బాబుగారి పూత‌లు.. జ‌నం వాత‌లు

February 11, 2019 at 10:58 am

ఆహా ఏమిటిది.. ట‌ర్న్‌ల మీద ట‌ర్న్‌లు.. బాబుగారి యూట‌ర్న్‌లు.. ఒక‌టా రెండా.. ఎన్నెని చెప్పాలి.. ఎన్నెన్న‌ని చెప్పాలి.. ఏమ‌ని చెప్పాలి..! ఎప్పుడు ఏట‌ర్న్ తీసుకువాలో.. ఎక్క‌డ.. ఎప్పుడు..ఎవ‌రిని.. ఎలా వెన్నుపోటు పొడ‌వాలో బాబుగారికి తెలిసినంత‌గా మ‌రెవ్వ‌రికీ తెలియ‌ద‌నీ.. ఇందులో ఆయ‌న‌కు ఉన్నంత సీనియారిటీ మ‌రెవ్వ‌రికీ లేద‌ని స్వ‌యంగా ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీనే సెల‌విచ్చారు. ఏపీకి ప్ర‌త్యేక హోదా నినాదాన్ని పాత‌రేసి.. ఇప్పుడు పూత‌లు పూస్తున్నబాబుకు జ‌నం వాత‌లు పెట్ట‌డం ఖాయంగానే క‌నిపిస్తోంది. ఈ నేప‌థ్యంలోనే వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప‌రాజ‌యం త‌ప్ప‌ద‌నే ఆందోళ‌న‌తోనే బాబుగారి చిత్రాలు మొద‌ల‌య్యాయ‌నే టాక్ జ‌నం నుంచి వినిపిస్తోంది.761056-naidu

ఏపీకి ప్ర‌త్యేక హోదా అవ‌స‌రం లేద‌ని.. కేవ‌లం ప్యాకేజీ ఇస్తే చాల‌ని చంద్ర‌బాబు అనేక సార్లు అనేక స‌మావేశాల్లో చెప్పి, హోదా నినాదాన్ని చంపేందుకు ప్ర‌య‌త్నం చేశారు. ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇవ్వాలంటూ ఆందోళ‌న‌లు చేసిన వారిని అరెస్టులు చేయించారు. ముందు నుంచీ ప్ర‌త్యేక హోదాతోనే ఏపీకి న్యాయం జ‌రుగుతుంద‌ని వైసీపీ అధినేత ఒకే మాట‌పై నిల‌బ‌డుతూ నినాదాన్ని కాపాడుతూ వ‌స్తున్నారు. ఈ క్ర‌మంలోనే మ‌ళ్లీ ఏపీకి ప్ర‌త్యేక హోదా కావాలంటూ చంద్ర‌బాబు ఎన్డీయే నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చి కేంద్రంపై ధ‌ర్మ పోరాటం పేరుతో కొత్త నాట‌కానికి తెర‌తీశారు. నిన్న గుంటూరు స‌భ‌లో ప్ర‌ధాని మోడీ చంద్ర‌బాబు గుట్టును ర‌ట్టు చేశారు. దీని నుంచి జ‌నం ద‌`ష్టిని మ‌ర‌ల్చ‌డానికి ఢిల్లీలో నేడు ధ‌ర్మ‌పోరాట దీక్ష చేప‌డుతున్నార‌నే విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి.chandrababu-modi-666-1549790735

నాలుగేళ్ల‌పాటు ఎన్డీయేతో సంసారం చేసి, ఆంధ్రుల హ‌క్కుల‌ను తాక‌ట్టుపెట్టి.. ఇప్పుడు చంద్ర‌బాబు లొల్లి చేయ‌డంలో అర్థం లేద‌ని.. ఇది కేవ‌లం అధికారం కోస‌మేన‌నే టాక్ సామాన్యుల నుంచి బ‌లంగా వినిపిస్తోంది. ఎన్డీయేలో కొన‌సాగుతున్నంత‌కాలం ఏపీకి ప్ర‌త్యేక హోదా కోసం కొట్లాడ‌ని బాబు.. ఎన్నిక‌ల ముందు బ‌య‌ట‌కు వ‌చ్చి.. తాను ధ‌ర్మాపోరాటం చేస్తున్నానంటూ ఆయ‌న చెప్ప‌డంపై ప్ర‌జ‌లు మండిప‌డుతున్నారు. నూత‌నంగా ఏర్ప‌డిన రాష్ట్ర బాగోగుల‌ను ప‌ట్టించుకోకుండా.. ఎంత‌సేపూ రాజ‌కీయ అంశాల‌పైనే ద‌`ష్టి పెట్ట‌డంతో పాల‌నంతా గాడిత‌ప్పి పాడైపోయింద‌ని అన్నివ‌ర్గాల నుంచి తీవ్ర వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మ‌వుతోంది.

బాబుగారి పూత‌లు.. జ‌నం వాత‌లు
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share