ఆ విషయంలో చంద్రబాబు ముందే జాగ్రత్త పడ్డారా!

February 4, 2019 at 5:16 pm

ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు రాజకీయాలు రోజు రోజుకీ ఉత్కంఠంగా మారుతున్నాయి. ఇక్కడ ముఖ్య పార్టీలు అయిన టీడీపీ, వైసీపీ, జనసేన పార్టీలు ఎవరికి వారే తమ వ్యూహాలతో ముందుకు సాగుతున్నారు. ముఖ్య అధినేతలు ప్రజల్లోకి వెళ్లి తమ భవిషత్యత్ ప్రణాళికల గురించి వివరిస్తున్నారు. అధికార పార్టీ తాము చేసిన అభివృద్ది పనుల గురించి ప్రజలకు వివరిస్తూ..రాష్ట్రాన్ని సింగపూర్ గా మార్చబోతున్నామని..రాజధాని ఏర్పాటు చేసి ఉద్యోగవకాశాలు కల్పిస్తామని..పేదరికాన్ని నిర్మూలిస్తామని విద్యాభివృద్దికి కృషి చేస్తామని హామీలు ఇస్తుంది.

మరోవైపు ప్రతిపక్ష పార్టీ వైసీపీ మాత్రం అధికార పార్టీ ఈ నాలుగేళ్లలో ప్రజలకు చేసింది ఏమీ లేదని విమర్శిస్తుంది. అయితే వైఎస్ జగన్ ఫిబ్రవరి మొదటి వారంలో బిసి గర్జన ఏర్పాటు చేసి అధికార పార్టీ వల్ల బిసిలకు అన్యాయం జరిగిందని ఎలుగెత్తి చెప్పాలని వ్యూహాలు పన్నారు. కానీ అప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు బిసి గర్జన కార్యక్రమం ఏర్పాటు చేసి బిసి నాయకుల సమావేశంలో ఎన్నో వరాల జల్లులు కురిపించారు. బిసిలను ఆకర్షించే ప్రయత్నాలు చేశారు. దాంతో ఇప్పుడు వైసీపీ నేతలకు మింగుడు పడటం లేదు..తాము చేయాల్సిన పనులు ముఖ్యమంత్రి అప్పుడే చేయడం..ఇలాంటి సమయంలో బీసీలను ఎలా ఆకర్షించాలా అన్న ఆలోచనలో పడ్డారు.

అయినా కూడా వెనుకడుగు వేయకుండా ఫిబ్రవరి 19వ తేదిన బిసి గర్జన నిర్వహించాలని వైసిపి నిర్ణయించింది. హైదరాబాద్‌లోని కేంద్ర కార్యాలయంలో బిసి నేతలతో ఆ పార్టీ అధ్యక్షులు వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి సమావేశం అయ్యారు. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే బిసిలకు ఏం చేస్తామనే విషయాలను ప్రజలకు తెలియజేయడంతో పాటు పాటు టిడిపి ప్రభుత్వం నాలుగేళ్లలో బిసిలను ఏ విధంగా నిర్లక్ష్యం చేసిందనే విషయాన్ని విస్తృతంగా ప్రచారం చేయాలని నిర్ణయించారు.

గత ఎన్నికల్లో బిసిలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని తెలుగుదేశం ప్రభుత్వం అమలు చేయలేకపోయిందని విమర్శించారు.చంద్రబాబు బిసిల పట్ల మొసలికన్నీరు కారుస్తున్నారని పార్ధసారధి అన్నారు. నాలుగున్నరేళ్లుగా గుర్తుకురాని బిసిలు ఎన్నికల ముంగిట గుర్తుకొచ్చారా అని ప్రశ్నించారు. వైఎస్‌ఆర్‌ హయాంలో ఫీజురియంబర్స్‌మెంట్‌ వందశాతం అమలైతే… చంద్రబాబు పాలనలో కనీసం 30 శాతం కూడా అందని పరిస్థితి నెలకొందన్నారు. మొత్తానికి వైసీపీ వ్యూహాలు ముందే పసిగట్టిన సీఎం చంద్రబాబు వ్యూహాలను ఎలా ఎదుర్కోవాలో ప్రణాళికలు రచిస్తున్నారు జగన్ అండ్ కో.

ఆ విషయంలో చంద్రబాబు ముందే జాగ్రత్త పడ్డారా!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share