కేంద్రం హిట్ లిస్టులో బాబు..భారీ స్కెచ్ రెడీ!

June 5, 2018 at 1:47 pm
Andhra Pradesh CM, Chandrababu Naidu in Marriott, Mumbai during an event organised by Microsoft on Wednesday. Express Photo by Nirmal Harindran. 22.02.2017. Mumbai. *** Local Caption *** Andhra Pradesh CM, Chandrababu Naidu in Marriott, Mumbai during an event organised by Microsoft on Wednesday. Express Photo by Nirmal Harindran. 22.02.2017. Mumbai.

క‌ర్ణాట‌క‌లో ఎన్నిక‌ల హడావుడి ముగిసిన త‌ర్వాత‌.. ఇక ఏపీపైనే కేంద్రం ఫుల్ ఫోక‌స్ పెట్ట‌నుంది అని వినిపించిన మాట‌ల‌న్నీ ఇప్పుడు నిజం కాబోతున్నాయా?  ఎన్డీఏ నుంచి బ‌య‌టికి వ‌చ్చిన తర్వాత కేంద్రంపై తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పిస్తున్న ఏపీ సీఎం చంద్ర‌బాబును ఇరుకున పెట్టే ప్ర‌య‌త్నాలు జ‌రుగుతాయ‌న్న వ్యాఖ్య‌లు.. త్వ‌ర‌లోనే రుజువు కాబోతున్నాయా? త‌న‌పై కేంద్రం సీబీఐని ప్ర‌యోగించ‌బోతోంద‌ని చంద్ర‌బాబు చేసిన ప్ర‌చార‌మంతా ఇప్పుడు వాస్త‌వ రూపం దాల్చ‌బోతోందా? అంటే అవున‌నే స‌మాధాన‌మే వినిపిస్తోంది. 

 

ప్ర‌స్తుతం ఎయిర్ ఆసియా కేసు విచారణకు సంబంధించిన ఆడియో టేపులు లీకవ‌డం.. అందులో చంద్ర‌బాబు పేరు బ‌యటికి రావ‌డంతో.. కేంద్రం అస‌లు గేమ్ స్టార్ట్ చేసింద‌నేందుకు మ‌రింత ఊతం క‌లుగుతోందంటున్నారు విశ్లేష‌కులు. అవినీతి ఆరోప‌ణ‌లు లేవ‌ని చెప్పుకుంటున్న బాబుపై ఇప్పుడు ఈ అస్త్రాన్ని కేంద్రం సంధించింద‌ని వివ‌రిస్తున్నారు. కేంద్రం ఇప్పుడు ఏపీపై పూర్తిగా దృష్టి సారించింది. ప్ర‌ధాని మోడీపై తీవ్ర వ్యాఖ్య‌లు చేస్తూ.. ఏపీలో బీజేపీని దోషిని చేసిన చంద్ర‌బాబు, ఆయ‌న స‌న్నిహితుల కూపీ లాగేందుకు తీవ్రంగా ప్ర‌య‌త్నిస్తోంది. ఎయిర్ ఆసియా కేసులో చంద్ర‌బాబును కూడా ప్రశ్నించేలా బీజేపీ పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. కొద్దిరోజుల క్రితం కొన్ని నిబంధనలను మార్చటానికి పౌరవిమానయాన శాఖ అధికారులకు ముడుపులు ఇచ్చారనే అభియోగంపై ఎయిర్‌ ఆసియా సీఈఓ ఫెర్నాండెజ్‌ను సీబీఐ ప్రశ్నించింది. 

 

అశోక్‌గజపతిరాజు పౌరవిమానయాన శాఖ మంత్రిగా ఉన్న సమయంలో వీటిని మార్చారు. ఇంటరాగేషన్‌లో ఫెర్నాండేజ్‌ అనేక విషయాలు వెల్లడించారు. వీటిలో దూబే అనే ఇన్వెస్టర్‌కు ఎయిర్ ఆసియా ఇండియా సీఈఓ చందు చాండెల్య ఇచ్చిన ఒక ప్రజంటేషన్‌ సందర్భంగా జరిగిన సంభాషణ బయటకొచ్చింది. ఈ టేపులో అశోకగజపతిరాజు తనకు చాలా ఆప్తుడని, చంద్రబాబును నైస్‌గా చూసుకుంటే తమకు కావాల్సినవన్నీ చేయించుకోవచ్చని, చంద్ర‌బాబు భావి ప్ర‌ధాని అని చాండెల్య చెప్పినట్లు ఉంది. ఇంకా విచారణ కాకుండా టేపును బయటపెట్టడం వెనుక బీజేపీ ఒక పెద్ద వ్యూహాన్నే పన్నినట్లు కనిపిస్తోంది. ఇప్పటిదాకా చంద్రబాబుపైన, ఆయన సన్నిహితులపైనా ఎటువంటి అవినీతి ఆరోపణలు రాలేదు. 

 

వైఎస్‌ జగన్‌ పూర్తి అవినీతిపరుడని.. బీజేపీ ఆయనతో అంటకాగుతోందని ఈ మధ్య చంద్రబాబు విమర్శిస్తున్నారు. ఇది రెండు పార్టీల‌పై తీవ్రంగా ప్ర‌భావం చూపుతోంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు, ఆయన సన్నిహితులు, సహచరులపై ఉన్న ఆరోపణలను వెలికితీసి వాటికి ఆధారాలు వెతికే పనిలో బీజేపీ పడిందంటున్నారు విశ్లేష‌కులు. కర్ణాటక ఎన్నికలు పూర్తయి.. కేంద్ర నాయకత్వం కొంత స్థిమితపడిన నేపథ్యంలో రాష్ట్ర బీజేపీ నేతలు చురుకుగా కదలటం మొదలుపెట్టారు. చంద్రబాబుపైన.. తెలుగుదేశంపైన విమర్శల వర్షం కురిపిస్తున్నారు. 

 

ఇలాంటి పరిస్థితుల్లో ఎయిర్‌ఆసియా కేసులో కొందరిని ప్రశ్నించటం.. ఒక టేపులో చంద్రబాబు పేరు ఉన్నట్లు లీకులు ఇవ్వటం ఆసక్తికరంగా మారింది. చంద్రబాబును ప్రశ్నిస్తే దేశవ్యాప్తంగా ఉన్న విపక్ష నేతలకు కూడా కొంత జంకు మొద‌లువు తుంది. ఫెడరల్‌ ఫ్రంట్‌లో అంతర్లీనంగా ఉన్న విభేదాలు బయటకు కూడా రావచ్చు. విప‌క్షాలు కొంత వెనుకంజ వేసేందుకు కూడా ప్ర‌య‌త్నించొచ్చనేది బీజేపీ వ్యూహంలా క‌నిపిస్తోంది! మ‌రి బీజేపీ వ్యూహం ఫ‌లిస్తుందో లేక బెడిసి కొడుతుందో వేచిచూడాల్సిందే!

కేంద్రం హిట్ లిస్టులో బాబు..భారీ స్కెచ్ రెడీ!
0 votes, 0.00 avg. rating (0% score)

comments



Related Posts


Share
Share