గంద‌ర‌గోళంలో బాబు ప‌నితీరు..!

March 21, 2019 at 1:05 pm

ఇత‌రుల‌కు నీతులు చెప్పే చంద్ర‌బాబు త‌న వ‌రకు వ‌చ్చే స‌రికి వాటిని వ‌దిలేస్తున్నాని తెలుగుదేశం శ్రేణులు ఆగ్రహం వ్య‌క్తం చేస్తున్నాయి.. వార‌సత్వంగా రాజకీయాలు వ‌ద్ద‌ని, కుటుంబానికి ఒక టిక్కెట్టు మాత్ర‌మే కేటాయిస్తామ‌ని ఖ‌రాఖండిగా చెప్పిన బాబు త‌న కుటుంబం వ‌ర‌కు వ‌చ్చే స‌రికి మాత్రం అవ‌న్నీ ప‌క్క‌న పెట్టాడ‌ని అసంత్రుప్తి వ్య‌క్తం చేస్తున్నారు. త‌న త‌న‌యుడు లోకేశ్‌ను గెలిపించ‌డానికి బాబు ఎంత‌కైనా తెగించ‌డంపై పార్టీ నాయ‌కులంతా ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. ఫ్యామిలీ ప్యాక్ రాజ‌కీయాల విష‌య‌మై త‌న వ‌ర‌కు వ‌చ్చే స‌రికి దాట‌వేత ధోర‌ణిగా న‌డుచుకోవ‌డంపై నిర‌స‌న‌లు తెలుపుతున్నారు. ప‌రిటాల ఫ్యామిలీ విష‌యంలో కావ‌చ్చు, జేసీ కుటుంబ స‌భ్యుల విష‌యంలో కావ‌చ్చు మ‌రికొంద‌రు సిట్టింగ్ ఎమ్మెల్యేల విష‌యంలోనైతేనేమీ బాబు తీరు ర‌క‌ర‌కాలుగా ఉండ‌డంపై పార్టీలో గంద‌ర‌గోళ ప‌రిస్థితి నెల‌కొంది.

కాగా, ఇటు కొడుకును, అటు బాల‌య్య చిన్న‌ల్లుడికి టిక్కెట్ల కేటాయింపు విష‌యంలో చంద్ర‌బాబు చాలా తెలివిగా వ్య‌వ‌హ‌రించార‌ని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఒక ద‌శ‌లో భ‌ర‌త్‌ను ఎలాగైనా పోటీ నుంచి త‌ప్పించి త‌న కొడుకు లోకేశ్‌ను వ‌న్ అండ్ ఓన్లీగా నిల‌ప‌డానికి నానా యాత‌న ప‌డ్డారు. భ‌ర‌త్‌కు టిక్కెట్ విష‌య‌మై కుద‌ర‌ద‌ని ప్ర‌క‌టించారు. కానీ, బావ‌మ‌రిది బాల‌క్రుష్ణ బెట్టుకుపోయిన‌ట్టు తెలుస్తోంది. ఈ విష‌యంలో ఒక ద‌శ‌లో భ‌ర‌త్‌కు టిక్కెట్ ఇవ్వ‌క‌పోతే తాను కూడా హిందూపురం పోటీనుంచి త‌ప్పుకోవ‌డానికి వెన‌కాడ‌న‌ని హెచ్చ‌రించిన‌ట్టు స‌మాచారం. దీంతో మెట్టు దిగిన చంద్ర‌బాబు సీటు కేటాయించ‌క త‌ప్ప‌లేదు. కాగా, పార్టీలో త‌న మాట‌కు త‌ప్ప ఎవ‌రి మాట‌కు విలువ ఇవ్వ‌ని చంద్ర‌బాబు ప‌రిస్థితి ఇప్పుడు అత్యంత ద‌య‌నీయంగా మారింది.

ఒక‌వైపు జ‌గ‌న్ అత్యంత భారీ ప్ర‌జాద‌ర‌ణ‌తో దూసుకెళ్తున్నారు. ఈ విష‌యం చంద్ర‌బాబుకు ఏమాత్రం మింగుడుప‌డ‌డం లేదు. గెలుపు విష‌యం దేవుడెరుగు క‌నీసం పార్టీలో త‌న స్థానానికైనా స‌రైన గుర్తింపు కూడా లేకుండా పోతోంద‌ని బాబు లోలోప‌ల మ‌థ‌న ప‌డుతున్న‌ట్టు తెలుస్తోంది. టిక్కెట్ల కేటాయింపు బ‌హు క‌ష్టంగా మారింది. ఇలాంటి ప‌రిస్థితి **ఫార్టీ ఇయ‌ర్స్ ఇన్ పొలిటిక్స్** అనే వ్య‌క్తికి ఎప్పుడూ ఎదురు కాలేద‌నే చెప్పొచ్చు. ఒక ర‌కంగా ఇది నారా బాబుకు అత్యంత అవ‌మాన‌క‌ర‌మైన ప‌రిస్థితిగా మారింద‌నే చెప్పొచ్చు. కాగా, ఓ వైపు త‌న పోక‌డ‌ల‌తో ఇటు తెలంగాణ‌లో పార్టీని పూర్తిగా నాశ‌నం చేసిన చంద్ర‌బాబు ఇప్పుడు త‌న అధ్వాన‌మైన పాల‌న‌తో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో కూడా పార్టీని పూర్తిగా భ్ర‌ష్టు ప‌ట్టించారని అత‌డికి గ‌తంలో ఉన్నంత సీన్ లేద‌ని ప‌లువురు త‌మ్ముళ్లు బాహ‌టంగానే అంటున్నారు.

గంద‌ర‌గోళంలో బాబు ప‌నితీరు..!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share