బాబు దెబ్బ‌కు మ‌ళ్లీ అజ్ఞాతంలోకి మంత్రి..

March 13, 2019 at 10:44 am

టీడీపీ అధినేత‌, ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు దెబ్బ‌కు ఆ మంత్రి మ‌ళ్లీ అజ్ఞాతంలోకి వెళ్లిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. నిన్న‌టి నుంచి మంత్రి ఎవ‌రికీ అందుబాటులో లేక‌పోవ‌డం తీవ్ర చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఆ మంత్రి మ‌రెవ‌రో కాదు.. విశాఖ జిల్లా భీమిలీ ఎమ్మెల్యే, మంత్రి గంటా శ్రీ‌నివాస‌రావే. చంద్ర‌బాబు తీరుతో గ‌తంలో ఓసారి అజ్ఞాతంలోకి వెళ్లిన మంత్రి గంటా.. తాజాగా టికెట్ లొల్లి విష‌యంలో మ‌రోసారి అల‌క‌బూనిన‌ట్లు తెలుస్తోంది. ప్ర‌స్తుతం తాను ప్రాతినిధ్యం వ‌హిస్తున్న భీమిలీ సీటును ఈసారి మంత్రి లోకేశ్‌కు కేటాయించేందుకు చంద్ర‌బాబు ప్ర‌య‌త్నం చేస్తుండ‌డంతో మంత్రి గంటా లోలోప‌ల ఉడికిపోతున్న‌ట్లు ఆయ‌న స‌న్నిహితులు చ‌ర్చించుకుంటున్నారు.

కుమారుడి కోసం త‌న సీటుకు ఎస‌రుపెట్టేందుకు చంద్ర‌బాబు పావులు క‌దుపుతుండ‌డంతో మంత్రి గంటా శ్రీ‌నివాస‌రావు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. అంతేగాకుండా.. సీబీఐ మాజీ జేడీ ల‌క్ష్మీనారాయ‌ణ కూడా టీడీపీలోకి వ‌స్తార‌ని, ఆయ‌న‌కు భీమిలీ టికెట్ ఇచ్చేందుకు చంద్ర‌బాబు సానుకూలంగా ఉన్నారంటూ జ‌రుగుతున్న ప్ర‌చారం కూడా మంత్రి గంటాను నిద్ర‌పోనివ్వ‌డం లేదు. అయితే.. భీమిలీ సీటును అయితే లోకేశ్‌కు.. లేకుంటే ల‌క్ష్మీనారాయ‌ణ‌కే ఇస్తార‌ని.. ఎట్టిప‌రిస్థితుల్లోనూ గంటాకు ఇవ్వ‌ర‌నే టాక్ తెలుగు త‌మ్ముళ్ల‌లోనూ వినిపిస్తోంది. ఈ నేప‌థ్యంలోనే ఆయ‌న మ‌రోసారి అజ్ఞాతంలోకి వెళ్లిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.

అయితే.. ఎంపీగా పోటీ చేయాల‌ని చంద్ర‌బాబు చెబుతున్నా.. అది ఏమాత్ర‌మూ గంటాకు ఇష్టం లేద‌ట‌. త‌న‌ను రాజ‌కీయంగా దెబ్బ‌తీసేందుకే చంద్ర‌బాబు ఇలా చేస్తున్నార‌ని గంటా త‌న స‌న్నిహితుల వ‌ద్ద వాపోతున్న‌ట్లు తెలుస్తోంది. ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో తాను పార్టీ మారైనా.. భీమిలీ నుంచే ఎమ్మెల్యేగా పోటీ చేస్తాన‌ని గంటా అంటున్న‌ట్లు స‌మాచారం. ఇదిలా ఉండ‌గా.. గ‌తంలోనూ ఓ ప‌త్రిక నిర్వ‌హించిన స‌ర్వేలో భీమిలిలో గంటా ఓడిపోతాడంటూ ఫ‌లితాలు రావ‌డం.. ఈ స‌ర్వే వెనుక చంద్ర‌బాబు హ‌స్తం ఉందంటూ ఆయ‌న అల‌క‌బూన‌డం.. కొద్దిరోజుల పాటు అజ్ఞాతంలోకి వెళ్ల‌డం తెలిసిందే. ఆ త‌ర్వాత ప‌రిస్థితులు స‌ర్దుకోవ‌డం.. మ‌ళ్లీ జ‌నంలోకి గంటా రావ‌డం తెలిసిందే. మ‌రి ఇప్పుడేం చేస్తారో చూడాలి మ‌రి.

బాబు దెబ్బ‌కు మ‌ళ్లీ అజ్ఞాతంలోకి మంత్రి..
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share