అయ్య‌న్న కుమారుడికి బాబాయి సెగ‌.. రాజ‌కీయ సంచ‌ల‌నం!

November 3, 2018 at 10:57 am
22222222

టీడీపీ సీనియ‌ర్ నేత‌, మంత్రి చింత‌కాయ‌ల అయ్య‌న్న పాత్రుడు ఇంట్లో రాజీక‌య ముస‌లం పుట్టింది. సొంత త‌మ్ముడు, జిల్లా జెడ్పీ వైస్ చైర్మ‌న్ స‌న్యాసి పాత్రుడే ఈ ముస‌లానికి మూల పురుషుడుగా మారిపోయాడు. ఏకంగా సొంత అన్న కుమారుడు, వ‌చ్చే ఎన్నిక‌ల్లో రంగంలోకి దిగాల‌ని భావిస్తున్న చింతకాయల విజయ్‌పై నిప్పులు చెరిగాడు. పార్టీని తీవ్ర‌స్థాయిలో అస్థిర‌ప‌రుస్తున్నాడంటూ.. తీవ్ర ఆరోప‌ణ‌ల‌తో చెల‌రేగిపోయారు. అంతేకాదు, ఈ విష‌యంపై ఏకంగా టీడీపీ అధినేత చంద్ర‌బాబుకే నేరుగా ఫిర్యాదుచేశారు. అంతేకాదు, విజ‌య్‌పై త‌క్ష‌ణ‌మే చ‌ర్య‌లు తీసుకొవాల‌ని కోరడం మ‌రింత వివాదానికి దారితీసింది. మున్సిపాలిటీలో అధిష్టానం ఆదేశాల మేరకు వార్డు, సంకల్ప కమిటీలతో గ్రామదర్శిని విజయవంతంగా నిర్వహిస్తున్నట్టు సన్యాసిపాత్రుడు లేఖలో పేర్కొన్నారు.12

గత కొద్ది రోజులుగా ఆర్‌అండ్‌బీ శాఖా మంత్రి అయ్యన్నపాత్రుడు తనయుడు విజయ్‌ అతని అనుచరులతో ప్రత్యేక వర్గంగా ఏర్పడి గ్రామదర్శిని పూర్తి కాకుండానే ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని తెలిపారు. పట్టణ అధ్యక్షుడిగా తనకు, ఇతర కమిటీలకు కనీస సమాచారం లేకుండా ఏకపక్షంగా ఇంటింటికీ తెలుగుదేశం నిర్వహిస్తున్నారని, ఈ విధానం పట్ల నాయకులు, కార్యకర్తలు అసంతృప్తితో ఉన్నారని లేఖలో తెలిపారు. దీంతో పార్టీ కార్యక్రమాలు చేయాలా.. వద్దా? అనే అయోమయంలో ఉన్నారని పేర్కొన్నారు. అయితే నర్సీపట్నం నియోజక వర్గంలో టీడీపీ ఏర్పడినప్పటి నుంచి రూరల్‌ ప్రాంతం కంటే మున్సిపాలిటీలో ఎక్కువ మెజారిటీ ఇచ్చి పార్టీ విజయానికి కారకులయ్యామని తెలిపారు. పార్టీ అధ్యక్షుడిగా తనకుగాని, బూత్‌ కన్వీనర్లకుగాని తెలియకుండా విజయ్‌ కొత్తగా అనుచర వర్గాన్ని ఏర్పాటు చేసుకున్నట్టు వెల్లడించారు.43952073_1270919986378430_2420495361589116928_n

అంతేకాదు, విజయ్‌కు ఎటువంటి పార్టీ పదవి లేదని, ఈ నాలుగేళ్ల కాలంలో ఎటువంటి పార్టీ కార్యక్రమంలో పాల్గొనడం, ప్రజలతో మమేకం కావ డం జరగలేదని లేఖలో సన్యాసిపాత్రుడు పేర్కొన్నారు. కేవలం మంత్రి తనయుడు హోదాలో హఠాత్తుగా ఈ కార్యక్రమాన్ని సొంత అనుచరులతో నిర్వహిస్తున్నారని వెల్లడించారు. ఇదిలాగే కొనసాగితే నియోజకవర్గంలో పార్టీ కేడర్‌ రెండుగా చీలిపోయే ప్రమాదం ఉందని లేఖలో ఆయన పేర్కొన్నారు. ఈ పరిణామం 2019లో జరిగే ఎన్నికలపై తీవ్ర ప్రభావం చూపుతుందని వెల్లడించారు. అయితే, స‌న్యాసి పాత్రుడు లేఖ విష‌యం సంచ‌ల‌నంగా మారింది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో తానే స్వ‌యంగా న‌ర్సీప‌ట్నం నుంచి పోటీ చేయాల‌ని ఆయ‌న భావిస్తున్నారా? అని కొంద‌రు ప్ర‌శ్నించుకున్నారు. వాస్త‌వానికి వ‌చ్చే ఎన్నిక‌ల్లో అయ్య‌న్న పోటీకి దూర‌మ‌య్యే అవ‌కాశం క‌నిపిస్తోంది. ఈ నేప‌థ్యంలో ఆయ‌న త‌న కుమారుడు విజ‌య్‌ను రంగంలోకి దింపాల‌ని నిర్ణ‌యించుకున్నారు. ఇటీవ‌ల విజ‌య్ కూడా పార్టీలో ప‌లు కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్త‌న్నారు. అయితే, తాజాగా ఆయ‌నపై క‌త్తికట్టిన‌ట్టుగా సొంత బాబాయే ఇలా ఫిర్యాదు చేసి చ‌ర్య‌లు కోర‌డం సంచ‌ల‌నం సృష్టిస్తోంది. మ‌రి దీనిపై అటు అయ్య‌న్న ఇటు చంద్ర‌బాబు ఎవ‌రూ స్పందించ‌క పోవ‌డం గ‌మ‌నార్హం.

అయ్య‌న్న కుమారుడికి బాబాయి సెగ‌.. రాజ‌కీయ సంచ‌ల‌నం!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share