సిపిఎం డీల్ కు పవన్ జెల్ల కొట్టినట్టే

September 17, 2018 at 7:37 am

తెలంగాణలో సీపీఎం తో జనసేన పొత్తు కుదిరే అవకాశం కనిపించడం లేదు. చాలారోజులుగా సీపీఎం పవన్ కల్యాణ్ అంగీకరంకోసం ఆయన చుట్టూ తిరుగుతోంది. రెండు దఫాలుగా ఆయన పార్టీ ప్రతినిధులతో భేటీ కూడా అయ్యింది. అయినా ఇప్పటి దాకా ఏసంగతి తేల్చలేదు. మరోవైపు మిగతా అన్ని పార్టీల కూటములు పూర్తయిపోయాయి. జనసేన గనుక ఒప్పుకోకపోతే సీపీఎం ఈఎన్నికల్లో ఒంటరి అయిపోతుంది. దానివలన పార్టీ కి బాగా నష్టం జరిగే అవకాశం ఉంది. పవన్ కల్యాణ్ ను నమ్ముకున్నందుకు, వారికోసం ఎదురుచూసినందుకు టెంకిజెల్ల పడినట్టవుతుంది.t_710x400xt_710x400xt

తెలంగాణలో పరిస్థితి ఈరకంగావుంటే మరో వైపు ఆంద్రప్రదేశ్ లో పవన్ కళ్యాణ్ తో కలిసే పోటీ చేస్తాం అంటూ సీపీఎం నాయకురాలు బృందాకారత్ అంటున్నారు. ఒకచోట పవన్ చేతిలో భంగపాటు రుచుచూస్తూనే మరొకచోట ఆయనతో పొత్తులకోసం ఏరకంగా ఎగబడుతున్నారో అర్థం కావడంలేదు. అసలే ఆంధ్రప్రదేశ్ లో కూడా సీపీఎం,సీపీఐ లకు విలువ ఇవ్వడం పవన్ కల్యాణ్ ఇటీవల కాలంలో బాగా తగ్గించేశారు. విజయవాడలో నిర్వహించిన మహాగర్జన సభకు హాజరు కావలసిందిగా వామపక్షాల నాయకులు పదేపదే కోరినప్పటికీ జనసేన హాజరు కాలేదు.17VJPAWANLEFT

ఇన్నిరకలుగా దెబ్బలు తగులుతున్నప్పటికీ పవన్ కల్యాణ్ తో కలిసే పోటీ చేస్తాం అని సీపీఎం నాయకులు అంటూనే ఉన్నారు. అలా చెప్పుకోవడం వలన తమ పార్టీ కి క్రేజ్ పెరుగుతుంది అని వారు కలగంటున్నారో ఏమో తెలియదు.తెలంగాణ పరిణామాలను గమనించాకకూడా వారు ఎలా ఆశలు పెట్టుకుంటున్నారో తెలియదు. ఈవ్యవహారాలను మొత్తం గమనించినప్పుడు మబ్బుల్లో నీళ్ళు చూసి ముంత ఒలకబోసుకున్నట్టు ఉందని, పొత్తుల విషయంలో పవన్ వైఖరితో పాఠాలు నేర్చుకోవలసి ఉందని ప్రజలు భావిస్తున్నారు.tammineni-veerabhadram

సిపిఎం డీల్ కు పవన్ జెల్ల కొట్టినట్టే
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share