ఏపీలో రాజ్య‌స‌భ హీటు… ఛాన్స్ ఎవ‌రికో..!

February 24, 2018 at 11:00 am
chandrababu-ys jagan-rajyasabha

గ‌త కొద్ది నెల‌లుగా ఎంతో ఆస‌క్తితో వెయిట్ చేస్తోన్న రాజ్యసభ ఎన్నికలకు షెడ్యూలు విడుదలైంది. ఆంధ్రప్రదేశ్‌ నుంచి మూడు రాజ్యసభ స్థానాలకు ఈసారి ఎన్నికలు జరగనున్నాయి. ఈ మూడు సీట్ల‌కు ఈ సారి పోటీ త‌ప్ప‌ద‌ని తేలిపోయింది. ప్ర‌స్తుతం అసెంబ్లీలో ఉన్న బ‌లాబ‌లాను బ‌ట్టి చూస్తే అధికార టీడీపీకి 2, విప‌క్ష వైసీపీకి 1 సీటు ద‌క్క‌నుంది. ఆంధ్రలో జరిగే ఎన్నికల్లో రాజ్యసభ అభ్యర్థులు తొలి రౌండ్‌ లెక్కింపులోనే గెలవాలంటే 45 ఎమ్మెల్యేల ఓట్లు కావాలి. విప‌క్ష వైసీపీ నుంచి 23 మంది ఎమ్మెల్యేలు జంప్ చేసేయ‌గా ప్ర‌స్తుతం ఆ పార్టీకి అసెంబ్లీలో 45 మంది ఎమ్మెల్యేల బ‌లం ఉంది.

అయితే వైసీపీ నుంచి ఒక్క ఎమ్మెల్యే నిష్క్ర‌మించినా ఎన్నిక‌ల్లో మూడు సీట్ల‌కు న‌లుగురు అభ్య‌ర్థులు పోటీలో ఉండ‌డంతో ఎన్నిక ఉత్కంఠ‌గా మారుతుంది. మ‌రోపక్క రెండు సీట్లను గెలుచుకునే బలం ఉన్న టీడీపీ.. ఈ దఫా మొత్తం మూడు సీట్లకు పోటీ పెట్టాలని ఆలోచిస్తోంది. వైసీపీ నుంచి ఒక్క ఎమ్మెల్యేను లాగేసుకున్నా టీడీపీకి మూడో సీటు విష‌యంలోనూ విజ‌యావ‌కాశాలు ఉంటాయి. వైసీపీ తమ అభ్యర్థిగా నెల్లూరు జిల్లాకు చెందిన వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి పేరును ఇప్పటికే ఖరారు చేసింది.

ఇక టీడీపీ విష‌యానికి వ‌స్తే ప్ర‌స్తుతం ఎంపీలుగా ఉన్న సీఎం ర‌మేశ్ మ‌రోసారి త‌న‌కు రెన్యువ‌ల్ చేయాల‌ని ప‌ట్టుబ‌డుతున్నారు. ఇక మాజీ ఎంపీ కంభంపాటి రామ్మోహన్‌రావు, మాజీ ఎమ్మెల్యే బీద మస్తాన్‌రావు కూడా రేసులో ఉన్నారు. ఇక బీజేపీ వైఖ‌రి ఎలా ఉంటుంద‌న్న‌ది కాస్త స‌స్పెన్స్‌గానే ఉంది. గ‌త ఎన్నిక‌ల్లో ఏపీ కోటాలో కేంద్ర మంత్రి సురేష్ ప్ర‌భు రాజ్య‌స‌భ‌కు ఎంపిక‌య్యారు. ఈ సారి బీజేపీ – టీడీపీ మ‌ధ్య మాట‌ల తూటాలు పేలుతున్నాయి. 

ఇక ఈ సారి రాజ్య‌స‌భ ఎన్నిక‌ల‌ను హైద‌రాబాద్‌లోనే నిర్వ‌హించాల‌ని వైసీపీ రాజ్య‌స‌భ స‌భ్యుడు విజ‌యసాయిరెడ్డి ఎన్నిక‌ల సంఘానికి ఫిర్యాదు చేసినా ఎన్నిక‌ల సంఘం ఈ విన‌తిని తిర‌స్క‌రించ‌డంతో అమ‌రావ‌తిలోనే ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఏదేమైనా ఏపీలో మూడు రాజ్య‌స‌భ సీట్ల‌కు న‌లుగురు పోటీలో ఉండ‌డంతో పాటు టీడీపీ, వైసీపీ ఎన్నిక‌ల‌ను ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకోవ‌డంతో ర‌స‌వ‌త్త‌ర పోటీ త‌ప్పేలా లేదు.

ఏపీలో రాజ్య‌స‌భ హీటు… ఛాన్స్ ఎవ‌రికో..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share