బాబుకు-హోదాకు మ‌ధ్య‌? వాస్త‌వాలు ఏంటి?

February 11, 2019 at 5:18 pm
నేడు దేశం మొత్తం ఢిల్లీ వైపు చూస్తోంది- ఇదీ టీడీపీ నాయ‌కులు చెబుతున్న మాట‌. త‌న పార్టీ అధినేత చంద్ర‌బాబు ఏపీ కోసం చేస్తున్న ధ‌ర్మ దీక్షతో ఢిల్లీ అట్టుడుకుతోంద‌ని అంటున్నారు. వాస్త‌వానికి రాష్ట్ర నాయ‌కుడిగా ఆయ‌న‌కు ఈ రాష్ట్రాని కి ఏం కావాలో..? ఈ రాష్ట్రానికి ఏం చేయాలో..?  తెలుసుకుని ముందుకు వెళ్లాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంది. అయితే, ఇప్పుడు ఏపీకి సంబంధించి ఢిల్లీలో ఏం జ‌రుగుతోంది? అనేది కీల‌క అంశంగా మారింది. గత ఎన్నికలకు ముందు ఏపీకి ప్రత్యేక హోదా ఐదేళ్లు కాదు.. పదేళ్లు ఇవ్వాలని తిరుపతిలో నిర్వహించిన సభలో ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ, పవన్‌ కల్యాణ్‌ సాక్షిగా డిమాండ్‌ చేసిన చంద్రబాబు అనంతరం అధికారం చేపట్టాక ‘హోదా అంటే జైలుకే…’ అని బెదిరించారు.51743252_2501811836499059_8045527429734727680_n
 
ఎన్నికలు కాగానే మాట మార్చేసి హోదాతో ఏమొస్తుంది? అదేమైనా సంజీవనా? ఈశాన్య రాష్ట్రాలకు హోదా ఉన్నా ఏం బావుకున్నాయి? అని ప్రశ్నించారు. హోదా కోసం రాష్ట్రమంతా బంద్‌లు, నిరసనలకు దిగితే పోలీస్‌స్టేషన్లు, జైళ్లను ఉద్యమకారులతో నింపేశారు. కోడలు మగబిడ్డను కంటానంటే అత్త వద్దంటుందా? అంటూ వ్యంగ్యంగా మాట్లాడారు. ఆ తరువాత ప్రత్యేక ప్యాకేజీ చాలంటూ కేంద్రం ఎదుట సాగిలపడ్డారు. హోదాకు, ప్రత్యేక ప్యాకేజీకి తేడా ఏముందన్నారు. ఓటుకు కోట్లు కేసు, రాజధాని పేరుతో భూ కుంభకోణాలు, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో తీవ్రమైన అవినీతి ఆరోపణలతో విభజన హామీలను నెరవేర్చాల్సిందిగా కేంద్రాన్ని గట్టిగా అడిగేందుకు చంద్రబాబు సాహసించలేదు. 51708272_2501733896506853_3182942740568604672_n
 
ఇప్పుడు పదవీకాలం ముగింపు దశలో ఎలాంటి ప్రయోజనం ఉండదని తెలిసి హోదా కావాలంటూ మభ్య పెట్టేందుకు ఢిల్లీలో దీక్షకు సిద్ధమయ్యారు. ప్యాకేజీతో రాష్ట్రానికి ఎక్కువ నిధులు వస్తున్నాయంటూ సీఎం చంద్రబాబు రాష్ట్రవ్యాప్తంగా మోడీకి కృతజ్ఞతలు తెలియచేస్తూ సన్మాన కార్యక్రమాలు నిర్వహించారు. అసెంబ్లీలో ‘జయహో… మోడీ’  అంటూ తీర్మానాలు చేయించి మరీ కీర్తించారు. 14వ ఆర్థిక సంఘం సిఫార్సుల ఫలితంగా ఇక ఏ రాష్ట్రానికీ ప్రత్యేక హోదాయే ఉండదని అసెంబ్లీ సాక్షిగా బొంకారు. ప్రత్యేక హోదా ఇవ్వడానికీ, ఆర్థిక సంఘానికీ సంబంధమే లేదని.. ప్రధాని జారీ చేసే ఒక ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్‌ చాలని ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వాస్తవాలను వెల్లడించినందుకు ఆయన్ను హేళన చేశారు. అసెంబ్లీలోనూ, బయటా ముప్పేట దాడికి దిగారు. ఈ ప‌రిణామాల‌ను అంతా మ‌రిచిపోయార‌ని, తాను చేస్తున్న దీక్ష‌ను, రోజువారీ డ్రామాల‌నే ప్ర‌జ‌లు గుర్తు పెట్టుకున్నార‌ని చంద్ర‌బాబు భావించ‌డం స‌ర్వ‌త్రా విస్మ‌యానికి గురిచేస్తోంది. 
బాబుకు-హోదాకు మ‌ధ్య‌? వాస్త‌వాలు ఏంటి?
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share