తమ్ముళ్లు నాడు గోలచేసారు ..ఇప్పుడు ఏమంటారు !

November 19, 2018 at 3:38 pm

రాజ‌కీయాల్లో నీతులు చెప్పేవారు ఎక్కువ‌గానే క‌నిపిస్తున్నా. కానీ, ఆ నీతులు పాటించేవారే క‌నిపించ‌డంలేదు. ముఖ్యంగా అదికార టీడీపీలో ఈ ర‌కం నాయ‌కులు లెక్క‌కుఎక్కువ‌గానే క‌నిపిస్తున్నారు. విప‌క్షం వైసీపీకి నీతులు చెప్పే నాయ‌కులు త‌మ దాకా వ‌చ్చే స‌రికి మాత్రం కుక్క‌తోక బుద్ధినే ప్ర‌ద‌ర్శిస్తున్నారు. “పార్టీ కోసం క‌ష్ట‌ప‌డ్డ‌వారిని జ‌గ‌న్ న‌ట్టేట ముంచుతున్నాడు. కీల‌క టికెట్ల‌ను అమ్ముకుంటున్నాడు. త‌న రెడ్డి సామాజిక వ‌ర్గాన్నే చేర‌దీస్తున్నాడు. ఆయ‌న‌కు రాజ‌కీయాలంటే ఇంత‌క‌న్నా ఏం తెలుసు?“- అని నోటికి ఇష్టం వ‌చ్చిన‌ట్టు తిట్టిపోశారు టీడీపీ త‌మ్ముళ్లు. కానీ, త‌మ విష‌యానికి వ‌చ్చే స‌రికి మాత్రం గురివింద నీతుల‌ను మ‌రిచిపోతున్నారు. ఇదే విష‌యంపై ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో టీడీపీపై నెటిజ‌న్లు దుమ్మెత్తి పోస్తున్నారు.HY17SUHASINI

నీతులు ఎదుటి వారికి చెప్ప‌డానికే ఉన్నాయా? త‌మ్ముళ్లూ! అంటూ వ్యాఖ్యానిస్తున్నారు. విష‌యంలోకి వెళ్తే.. తెలంగాణాలో ఎన్నిక‌ల స‌మ‌రం జ‌రుగుతోంది. ఇక్క‌డ టీడీపీ నుంచి చాలా మంది నాయ‌కులు జంప్ చేశారు. అయితే, ఎంతో కొంత పార్టీపై ప్రేమ‌తో చాలా మంది గ‌డిచిన నాలుగేళ్లుగా పార్టీని న‌మ్ముకునే ఉన్నారు. అధికార టీఆర్ ఎస్ నేత‌ల నుంచి పార్టీ నుంచి వ‌చ్చిన ప్ర‌లోభాల‌కు కూడా లొంగ‌లేదు. ఏదో ఒక నాటికి త‌మ‌కు కూడా ఛాన్స్ వ‌స్తుంద‌ని న‌మ్ముకుని పార్టీని వెంట‌బెట్టుకుని న‌డిపించారు. ఇలాంటి వారిలో పెద్ది రెడ్డి ఒక‌రు. ఈయ‌న పార్టీలో కీల‌క నాయ‌కుడిగా ఎదిగారు. ముఖ్యంగా చంద్ర‌బాబు అంటే ఎంతో అభిమానం. పార్టీ అంటే ప్రాణం.chandra-babu

ఈ నేప‌థ్యంలో ఆయ‌న ఇత‌ర పార్టీల్లో చేరాల‌నే డిమాండ్లు వ‌చ్చినా కూడా పెద్దిరెడ్డి ఎక్క‌డా చ‌లించ‌లేదు. అవ‌స‌ర‌మైతే.. జైలు కు అయినా వెళ్తాను కానీ, పార్టీని మాత్రం మారేది లేద‌ని అనేక సంద‌ర్బాల్లో త‌న అభిమానాన్ని చాటుకున్నారు. ఇక‌, తీరా.. తెలంగాణా ఎన్నిక‌ల స‌మ‌యంలో వ‌చ్చే స‌రికి ఆయ‌న త‌న‌కు ఎమ్మెల్యే టికెట్ కేటాయించాల‌ని అధినేత చంద్ర‌బాబును కోరారు. ఆయ‌న కూడా స‌రే! అన్నారు. ఈ క్ర‌మంలోనే అత్యంత కీల‌క‌మైన కూక‌ట్‌ప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గాన్ని పెద్దిరెడ్డి ఎంచుకున్నారు. ఇక్క‌డైతే.. ఏపీ నుంచి వ‌చ్చిన వారు.. తెలుగుదేశం పార్టీ అభిమానులు మెండుగా ఉన్నారు కాబ‌ట్టి.. త‌న‌కు గెలుపు న‌ల్లేరుపై న‌డ‌కే అవుతుంద‌ని అనుకున్నారు. చంద్ర‌బాబు త‌న‌ను గుర్తిస్తార‌ని, తాను ఎంచుకున్న సీటును త‌న‌కే కేటాయిస్తార‌ని భావించారు.maxresdefault

ఈ క్ర‌మంలో ఆయ‌న అన‌ధికారికంగా కూక‌ట్‌ప‌ల్లి నియోజ‌కవ‌ర్గంలో స‌భ‌లు కూడా నిర్వ‌హించి యూత్‌ను ఆక‌ర్షించారు. టీడీపీ అనుచ‌రులను ద‌గ్గ‌ర చేసుకున్నారు. కానీ, ఇంత‌లోనే అధినేత చంద్ర‌బాబు ప్లేట్ ఫిరాయించారు. నంద‌మూరి హ‌రికృష్ణ కుమార్తె, ఇప్ప‌టి వ‌ర‌కు ఎవ‌రికీ ప‌రిచ‌యం కూడా లేని సుహాసినినికి కూక‌ట్‌ప‌ల్లి టికెట్ ఇస్తున్న‌ట్టు ప్ర‌క‌టించి పెద్ది రెడ్డి ఆశ‌ల‌పై నీళ్లు చ‌ల్లారు. ఇప్పుడు ఇదే విష‌యాన్ని నెటిజ‌న్లు ప్ర‌శ్నిస్తున్నారు. జ‌గ‌న్ ఏదో బొమ్మిరెడ్డి రాఘ‌వేంద్ర‌రెడ్డి వంటి వారిని న‌ట్టేట ముంచార‌ని ఆరోపిస్తున్న నేప‌థ్యంలో ఇప్పుడు బాబు చేసింది ఏంటి? బాబు అనుకూల మీడియా ఇప్పుడు ఏం చెబుతుంది? అని వారు ప్ర‌శ్నిస్తున్నారు. మ‌రి దీనికి స‌మాధానం చెప్పేదెవ‌రో చూడాలి. మొత్తానికి పెద్దిరెడ్డి ప‌రిస్థితిదారుణంగా త‌యారైంది.

తమ్ముళ్లు నాడు గోలచేసారు ..ఇప్పుడు ఏమంటారు !
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share