డ‌బ్బుల క‌ట్ట‌లు తెచ్చాడేమో గ‌మ‌నించండి.. .. బాబుగారు..!

February 26, 2019 at 3:15 pm

టీడీపీ వ‌ల‌స‌ల‌తో విల‌విల లాడుతోంది. క్యాడ‌ర్ మొత్తం నైరాశ్యంలో ఉంది.. ప్ర‌జ‌ల నుంచి కూడా స్పంద‌న అంతంత మాత్రంగానే ఉంది. పార్టీలో ఉందామ‌నుకున్న వారు కూడా తీవ్ర అసంత్రుప్తులుగానే ఉన్నారు. ఎప్పుడెప్పుడు అవ‌కాశం దొరుకుద్దా బ‌య‌ట‌కు వెళ్దామా అన్న‌ట్టుగా ఉన్న‌ట్టు క‌నిపిస్తోంది.. కేంద్రం నుంచి చంద్రాలుకు క‌య్యం రోజురోజుకు పెరుగుతూనే ఉంది. ప‌క్క రాష్ర్టం తెలంగాణ నుంచి కూడా వైరం తీవ్ర‌మైంది. ఇన్ని గంద‌ర‌గోళాల న‌డుమ చంద్రాలుకు ఎక్క‌డా ఏమీ దొర‌క‌డం లేదు.. అంటే జ‌గ‌న్‌ను ఇరుకున‌పెట్టే ఎలాంటి అస్ర్తం దొర‌క‌డం లేదు. దీంతో లండన్ వెళ్లే ముందు విదేశాల్లో ఉన్న బ్యాంక్ లావాదేవీల కోస‌మ‌ని ఓ కూత కూశారు. దానికి పెద్ద‌గా స్పంద‌న కూడా రాలేదు. ఎందుకంటే జ‌గ‌న్ నిజంగా వెళ్లింది కూతురును చూడ‌డానికని అంద‌రికీ తెలిసిందేన‌యే.

ఇక జ‌గ‌న్ తిరిగి వ‌చ్చాడు. మ‌ళ్లీ చంద్ర‌బాబు మొద‌లుపెడ‌తాడేమో. డ‌బ్బుల మూట‌లు దింపాడు. ఇక పంప‌కాలు చేస్తాడ‌ని ఇష్ట‌మొచ్చిన‌ట్లు మాట్లాడుతాడు కాబోలు చూడాలి. ఎందుకంటే అస‌లే టీడీపీ ప‌రిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. ఎన్నిక‌ల వేళ ప‌డ‌రాని పాట్లు ప‌డుతున్నాడు బాబుగారు. చిన్న‌బాబు కూడా ఏమీ ఆశాజ‌న‌క‌మైన ఎత్తుగ‌డ‌లు వేసేది లేదు.. ఇలాంటి ప‌రిస్థితుల్లో జ‌గ‌న్ పై లేనిపోని అవాక్కులుచెవాక్కులు పేల్చేందుకు మ‌ళ్లీ స్వ‌యంగా చంద్రాలు సారే దిగుతార‌మో. లండ‌న్ నుంచి ఊర‌కే రాలేదు. క‌ట్ట‌క‌ట్ట‌లుగా డ‌బ్బుల సంచులు తీసుకుని వ‌చ్చాడ‌ని దుస్ప్ర‌చారానికి కొత్త శ్రీ‌కారం చుట్టినా ఆశ్చ‌ర్య‌పోవాల్సిన ప‌నిలేదు.

ప్ర‌తీ ప‌నిలో నెగెటివ్‌నే చూసే బాబుగారికి జ‌గ‌న్ విష‌యంలో మాత్రం మంచి ఎక్క‌డ క‌నిపిస్తుంది. లేక‌పోతే ఆ మ‌ధ్య చిన‌బాబు ఏదో దేశానికి వెళ్లి రాయ‌బారం నెరిపి వ‌చ్చాడు. మ‌రి ఆ సంద‌ర్భంలో లోకేశ్ బాబు కూడా డ‌బ్బుల క‌ట్ట‌ల కోస‌మే వెళ్లాడ‌ని ఎవ‌రైనా అన్నారా. అస‌లు ఆ ప్ర‌స్థావ‌న ఎవ‌రైనా తీశారా.. ఏదైనా మ‌నం చూసే ద్రుష్టిని బ‌ట్టి, చేసే చేత‌ల‌ను బ‌ట్టి ఉంటుంది త‌ప్ప ప్ర‌తీ విష‌యాన్ని బూత‌ద్దం వేసి వెతికితే క‌ళ్లు నాశ‌న‌మై ద్రుష్టి లోప‌మే వ‌స్తుంది త‌ప్ప మిగిలేది ఏమీ ఉండ‌దు. దానికి బ‌దులుగా ప్ర‌జ‌ల‌కు ఏమైనా చేద్దామ‌నే దిశ‌గా ఆలోచిస్తే పేరుకుపేరు వ‌స్తుంది. క్రెడిట్ కూడా ద‌క్కుతుంది కాదా బాబుగారూ..

డ‌బ్బుల క‌ట్ట‌లు తెచ్చాడేమో గ‌మ‌నించండి.. .. బాబుగారు..!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share