తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థి పై దాడి ..నిమ్స్‌కు త‌ర‌లింపు

December 7, 2018 at 1:12 pm
333333333333333333

కల్వకుర్తి కాంగ్రెస్ అభ్యర్థి – తాజా మాజీ ఎమ్మెల్యే వంశీచంద్ రెడ్డిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. నియోజకవర్గంలోని అమనగల్లు మండలంలోని జంగారెడ్డి పల్లిలో పోలీంగ్ బూత్ ను పరిశీలించడానికి వచ్చిన ఆయనపై దాడి చేశారు. దీంతో మహబూబ్ నగర్ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కొందరు గుర్తు తెలియ‌ని వ్యక్తులు వంశీచంద్ రెడ్డి కారుపై రాల్లు రువ్వడంతో కారు అద్దాలు పగిలిపోయాయి. వంశీచంద్ రెడ్డికి గాయాలయ్యాయి. దీంతో పోలీసులు వచ్చి అల్లరిమూకను తరిమికొట్టి ఆయన్ను ఆస్పత్రికి తరలించారు. బీజేపీ కార్యకర్తలే వంశీపై దాడి చేశారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు.

మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ నిమ్స్ కు ఆయన్ను తరలించారు. ఈ ఘటనతో కల్వకుర్తిలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇక రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గంలోని కోస్గిలో కాంగ్రెస్ – టీడీపీ-టీఆర్ ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. పోలీసులు వారిని చెదరగొట్టారు. నిజామాబాద్ లోని మోపాల్ మండలం ఎల్లమ్మకుంటలో టీఆర్ ఎస్-కాంగ్రెస్ వర్గీయుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఐదుగురికి గాయాలయ్యాయి. వరంగల్ రూరల్ జిల్లా ఖానాపూర్ లో టీఆర్ ఎస్ – కాంగ్రెస్ వర్గీయుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. వరంగల్ లో మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు.47575405_2277798269117018_1291573910894018560_n

టీఆర్ ఎస్ ప్ర‌భుత్వం కావాల‌నే దాడి చేయిస్తోంద‌ని ప‌లు చోట్ల కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌లు నిర‌స‌న‌కు దిగారు. ఇదిలా ఉండ‌గా క‌ల్వ‌కుర్తికి బ‌ల‌గాల‌ను త‌ర‌లించి ఎట్లాంటి అల‌జ‌డులు రేగ‌కుండా చూసేందుకు పోలీస్ అధికారులు చ‌ర్య‌లు తీసుకున్నారు. పోలింగ్‌కు అంత‌రాయం జ‌ర‌గ‌కుండా చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. మొత్తానికి నియోజ‌క‌వ‌ర్గంలో హై టెన్ష‌న్ క్రియేటైంది. దాడితో త‌మ‌కు ఎలాంటి సంబంధం లేద‌ని ఇప్ప‌టికే టీఆర్ ఎస్ నేత‌లు ప్ర‌క‌టించిన‌ప్పటికీ ఆ పార్టీలోని కొంత‌మంది పేర్ల‌ను కాంగ్రెస్ నేత‌లు వెల్ల‌డిస్తూ వారి ప‌నేన‌ని పేర్కొంటున్న‌ట్లు స‌మాచారం. ఇది చినికి చినికి దేనికి దారితీస్తోంద‌ని నియోజ‌క వ‌ర్గ ప్ర‌జ‌లు ఆందోళ‌న చెందుతున్నారు.

తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థి పై దాడి ..నిమ్స్‌కు త‌ర‌లింపు
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share