చంద్ర‌గిరిలో టీడీపీ అడ్ర‌స్ ఎక్క‌డ‌..?

August 18, 2018 at 10:09 am

ఏపీ సీఎం చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులో టీడీపీ పరిస్థితి ఎలా ఉంది ? ముఖ్యంగా ఇదే జిల్లాలోని చంద్రగిరిలో పరిస్థితి ఎలా ఉంది? వంటి విషయాలు ఆసక్తిని రేపుతున్నారు. గత రెండు మూడు రోజులుగా ఈ జిల్లా రాజకీయంగా వార్తల్లో నిలిచింది. ఇక్కడ నుంచి 2014లో విజయం సాధించిన వైసీపీ ఎమ్మెల్యే, ఫైర్ బ్రాండ్ చెవిరెడ్డి భాస్కరరెడ్డి సతీమణి.. లక్ష్మి .. డ్వాక్రా మహిళల బ్యాంకు ఖాతాలో రూ.2000 చొప్పున జమచేయడం సంచలనంగా మారింది. ఇక, దీనిని తమకు అనుకూలంగా మలుచుకునేందుకు టీడీపీ నాయకులు చేసిన ప్రయత్నంతో ఇది పెద్దదుమారంగా మారింది. ఈ నగదు పంపిణీ పూర్తిగా ముందస్తుగా ఎన్నికల్లో ఓట్లను కొనుగోలు చేయడమేనని టీడీపీ విమర్శించింది. arunakumari_2322

అయితే, ఇక్కడ బలంగా ఉన్న తమను దెబ్బకొట్టేందుకే టీడీపీ కంకణం కట్టుకుందని చెవిరెడ్డి వర్గీయులు విమర్శిస్తున్నా రు. పూర్తిగా ఇది ఎమ్మెల్యేని టార్గెట్ చేసుకుని చేస్తున్న రగడగా వారు అభివర్ణిస్తుండడం గమనార్హం. చిత్తూరు జిల్లాలోని చంద్రగిరి నియోజకవర్గం….ఇక్కడ 2014లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ నేత, మాజీ మంత్రి గల్లా అరుణ కుమారిపై వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి విజయం సాధించారు. దీంతో ఇప్పుడు వచ్చే ఎన్నికల్లోనయినా చంద్రగిరిలో సైకిల్ సవారీ సాగించాలని తెలుగుదేశం ఆశిస్తోంది. కానీ, పార్టీ అధిష్టానం ఆశించిన స్థాయిలో ఇక్కడ నాయకుడు ఎవరూ లేక పోవడం గమనార్హం. గత ఎన్నికల్లో పోటీ చేసిన మాజీ మంత్రి గల్లా.. ఇక్కడ పార్టీకి గత కొన్నాళ్ల కిందటి వరకు అండగా ఉన్నారు.HY09RAYAL4NAIDU

అంతేకాదు, ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత కూడా టీడీపీ ఇన్చార్జ్గా వ్యవహరించేవారు. అయితే ఆమెకు స్థానికంగా టీడీపీ నేతలతో అంత సఖ్యత కుదరటం లేదు. ఇక కాంగ్రెస్ నుంచి వచ్చిన నేత కావటంతో ఆమెపై వ్యతిరేకత కూడా అంతే స్థాయిలో ఉంది. అంతేకాక వయసు మీద పడటంతో ఆమె తాను నియోజకవర్గం ఇన్చార్జ్గా బాధ్యతలు నిర్వహించలేనని చెప్పేయడంతో అసలు ఇబ్బంది మొదలైంది. గల్లా కుటుంబానికి గట్టి పట్టున్న చోట ఆమె కాడి వదిలేస్తే అది టీడీపీకి తీవ్ర నష్టం చేకూరుస్తుందనే పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. అయితే గల్లా అరుణ నిర్ణయం చెప్పగానే పులవర్తి నాని అనే వ్యాపారవేత్తకి నియోజకవర్గ బాధ్యతలు అప్పగించేందుకు నారా లోకేష్ ప్రయత్నాలు చేశారు.

కానీ ఇవి కూడా అంతగా ఫలించలేదు. గల్లాని కాదంటే కష్టం తప్పదనే అంచనాతో చంద్రబాబు వారించినట్టు కనిపిస్తోంది. ఇక ఇటు గల్లా అరుణ కుమారి పార్టీ కార్యక్రమాలు నిర్వహించడానికి సిద్ధం కాకపోగా, అటు పులవర్తి నాని పార్టీ పనిలో కనిపించకపోవడంతో చంద్రగిరి టీడీపీ సరైన నాయకత్వం లేక దిక్కులు చూస్తోంది. అసలు పార్టీ అధినేత సొంత ఊరు ఉన్న నియోజకవర్గంలోనే టీడీపీ పరిస్థితి ఇంత సందిగ్ధంగా ఉంటే ఎలా అనే చర్చ నడుస్తోంది. దీనికితోడు వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే చెవిరెడ్డి ఇక్కడ దూసుకు పోతున్నారు. ఉద్యోగులు, మహిళలు, సామాన్యుల్లో ఆయన మంచి పేరు తెచ్చుకున్నారు. ఈయనకు సరిరాగల నాయకుడు సైతం టీడీపీలో కనిపించక పోవడం గమనార్హం.Chevireddy-Bhaskar-Reddy

చంద్ర‌గిరిలో టీడీపీ అడ్ర‌స్ ఎక్క‌డ‌..?
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share