బాబు ప్ర‌య‌త్నం వృధా? మ‌రోసారి తెర‌పైకి 2 క‌ళ్ల సిద్ధాంతం

July 20, 2018 at 5:12 pm
CBN-

ఏపీ సీఎం చంద్ర‌బాబు. రాజ‌కీయ అప‌ర మేధావిగా, చాణిక్యుడిగా కూడా ఆయ‌న పేరు తెచ్చుకున్నారు. దేశంలో త‌న‌ను మించిన సీఎం లేర‌ని చెప్పి, చెప్పించుకునే ఆయ‌న.. ప్ర‌పంచ పటంలో ప్ర‌ముఖ వ్య‌క్తిగా ఉండాల‌నే ఆశావాది! అయితే, ఏపీకి ప్ర‌త్యేక హోదా విష‌యంలో మాత్రం ఆయ‌న అనుస‌రించిన రెండు క‌ళ్ల సిద్ధాంతం ఇప్పుడు ఆయ‌న‌ను నీచ స్థితికి దిగ‌జార్చే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఏపీకి ప్ర‌త్యేక హోదా! దీనిపై గ‌డిచిన నాలుగేళ్లుగా ఏపీలో ప్ర‌ధాన‌, ఏకైక విప‌క్షం వైసీపీ పోరాడుతోంది. ఎంద‌రో నేతలు.. మాట‌లు చెప్పి త‌ప్పించుకుంటుంటే.. వైసీపీ మాత్రం కార్యాచ‌ర‌ణ‌తో ముందుకు క‌దిలింది. ఎంత వ‌ర‌కైనా పోరుకు సిద్ధ‌మ‌ని ప్ర‌క‌టించిన వైసీపీ అధినేత జ‌గ‌న్‌.. ఆదిశ‌గా తాను న‌డుస్తూ.. త‌న ప‌రివారాన్ని న‌డిపించారు. 

 

ఫ‌లితంగా ఇప్పుడు అవిశ్వాసంపై చ‌ర్చ న‌డిచేందుకు అవ‌కాశం ఎదురైంది. ఇక‌, ఈ ఘ‌న‌త‌ను త‌న ఖాతాలో వేసుకున్న చంద్ర‌బాబుకు కేంద్రం సినిమా చూపించేందుకు రెడీ అయింద‌ని అంటున్నారు ఢిల్లీ పాత్రికేయులు. విష‌యంలోకి వెళ్తే.,. ప్ర‌స్తుతం చంద్ర‌బాబు అండ్ టీం.. కేంద్రంపై అవిశ్వాసం ప్ర‌క‌టించారు. దీనిపై చ‌ర్చ జ‌ర‌గ‌నుంది. ఈ క్ర‌మంలోనే కేంద్రం ఏపీకి ఏం చేసింది? ఏం చేయ‌లేదు? అనే అంశాల‌పై సుదీర్ఘంగా చ‌ర్చించే అవ‌కాశం ఉంటుంది. ముందు ఏపీ త‌న వాద‌న‌ను స‌భ‌లో వినిపించ‌నుంది. ఈ వాద‌న అనంత‌రం, కేంద్రం కూడా దీనికి స‌మాధానం ఇస్తుంది. ఇప్పుడున్న ప‌రిస్థితిలో నేరుగా ప్ర‌ధాని మోడీనే ఏపీ ప‌రిణామాల‌పై మాట్లాడాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు స‌మాచారం. ఇక‌, మోడీ ఇటీవ‌ల జ‌రిగిన బ‌డ్జెట్ స‌మావేశాల్లో మాట్లాడుతూ.. ఏపీకి అన్యాయం జ‌రిగింద‌న్నారు. 

 

ఈ వ్యాఖ్య‌ల‌నే బాణాలుగా చేసుకుని కేంద్రంపై టీడీపీ ఎక్కు పెట్టందుకు రెడీఅ యింది. అయితే, మో డీ స‌ర్కారు.. అంత‌క‌న్నా మించిన శ‌రాల‌తోనే చంద్ర‌బాబుపై యుద్ధం ప్ర‌క‌టించాల‌ని భావిస్తున్నారు. ఇటీవ‌ల కాలంలో కేంద్రంపై బాబు తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు చేస్తున్నారు. ఎన్డీయే నుంచి రాత్రికి రాత్రి బ‌య‌ట‌కు వ‌చ్చారు. త‌న మంత్రుల‌ను ఉప‌సంహ‌రించుకున్నారు. ఇక‌, మోడీపై గుజ‌రాత్‌ను అడ్డుపెట్టుకుని విమ‌ర్శ‌లు చేస్తున్నారు. మొత్తంగా ఈ ప‌రిణామాల‌ను నిశితంగా గ‌మ‌నిస్తున్న మోడీ.. చుర‌క‌త్తుల్లాంటి వ్యాఖ్య‌ల‌తో చంద్ర‌బాబుపై విరుచుకుపప‌డే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. ప్ర‌దానంగా ప్యాకేజీకి ఒప్పుకొని ..ప్ర‌త్యేక హోదా వేస్ట్ అని ఢిల్లీలోనే ప్ర‌క‌టించిన చంద్ర‌బాబు రికార్డును ఈ సంద‌ర్భంగా మోడీ పార్ల‌మెంటులో రిపీట్ చేస్తార‌ని తెలుస్తోంది. 

 

అదేవిధంగా క‌ర్ణాట‌క ఎన్నిక‌ల స‌మ‌యంలో బీజేపీకి వ్య‌తిరేకంగా చేయించిన ప్ర‌చారాన్ని కూడా బ‌య‌ట‌కు తీస్తార‌ని తెలుస్తోంది. ఇక‌, కేంద్రం ఇస్తున్న నిధుల‌ను వివిధ కార్య‌క్ర‌మాల‌కు ఇష్టానుసారంగా ఖ‌ర్చు చేస్తున్న తీరును కూడా ఎండ‌గ‌ట్టే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు. మొత్తంగా ఈ ప‌రిణామాలు చంద్ర‌బాబుకు వ్య‌తిరేకం కానున్నాయి. ఇక‌, ఈ అవిశ్వ‌సంపై చ‌ర్చ ద్వారా బాబు సాధించేది కూడా ఏమీ లేద‌ని తెలుస్తోంది. కేవ‌లం చ‌ర్చించ‌డం ద్వారా.. ఏపీకి మీర‌ది ఇవ్వ‌లేదు.. మీరిది ఇవ్వ‌లేదు.. అని చంద్ర‌బాబు టీం చెప్పే చాన్స్ ఉంటుంది త‌ప్ప‌.. కేంద్రం నుంచి ఒక్క పైసా కూడా వ‌చ్చే అవ‌కాశం లేదు. సో.. మొత్తానికి చంద్ర‌బాబు సాధించేది ఏమీ లేద‌ని స్ప‌ష్ట‌మ‌వుతుంది. 

బాబు ప్ర‌య‌త్నం వృధా? మ‌రోసారి తెర‌పైకి 2 క‌ళ్ల సిద్ధాంతం
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share