట్టాల‌ని అఖిల చేసిన వ్యూహం బెడిసి కొడుతోంది. అయినా ఆమె వెన‌క్కి త‌గ్గ‌డంలేదు., క‌లిసి మెలిసి ఉండాల‌ని చెబుతున్న బాబు వ్యాఖ్య‌ల‌ను ప‌ట్టించుకోక‌పోగా.. క‌లిసి మెలిసి కొట్టుకుంటున్న ప‌రిస్థితి మాత్రం బ‌ల‌ప‌డుతోంది. ఈ గోలే ఇంకా తీర‌లేని అనుకుంటుంటే.,. ఇప్పుడు మ‌రో గోల వెలుగు చూసింది. గత కొంతకాలంగా బనగానపల్లె ఎమ్మెల్యే బీసీ జనార్ధన్‌ రెడ్డి మంత్రి అఖిల ప్రియ, ఎమ్మెల్యే భుమా బ్రహ్మనందరెడ్డిపై అసంతృప్తిగా ఉన్నారు. 

 

ఇటీవల వారిద్దరిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి కూడా ఫిర్యాదు చేశారు.   గతంలో బీసీ జనార్థన్‌ రెడ్డి సీఎంను కలిసి తన బాధను వివరించినట్లు తెలిసింది. వారి మధ్య విభేదాల కారణంగా మహానాడు, మినీ మహానాడు, కర్నూలులో ముఖ్యమంత్రి టూర్‌కు సైతం జనార్థన్‌ రెడ్డి గైర్హాజరయిన విషయం తెలిసిందే. ఇప్పుడుఆయ‌న నేరుగా త‌న ప‌రిస్థితి ఏంటో తేల్చుకునేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఎన్నిక‌ల నాటికి ప‌రిస్థితి ఇలానే ఉంటే ఓట‌మి ఖాయ‌మ‌నేది ఆయ‌న వాద‌న‌. దీనిపై వెంట‌నే దృష్టి పెట్టాల‌ని ఆయ‌న చంద్ర‌బాబు ను కోరుతున్నారు. ఈ నేప‌థ్యంలో ఇప్పుడు మ‌రోసారి క‌ర్నూలు వ్య‌వ‌హారాల‌పై దృష్టి పెట్టి.. సానుకూలం చేసేందుకు బాబు ఈ మూడు వ‌ర్గాల‌ను ఆహ్వానించారు. మ‌రి ఇప్ప‌టికైనా ఈ వ్య‌వ‌హారం ముడిప‌డుతుందో లేదో చూడాలి. 

బాబుకు నిద్ర‌ప‌ట్ట‌నివ్వ‌ని వారిద్ద‌రి పంచాయితీ
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share