ఆలీ దూకుడు ..తేల్చని నేతలు ..ఏమౌతుంది?

January 9, 2019 at 10:29 am

జీవితంలో లౌక్యం ఉన్నా లేక పోయినా రాజ‌కీయాల్లో మాత్రం లౌక్యం తప్ప‌దు. నాయ‌కుల మ‌న‌సుల్లో ఏమున్నా కూడా.. ప్ర‌జ‌ల మ‌నసు తెలుసుకుని ముందుకు వెళ్తేనే పాలిటిక్స్‌లో ఫ్యూచ‌ర్ ఉంటుంది. ప్ర‌స్తుతం మ‌న‌ముందున్న నాయ‌కులు అంద‌రూ కూడా ఇదే త‌ర‌హా వ్య‌వ‌హారాలు చేస్తున్నారు. పొలిటిక‌ల్ బ‌రిలోకి అడుగు పెడుతూనే తాము ప్ర‌జ‌లకు సేవ చేసేందుకు మాత్ర‌మే ముందుకు వ‌చ్చామ‌ని ప్ర‌క‌ట‌న‌లు గుప్పిస్తున్నారు.ఇక‌, ఆ త‌ర్వాత వారు ఏం చేస్తున్నారో.. ఏం చేస్తారో ప్ర‌తి ఒక్క‌రికీ తెలియంది ఏమీ కాదు. అయితే, ఇప్పుడున్న ఈ పొలిటిక‌ల్ ట్రెండ్‌కు భిన్నంగా క‌మెడియ‌న్ అలీ ముందుకు వెళ్తున్నారు. త‌న మ‌న‌సులో మాట‌ను నిర్మొహ‌మాటంగా వెల్ల‌డిస్తున్నాడు. అయితే, ఇది ప్ర‌జ‌లు ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి.

వెండి తెర‌పై న‌వ్వుల కొండగా పేరు తెచ్చుకున్న అలీ.. ఇప్పుడు రాజ‌కీయ అరంగేట్రం చేయాల‌ని భావిస్తున్నారు. దీనికి సంబంధించి గ‌డిచిన నాలుగు రోజులుగా పెద్ద ఎత్తున ఆయ‌న కీల‌క‌మైన మూడు పార్టీల నేత‌లతోనూ భేటీ అవుతున్నారు. ముందు అసలు ప‌వ‌న్ పెట్టిన పార్టీ జ‌న‌సేన‌లోకి వెళ్లి సేవ చేస్తాన‌ని ఆయ‌న చెప్పిన‌ట్టు వార్త‌లు వ‌చ్చాయి. అయితే, ఇది జ‌రిగి ఏడాది అయింది. ఇక‌, ఇప్పుడు ఎన్నిక‌ల స‌మ‌యం స‌మీపించే స‌రికి అలీ వైసీపీ నాయ‌కుడు జ‌గ‌న్‌తో భేటీ అయి ఆయ‌న ప‌క్క‌న కూర్చున్న ఫొటో వైర‌ల్ కావ‌డం, ఇంకే ముంది అలీ వైసీపీ తీర్థం పుచ్చుకుంటున్నార‌నే ప్ర‌చారం ఊపం దుకుంది. ఈ ప్ర‌చారం ఒక ప‌క్కన జ‌రుగుతుండ‌గానే .. పెద్ద ఎత్తున విశ్లేష‌ణ‌లు వ‌స్తున్న నేప‌థ్యం తెలిసిందే.

అయితే, ఇంత‌లోనే అలీ.. చంద్ర‌బాబుతో బేటీ అయ్యారు. ఆ వెంట‌నే మంత్రి గంటా శ్రీనివాస‌రావుతో క‌లిసి కూర్చుని గంట‌కు పైగా మాట్టాడిన‌ట్టు వార్త‌లు వ‌చ్చాయి. స‌రే.. ఇంత‌కీ ఏ పార్టీలోకి వెళ్లేదీ అలీ క‌న్ఫ‌ర్మ్ చేయ‌లేదు. అయితే, ఈ సంద‌ర్భంగా అలీ చేసిన‌ట్టు వ‌స్తున్న వ్యాఖ్య‌లు అంద‌రినీ విస్మ‌యానికి గురి చేస్తున్నాయి.త‌న‌కు ప్ర‌జ‌ల్లో భారీ గుర్తింపు ఉంద‌ని, కాబ‌ట్టి సామాన్య కార్య‌క‌ర్త‌గానో.. నాయ‌కుడిగానో ఉండి పోవాల్సిన అవ‌సరం త‌న‌కు లేద‌ని, కాబ‌ట్టి ఎమ్మెల్యే టికెట్ కావాల‌ని అలీ నిర్మొహ‌మాటంగా వెల్ల‌డ‌స్తున్నాడు. అదేస‌మ‌యంలో మైనార్టీ కోటాలో త‌న‌కు మంత్రి ప‌ద‌వి కూడా కావాల‌ని ఆయ‌న కోరుతున్నాడు. ఇవ‌న్నీ చూస్తుంటే.. రాజ‌కీయాల్లోకి వ‌చ్చేవారు చెప్పే.. మేం ప్ర‌జ‌ల‌కు సేవ చేయడానికే వ‌చ్చాం అనే డైలాగులు మాత్రం ఇప్ప‌టి వ‌ర‌కు అలీ నోటి వెంట రాక‌పోవ‌డం గ‌మ‌నార్హం.

అంతేకాదు, త‌న ఎమ్మెల్యే ప‌ద‌వి, మంత్రి ప‌ద‌వి కోసం స‌మాజంలో త‌న స్టేట‌స్‌ను పెంచుకోవ‌డం కోసం అలీ వ‌స్తున్న‌ట్టే బావించాల్సి ఉంటుంది. మ‌రి ఈస్ట్ర‌యిట్ ఫార్వ‌ర్డ్ వ్య‌వ‌హారాన్ని ప్ర‌జ‌లు ఎలా స్వీక‌రిస్తారు? అనేది ప్ర‌ధాన ప్ర‌శ్న‌. చూడాలి ఏ పార్టీలోకి వెళ్తాడో.. ఎలా ప్ర‌చారం చేస్తాడో. ఇప్ప‌టి వ‌ర‌కు అయితే, అలీ ఎక్క‌డా తాను ప్ర‌జాసేవ కోసం వ‌స్తున్న‌ట్గుగా చెప్ప‌కపోవ‌డం గ‌మ‌నార్హం. దీనిని ప్ర‌జ‌లు ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి.

ఆలీ దూకుడు ..తేల్చని నేతలు ..ఏమౌతుంది?
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share