కొఠారు మ్యానిఫెస్టో దెబ్బకు చింత‌మ‌నేనికి చెమ‌ట‌లు

October 12, 2018 at 1:15 pm

ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా దెందులూరు నియోజ‌వ‌క‌ర్గం. రాష్ట్ర రాజ‌కీయాల్లోనే అత్యంత వివాదాస్ప‌ద‌మైన నియోజ‌క‌వ‌ర్గంగా పేరు బ‌డ్డ ఇక్క‌డ అన్నీ తానై వ్య‌వ‌హ‌రిస్తున్నారు టీడీపీ ఎమ్మెల్యే చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్‌. ఒక‌ర‌కంగా ఆయ‌న నియంతృత్వ ధోర‌ణి ఇక్క‌డ సాగుతోంది. త‌న‌ను ఎవ‌రూ ప్ర‌శ్నించ‌రాద‌నే అత్యుత్సాహంతో ఆయ‌న ఉన్నారు. ప్ర‌తి ప‌నిలోనూ ఆయ‌న మార్కు క‌ర‌కు వైఖ‌రి స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. ఇక్క‌డ అభివృద్ధి కూడా అంతంత మాత్ర‌మే. త‌నకు తిరుగులేద‌నే స్వ‌భావంతో ఎంత‌సేపూ దూకుడు ప్ర‌ద‌ర్శిస్తున్న చింత‌మ‌నేనికి ఇప్పుడు ఇక్క‌డ ఎదురుగాలి వీస్తోంది. ఆయ‌న‌ను వ‌ద్ద‌నే వారి సంఖ్య కూడా పెరుగుతోంది. ఇక‌, ఇదేస‌మ‌యంలో చింత‌మ‌నేనికి మొగుడుగా భావిస్తున్న వైసీపీ స‌మ‌న్వ‌యక‌ర్త కొఠారు అబ్బ‌య్య చౌద‌రి దూసుకు పోతున్నారు. ప్ర‌తి ఒక్క‌రినీ ఆయ‌న కలుపుకొని పోతున్నారు. 35771059_251782072039369_618038724378230784_n

ఇక్క‌డి ప్ర‌జ‌లకు ఏ చిన్న క‌ష్టం వ‌చ్చినా నేనున్నానంటూ.. ఆయ‌న ముందుకు వ‌స్తున్నారు. దీంతో చింత‌మ‌నేనిని వ్య‌తిరేకిస్తున్న స‌గానికిపైగా నియోజ‌క‌వ‌ర్గం ప్ర‌జ‌లు ఇప్పుడు అబ్బ‌య్య చౌద‌రికి మ‌ద్ద‌తు ప‌లుకుతున్నారు. ఇప్ప‌టికే ఆయ‌న ఈ నియోజ‌క‌వ‌ర్గంలో పాద‌యాత్ర నిర్వ‌హించి యువ‌త‌ను త‌న‌వైపు తిప్పుకొన్నారు. అదేవిధంగా ఇక్క‌డి ప్ర‌జ‌లకు ముఖ్యంగా పోల‌వ‌రం ప్రాజెక్టు నిర్వాసితుల‌కు జ‌రుగుతున్న అన్యాయంపైనా గ‌ళం విప్పారు. దీంతో చింత‌మ‌నేని హ‌వాకు దాదాపు బ్రేకులు ప‌డుతున్న ప‌రిస్థితి క‌నిపిస్తోంది. చింత‌మ‌నేని ఇక్క‌డ చేసిన అభివృద్ధి కంటే అరాచ‌కాల లెక్కే ఎక్కువ‌. త‌న మ‌నుషుల‌తో హ‌వా చ‌లాయించ‌డం మిన‌హా ఆయ‌న ఇక్క‌డ చేసింది కూడా ఏమీ లేదు. కానీ, ఇప్పుడు మాత్రం కొఠారు అబ్బ‌య్య చౌద‌రి హ‌వాతో ఆయ‌న‌కుఎదురు గాలి వీస్తోంది. దీంతో ఆయ‌న త‌ర‌చుగా ప్ర‌జ‌ల్లో క‌నిపిస్తున్నారు. 33780065_241168709767372_5446511408889987072_o

ఇక‌, ఎన్నిక‌ల‌కు ఆరు మాసాలే గ‌డువు ఉండ‌డంతో కొఠారు అబ్బ‌య్య చౌద‌రి మ‌రింత వేగంగా స్పందిస్తున్నారు. నియోజ‌క‌వ‌ర్గంలో ఇప్ప‌టికే రెండు సార్లు ప్ర‌తి ఇంటినీ ట‌చ్ చేసిన ఆయ‌న ఇక్క‌డ ఎలాంటి అభివృద్ధి కార్య‌క్ర‌మాలు చేయాలి? ప్ర‌జ‌ల‌కు ఏవిధ‌మైన మేలు చేయాల‌నే విష‌యంలో క్లారిటీతో ఉన్నారు. దీంతో ఆయ‌న ఇప్ప‌టికే ఓ చిన్న‌సైజు మ్యానిఫెస్టో ఒక‌టి త‌యారు చేయించి ప్ర‌జ‌ల్లోకి వ‌దిలారు. నిజానికి ఇప్ప‌టికే వైసీపీ త‌ర‌ఫున ప‌లు ప్ర‌జా సంక్షేమ కార్య‌క్ర‌మాల‌పై నాయ‌కులు విస్తృతంగా ప్ర‌చారం చేస్తున్నారు. న‌వ‌ర‌త్నాలు, బీసీ డిక్ల‌రేష‌న్‌, పింఛ‌న్ల పెంపు వంటి కీల‌క అంశాల‌ను ప్ర‌జ‌ల్లోకి తీసుకు వెళ్లారు. అయితే, వీటికి తోడుగా కొఠారు అబ్బ‌య్య చౌద‌రి తాను ఎమ్మెల్యేగా ఎన్నికైతే.. నియోజ‌క‌వ‌ర్గానికి చేయ‌బోయే కార్య‌క్ర‌మాల‌పై దృష్టి పెట్టి.. మ్యానిఫెస్టోని క‌టౌట్ల రూపంలో ఏర్పాటు చేయించారు.36087462_255931771624399_1241283026428624896_n

వీటిలో ప్ర‌ధానంగా తాను ఎమ్మెల్యే అయితే.. నియోజ‌క‌వ‌ర్గానికి చేప‌ట్ట‌బోయే కార్య‌క్ర‌మాల‌ను విస్తృతంగా వివ‌రించారు. ప్ర‌ధానంగా దెందులూరు నియోజ‌క‌వ‌ర్గంలోని అన్ని గ్రామాల ప్ర‌జ‌ల‌కు తాగునీరును చేరువ చేస్తాన‌ని ఆయ‌న హామీ ఇచ్చారు. అదేవిధంగా నాణ్య‌మై విద్య‌తో యువ‌త‌కు ఉన్న‌త ఉపాధి అవ‌కాశాలు క‌ల్పించేలా కృషి చేస్తాన‌ని చెప్పుకొచ్చారు. మెరుగైన ఆరోగ్యం కోసం వైద్యాన్ని మ‌రింత చేరువ చేస్తాన‌ని హామీ ఇచ్చారు. ఇక‌, దెందులూరులో రైతుల‌కు పంట‌ల‌కు గిట్టుబాటు ధ‌ర‌లు క‌ల్పించేందుకు కృషి చేయ‌డంతోపాటు ఈ స‌మ‌స్య‌పై ప్ర‌భుత్వం స్పందించేలా చ‌ట్ట‌స‌భ‌ల్లో పోరాడ‌తాన‌ని హామీ ఇచ్చారు. ఇక‌, నియోజ‌క‌వ‌ర్గంలో అత్యంత కీల‌క‌మైన రోడ్లు, ఇత‌ర మౌలిక స‌దుపాయాల‌ను మ‌రింత మెరుగ‌య్యేలా కృషి చేస్తాన‌ని ప్ర‌జ‌ల‌కు ఆయ‌న హామీ ఇచ్చారు. అంతేకాదు, దెందులూరు నియోజ‌వ‌క‌ర్గం ప్ర‌జ‌ల‌కు మ‌రిన్ని కోరికలు, క‌ల‌లు ఉన్నాయ‌ని, వాటిని సాకారం చేసేందుకు కృషి చేస్తాన‌ని వివ‌రించారు. ఈ హామీలు కొఠారు జ‌నాల్లోకి బ‌లంగా తీసుకు వెళుతుండ‌డంతో చింత‌మ‌నేని కాస్త టెన్ష‌న్‌తో ఉన్న‌ట్టే తెలుస్తోంది.

కొఠారు మ్యానిఫెస్టో దెబ్బకు చింత‌మ‌నేనికి చెమ‌ట‌లు
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share