న‌వ్వి పోదురుగాని నాకేంటి..!?

March 12, 2019 at 2:42 pm

లెక్చ‌ర్లు ఇవ్వ‌మంటే గుక్క తిప్పుకోకుండా ఇవ్వ‌డంలో సిద్ద‌హ‌స్తులు.. నీతులు చెప్ప‌డంలో మ‌రింత మ‌హా మ‌హా నేర్ప‌రులు.. ఏక‌బిగిన గంట‌ల త‌ర‌బ‌డి నోటికి తాళం లేకుండా మాట్లాడ‌డంలో రికార్డులు అరిపోయేంత అనుభ‌వ‌శాలురు.. కానీ ప్ర‌త్య‌క్షంగా క్షేత్ర‌స్థాయిలోకి దిగి వాటిని నెర‌వేర్చ‌డంలో మాత్రం తాబేలు లాంటి వ్య‌వ‌హారం.. న‌త్త‌ల క‌న్నా నిదాన‌మైన న‌డ‌క‌కు కేరాఫ్ అడ్ర‌స్ వంటి వారు మ‌న బాబు గారు. ఈ మాట‌లు అంటున్న‌ది ఎక్క‌డో ఉన్న స‌ద‌రు ప్ర‌జ‌లు కాదు.. బాధితులు కాదు.. స్వ‌యానా బాబు గారి సొంతూరు నారావారిప‌ల్లె మ‌నుషులే. మ‌రి క‌న్న ఊరునే ప‌ట్టించుకోనాయ‌నా రాష్ర్టాన్ని ఏ స్థాయిలో ముందుకు తీసుకెళ్తున్నారో అర్థం చేసుకోవ‌చ్చు.

త‌న సొంత గ్రామాన్ని చంద్ర‌బాబు ఏనాడూ ప‌ట్టించుకున్న పాపాన పోలేద‌ని ఆ ఊరి పారిశ్రామిక వేత్త ఆవేద‌న చెందుతున్నాడు. బాబు మాట‌లు న‌మ్మి ఏదేదో ఊహించుకున్నాం.. అభివ్రుద్ది ఏదో ఆకాశం అంచులు తాకే స్థాయిలో ఉంటుంద‌ని ఆశ‌ప‌డ్డాం. కానీ ఆచ‌ర‌ణ‌లో ఆయ‌న గారి కార్యాల‌న్నీ ఎక్క‌డ వేసిన గొంగ‌ళి అక్క‌డే అన్న చందంగా ఉంటాయ‌ని ఏ నాడు ఊహించ‌లేదని, అస‌లు పాల‌న అంత అధ్వానంగా ఉంటుంద‌ని క‌ల‌లో కూడా అనుకోలేద‌ని పేర్కొంటున్నారు. ఆయ‌న పాల‌న మొత్తం అవినీతి మ‌య‌మ‌ని, బాబు మాట‌లు విని ఏదో వ్యాపారం మొద‌లు పెట్టి కోట్ల రూపాయ‌లు న‌ష్ట‌పోవాల్సి వ‌చ్చింద‌ని గోడు వెల్ల‌బోసుకున్నారు.

నారావారి ప‌ల్లెకు చెందిన న‌వీన్‌కుమార్ నాయుడు, చంద్ర‌బాబు నాయుడుగారి పూర్తి ప‌నిత‌నాన్ని పూస‌గుచ్చిన‌ట్టు చెప్పుకొచ్చారు. యువ‌త ఎదుగుద‌ల‌కు బాబు స‌ర్కార్ చేసింది శూన్యం అన్నారు. నైపుణ్యం గ‌ల యువ‌త‌ను అస‌లు చంద్ర‌బాబు స‌ర్కార్ ప‌ట్టించుకున్న దాఖలాలే లేవ‌న్నారు. ఎంతో మంది స్కిల్స్ ఉండి కూడా ఎందుకూ కొర‌గాకుండా పోతున్నార‌ని ఆవేద‌న చెందారు న‌వీన్‌గారు. త‌న ఊరిలో త‌న క‌ళ్ల ముందే క‌ద‌లాడే మ‌నుషులే అయినా వారిని ప‌ట్టించుకున్న పాపాన పోలేద‌ని, మాట‌లు మాత్రం అహా.. ఓహో అంటూ ఉంటాయ‌ని బాబు విశ్వ‌రూపాన్ని మ‌రోమారు బ‌య‌ట‌కు తెచ్చాడు. కాగా, గ్రామానికి చెందిన వ్య‌క్తే ఇలా అన్నాడంటే ఇక రాష్ర్టంలో సామాన్యుడి ప‌రిస్థితి ఎలా ఉండి ఉంటుందో త‌లలో బుర్ర ఉండి ఆలోచించే ఎవ‌రికైనా ఇట్టే తెలిసిపోతుంది.

న‌వ్వి పోదురుగాని నాకేంటి..!?
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share