క్రిస్టియ‌న్ ఓటు బ్యాంకు ఎవ‌రికి..!

February 4, 2019 at 5:05 pm

రాష్ట్రంలో ఎన్నిక‌లు స‌మీపిస్తున్న నేప‌థ్యంలో ప్ర‌తి ఓటు కీల‌కంగా మారింది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో అధికారంలోకి వ‌చ్చేందు కు ఎవ‌రికి వారు, ఏ పార్టీకి ఆ పార్టీ వ్యూహాత్మ‌కంగా ముందుకు వెళ్తున్నాయి. ఈ క్ర‌మంలో అధికార టీడీపీ ముందంజ‌లో ఉంది. అన్ని సామాజిక వ‌ర్గాల‌కు కూడా కార్పొరేష‌న్లు ఏర్పాటు చేసి, వారిని ఆర్థికంగా ఆదుకునేందుకు సంక‌ల్పించి కొన్ని కార్పొరేష‌న్ల‌కు ఇప్ప‌టికే డ‌బ్బులు కూడా కేటాయించింది. ఇక‌, కాపుల‌ను మ‌చ్చిక చేసుకునేందుకు కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన 10% రిజ‌ర్వేష‌న్ల‌ను వారికి 5% ప్ర‌క‌టించారు. అదేస‌మ‌యంలో బీసీ వ‌ర్గాల‌ను అక్కున చేర్చుకునేందుకు అనేక ప‌థ‌కాలు, పింఛ‌న్లు కూడా ప్ర‌క‌టించారు. ఇలా ప్ర‌తి ఒక్క‌రికీ ఏదో ఒక సూత్రంతో బాబు అడుగులు వేస్తున్నారు.

ఇక‌, జ‌గ‌న్ విష‌యానికి వ‌స్తే.. వైసీపీ త‌ర‌ఫున ఈ త‌ర‌హా ప్ర‌చారం మృగ్య‌మైంది. న‌వ‌ర‌త్నాలు అని ప్ర‌క‌టించినా.. ప్ర‌జ‌ల్లో చ‌ర్చ‌కు అంద‌డంలేదు. పైగా ఎప్ప‌టిక‌ప్పుడు చంద్ర‌బాబు వ్యూహాల‌పై వ్యూహాలు మార్చుకుని ముందుకు వెళ్తుంటే.. జ‌గ‌న్ మాత్రం వ్యూహాల‌కు దూరంగా ఉంటున్నారు. ఇక‌, ప‌వ‌న్ ప‌రిస్థితి కూడా ఇలానే ఉంది. ఆదిలో చేసిన హ‌డావుడి ఇప్ప‌టికీ చేయ‌లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం. ఆయ‌న ఇప్ప‌టికీ ఓ ఐదు జిల్లాల్లో ప‌ర్య‌టించిన దాఖ‌లా కానీ, అక్క‌డి ప‌రిస్థితుల పై అధ్య‌యనం చేసిన దాఖ‌లా కానీ క‌నిపించ‌దు. ఇక‌, ఈ నేప‌థ్యంలో రాష్ట్రంలో ఎక్కువ‌గా ఉన్న ముఖ్యంగా కులాల‌కు అతీతంగా ఉన్న క్రిస్టియ‌న్ ఓట్ల ప‌రిస్థితి ఏంటి? అనేది చ‌ర్చ‌కు దారితీస్తోంది.

రాష్ట్ర వ్యాప్తంగా ప్ర‌తి జిల్లాల్లోనూ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో కూడా కులాల‌కు అతీతంగా క్రిస్టియానిటీని స‌మ‌ర్ధించే వారు ఉన్నారు. ఈ క్ర‌మంలోనే బ‌హుశ గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలో వైసీపీ గౌర‌వ అధ్య‌క్షురాలు విజ‌యమ్మ చేతిలో బైబిల్‌తోనే ప్ర‌చారానికి వ‌చ్చారు. ఎక్క‌డ ఆమె మీడియాతో మాట్లాడినా, బ‌హిరంగ వేదిక‌ల‌పై మాట్లాడినా పూర్తిగా ఆమె బైబిల్‌ను చేతిలోప‌ట్టుకునే ప్ర‌సంగించారు. దీనికి ప్ర‌ధాన కార‌ణం.. కులాల‌కు అతీతంగా క్రిస్టియానిటీని అనుస‌రించే విశ్వాసులు ఉండ‌డం వ‌ల్లేన‌నేది పెద్ద వాద‌న‌. వీరి మ‌ద్ద‌తు ఉంటే ఎన్నిక‌ల్లో గ‌ట్టెక్క‌వ‌చ్చ‌ని భావ‌న‌. ప్ర‌స్తుతం వీరి మ‌ద్దతు పూర్తిగా వైసీపీకి ఉంద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. అయితే, ఇటీవ‌ల కాలంలో హ‌డావుడి చేస్తున్న ప్ర‌జాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ క్రిస్టియ‌న్ ఓట్ల‌ను చీల్చి వైసీపీకి ఎస‌రు పెట్టేందుకు ప్ర‌య‌త్నిస్తున్నార‌ని వ్యాఖ్యానిస్తున్నారు. మ‌రి ఇదే నిజ‌మైతే.. ఏం జ‌రుగుతుంది? టీడీపీ , జ‌న‌సేన‌లు లాభిస్తాయా? అనేది వేచి చూడాలి.

క్రిస్టియ‌న్ ఓటు బ్యాంకు ఎవ‌రికి..!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share