కొంచెం త‌గ్గుదాం బాబూ.. పోయేదేమీ లేదు!

January 10, 2019 at 6:34 pm

రాష్ట్రంలో అత్యంత సీనియ‌ర్ పొలిటీషియ‌న్‌గా ఉన్న టీడీపీ అధినేత చంద్ర‌బాబు వ్య‌వ‌హార శైలిపై సోష‌ల్ మీడియాలో స‌టైర్లు ప‌డుతున్నాయి. బాబూ కొంచెం త‌గ్గ‌రాదాండి! -అంటూ నెటిజ‌న్లు కామెంట్లు పెడుతున్నారు. 40 ఇయ‌ర్స్ ఇండస్ట్రీగా ఆయ‌న దూకుడును ప‌క్క‌న పెడితే.. ఆయ‌న చేస్తున్న వ్యాఖ్య‌లు మాత్రం తీవ్ర వివాదానికి దారి తీస్తున్నాయ‌ని అంటున్నారు. పాల‌న వ్య‌వ‌హారాల‌ను కొద్ది సేపు ప‌క్క‌న పెడితే.. రాజ‌కీయంగా చంద్ర‌బాబు వేస్తున్న అడుగులు చివ‌రికి ఆయ‌న‌కే విక‌టించే ప్ర‌మాదం లేక‌పోలేద‌ని అంటున్నారు. 2017 న‌వంబ‌రు 6న ఇడుపుల పాయ కేంద్రంగా విప‌క్ష నాయ‌కుడు వైసీపీ అధినేత జ‌గ‌న్ ప్రారంభించిన పాద‌యాత్ర తాజాగా ముగిసింది. దాదాపు ఏడాది రెండు మాసాల పాటు ఎండ‌న‌కా .. వాన‌న‌కా.. ప్ర‌జ‌ల్లోనే ఉండి ప్ర‌జ‌ల‌కోసం తిరిగిన జ‌గ‌న్‌కు ప్ర‌జ‌ల నుంచి ఒకింత సానుభూతి రావ‌డం ఖాయం. రావాలి కూడా.

ప్ర‌జాస్వామ్యంలో పాద‌యాత్ర అనేది ఉతృష్ఠ‌మైన వ్య‌వ‌హారం. అత్యంత కీల‌క‌మైన వ్య‌వ‌హారం కూడా. ప్ర‌జ‌ల్లోకి వెళ్లేందుకు అత్యంత డైరెక్ట్ మార్గంకూడా ఇదే. కాబ‌ట్టి సానుభూతి రావాల‌ని జ‌గ‌న్ కోరుకోవ‌డం, సానుభూతి రావ‌డం రెండూ అవ‌స‌ర‌మే. జ‌గ‌న్ స్థానంలో ఏ నాయ‌కుడు ఉన్నా కూడా ఇదే త‌ర‌హా ఆల‌చ‌న చేస్తారు కూడా. ఇక‌, ఇచ్ఛా పురంలో పాద‌యాత్ర ముగింపు సంద‌ర్భంగా స‌హ‌జ‌సిద్ధంగా ఉన్న త‌న స్టైల్‌ను ప‌క్క‌న పెట్టిన జ‌గ‌న్ చాలా నిర్మాణాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రించా ర‌ని పార్టీల‌కు అతీతంగా ఉండే విశ్లేష‌కులు పేర్కొంటున్నారు. జ‌గ‌న్‌లో ప‌రిణితి పెరిగింద‌ని కూడా చెబుతున్నారు. రాజ‌కీయాల్లోదూకుడు , త‌ప్పులు చేయ‌డం, త‌ప్ప‌ట‌డుగులు వేయ‌డం స‌హ‌జ‌మేన‌ని అంటున్నారు. తన ఎమ్మెల్యేల‌ను తాను పాద‌యాత్ర‌లో ఉండ‌గా స‌భ‌కు పంపించి ఉండొచ్చుగా అనే టీడీపీ మ‌ద్ద‌తు దారుల విమ‌ర్శ‌ల‌ను ఉటంకిస్తూ.. వెళ్లే వాతావ‌ర‌ణం క‌ల్పించాల్సిన అధికార పార్టీ ఆ గీత ఎప్పుడో దాటిపోయింది అంటున్నారు.

విప‌క్ష పార్టీ నుంచి ఎమ్మెల్యేల‌ను “కొనుగోలు“ చేశార‌నేది జ‌గ‌న్ ఆరోప‌ణ‌, దీనికి నేరుగా చంద్ర‌బాబు ఇప్ప‌టి వ‌ర‌కు స‌మాధానం చెప్ప‌లేదు. పైగా వీరిపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని స్పీక‌ర్‌కు ఫిర్యాదు చేసినా.. కోర్టు ప‌రిధిలో ఉన్న నేప‌థ్యంలో దీనిపై చ‌ర్య‌లు తీసుకోలేన‌ని ఆయ‌న అంటున్నారు. ఈ మొత్తం ఎపిసోడ్‌లో జ‌గ‌న్ ఆత్మాభిమానం కించ‌ప‌రిచేలా వ్య‌వ‌హ‌రించింది అక్ష‌రాలా అధికార పార్టీనే! ఇక‌, ఇప్పుడు పాద‌యాత్ర ద్వారా జ‌గన్‌కు ఎక్క‌డ మైలేజీ వ‌స్తుందోన‌ని భ‌య‌ప‌డుతు న్న‌దీ, ఖంగారు ప‌డుతున్న‌దీ కూడా అధికార పార్టీనే. నిజ‌మే ఎక్క‌డా ఏ రాష్ట్రంలో అయినా విప‌క్షం ఎద‌గాల‌ని ఏ అధికార పార్టీ కూడా కోరుకోదు. అయితే, విప‌క్ష నాయ‌కుడు చేస్తున్న పాద‌యాత్ర‌కు అస‌లు నిబ‌ద్ధ‌తే లేద‌ని, ఆ పాద‌యాత్ర వృథా అని చెప్ప‌డం వెనుక త‌నను తాను కించ ప‌రుచుకోవ‌డ‌మే అవుతుంద‌నేది చంద్ర‌బాబుకు నెటిజ‌న్లు చెబుతున్న మాట‌.

తాజాగా జ‌గ‌న్ పాద‌యాత్ర ముగింపు సంద‌ర్భంగా స్పందించిన చంద్ర‌బాబు.. చిత్తశుద్ధి లేని పాదయాత్రలు ఎన్ని చేసినా ఉపయోగం లేదని జగన్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. పాదయాత్ర అంటే నిబద్ధతతో చేయాలని, రోజుకు 8 కిలో మీట‌ర్లు మేర నడిస్తే దాన్ని పాదయాత్ర అంటారా? అని ప్రశ్నించారు. గతంలో ఆరోగ్యం సహకరించకపోయినా తాను నడిచి ప్రజల మనసుల్లో స్థానం సంపాదించానని సీఎం చెప్పారు. దీనిపై నెటిజ‌న్లు ఘాటుగా స్పందిస్తున్నారు. పాద‌యాత్ర ను కూడా రాజ‌కీయం చేయ‌డం ద్వారా బాబు త‌న ఉన్న‌తిని తానే కోల్పోతున్నాడ‌ని వ్యాఖ్యానిస్తున్నారు. రాజ‌కీయాల్లో సీనియర్ మోస్ట్ అయిన చంద్ర‌బాబు ఇలా వ్యాఖ్యానించ‌డం స‌రికాద‌ని అంటున్నారు. జ‌గ‌న్ పాద‌యాత్ర విజ‌య‌వంతం అవుతుందా? విఫ‌ల‌మ‌వుతుందా? అనేది ప్ర‌జ‌లు నిర్ణ‌యిస్తార‌ని అంటున్నారు. కొన్ని కొన్ని విష‌యాల్లో బాబు త‌గ్గి ఉండ‌డం వ‌ల్ల ఆయ‌నకే మేలు జ‌రుగుతుంద‌ని సూచిస్తున్నారు.

కొంచెం త‌గ్గుదాం బాబూ.. పోయేదేమీ లేదు!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share