మాజీ మంత్రి డీఎల్ షాకింగ్ డెసిష‌న్‌!

August 20, 2018 at 10:10 am

రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు మరో ఆరేడు మాసాలే సమయం ఉండడంతో కాంగ్రెస్ సీనియర్ నేత(ఇప్పుడు లేరు), మాజీ మంత్రి డీఎల్ రవీంద్రా రెడ్డి యూటర్న్ తీసుకున్నట్టు తెలిసింది. నిన్న మొన్నటి వరకు ఆయన టీడీపీలో చేరతారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ముఖ్యంగా వైసీపీకి కడపలో పుట్టగతులు లేకుండా చేయాలంటే.. డీఎల్ వంటి సమర్ధులైన నాయకులు అవసరమని భావించిన టీడీపీ అధినేత చంద్రబాబు.. ఆదిశగా ఆలోచించి డీఎల్ను పార్టీలోకి ఆహ్వానించారని ప్రచారం జరిగింది. ఇది నిజమే అన్నట్టుగా కొన్ని వ్యాఖ్యలు కూడా వచ్చాయి., ఎలాగూ వచ్చే ఎన్నికల్లో జగన్ను ఆయన సొంత జిల్లాలో దెబ్బతీయాలని చంద్రబాబు నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో ఇదే జిల్లాకు చెందిన డీఎల్, సీనియర్ నాయకుడు కూడా అయినఆయనను పార్టీలోకి తీసుకుంటారని అందరూ భావించారు.D-L-Ravindra-Reddy

డీఎల్ను పార్టీలోకి ఆహ్వానించడంతోపాటు జల్లా బాధ్యతలను కూడా ఆయనకే అప్పగిస్తారని, మైదుకూరు నియోజ కవర్గం టికెట్ ఇస్తారని, లేదంటే అప్పటి పరిస్థితిని బట్టి ఆయనకు కడప ఎంపి టికెట్ ఇచ్చినా ఆశ్చర్య పడాల్సిన అవసరం లేదని పెద్ద ఎత్తున చర్చలు కూడా జరిగాయి. అయితే, ఇంత వరకు ఈ కార్యక్రమం పట్టాలకు ఎక్కలేదు. పైగా ఇప్పుడు డీఎల్ యూటర్న్ తీసుకున్నారని, త్వరలోనే ఆయన జగన్ నేతృత్వంలోని వైసీపీలోకి వెళ్లనున్నారని పెద్ద ఎత్తున ప్రచారం తెరమీదికి రావడం సంచలనంగా మారింది. కడపజిల్లా మైదుకూరు నియోజకవర్గం నుంచి ఆయన ఇప్పటి వరకు ఆరుసార్లు ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహించారు. దివంగత వైఎస్కు అత్యంత సన్నిహితుల్లో ఆయన కూడా ఒకరు.

ysrcp original flag

నేదురుమల్లి జనార్దన్రెడ్డి, కోట్ల విజయభాస్కర్రెడ్డి కేబినెట్లలో డీఎల్ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆ తర్వాత కిరణ్కుమార్రెడ్డి కేబినెట్లో కూడా మంత్రిత్వ బాధ్యతలు చేపట్టారు. కిరణ్తో పొసగకపోవడం, సీఎంపై విమర్శలు చేయడంతో డీఎల్ను బర్తరఫ్ చేశారు. 2014లో జరిగిన ఎన్నికల్లో డీఎల్ పోటీచేయకుండా టీడీపీ అభ్యర్థి పుట్టా సుధాకర్యాదవ్కు మద్దతు తెలిపారు. అయినప్పటికీ వైసీపీ అభ్యర్థి రఘురామిరెడ్డి విజేతగా నిలిచారు. కాలక్రమంలో పుట్టా సుధాకర్యాదవ్తో డీఎల్కు పొసగలేదు. టీడీపీలో అధికారికంగా డీఎల్ చేరలేదు. కాగా, కాంగ్రెస్లోకి రావాలని కొందరు పెద్దలు కోరగా… తనను బర్తరఫ్ చేసిన పార్టీలోకి ఎలా రావాలని డీఎల్ ప్రశ్నించినట్టు తెలిసింది.

2019 సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పుట్టాకు టీటీడీ చైర్మన్ పదవిని కట్టబెట్టిన టీడీపీ డీఎల్కు టికెట్ ఇస్తామనే భరోసా ఇచ్చినా వెళ్లేందుకు సుముఖత వ్యక్తం చేయలేదు. అయితే, పుట్టా వ్యవహార శైలి ఏమాత్రం గిట్టకపోవడం, డీఎల్ అనుచరులంతా వైసీపీ వైపు మొగ్గు చూపుతుండటం ఆయన్ను ఆలోచింపజేసింది. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ రాజకీయ సలహాదారుడైన సజ్జల రామకృష్ణారెడ్డి, వైఎస్ వివేకా తదితర వైసీపీ నేతలు డీఎల్తో తరచూ చర్చలు జరుపుతూ పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్టు సమాచారం. స్నేహితుడి కుమారుడు కావడం, అనుచరుల మనో భావాలను పరిగణలోకి తీసుకున్న డీఎల్ వైసీపీలో చేరేందుకు మొగ్గు చూపుతున్నారని తెలిసింది. అంతేకాకుండా డీఎల్ అయితేనే పుట్టా సుధాకర్ యాదవ్ను దీటుగా ఎదుర్కొని గెలిచే అవకాశాలున్నాయని వైసీపీ సర్వేలో వెల్లడైనట్టు సమాచారం. ఈ నేపథ్యంలో త్వరలోనే వైసీపీలోకి డీఎల్ వెళ్లే అవకాశం కనిపిస్తోందనే ప్రచారం జరుగుతోంది. మరి ఇది ఎంత వరకు వర్కవుట్ అవుతుందో చూడాలి.

మాజీ మంత్రి డీఎల్ షాకింగ్ డెసిష‌న్‌!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share