డిప్యూటీ సీఎం చుట్టూ ఏం జ‌రుగుతోంది… ఏకాకిని చేస్తోందెవ‌రు..!

February 21, 2018 at 3:17 pm
kadiyam srihari-kcr

తెలంగాణ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరిని ఏకాకిని చేశారా…? ఏకాకి అయ్యారా..? సీఎం కేసీఆర్ కడియంకు సముచిత స్థానం కల్పిస్తున్న పేరుతో ఆయనను ఎవరికీ కాకుండా చేశారా..? అసలు కడియం శ్రీహరిపై సీఎం కేసీఆర్ ఎందుకు ప్రత్యేక దృష్టి పెడుతున్నారు? సాధారణ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ కడియం తీవ్ర ఆందోళన చెందడానికి కారణం ఏమిటి? ఇప్పుడు ఉమ్మడి వరంగల్ జిల్లాలో జోరుగా నడుస్తున్న చర్చ. కడియం శ్రీహరి టీడీపీలో క్రమశిక్షణ కలిగిన నేతగా, అవినీతి మచ్చ లేని ప్రజాప్రతినిధిగా ఎంతో గుర్తింపు పొందారు. మంత్రి కూడా సమర్థవంతంగా పని చేశారు. 

తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ నేపథ్యంలో తీవ్రమైన ఒత్తిడిలో టీఆర్ఎస్ లో చేరారు. గత ఎన్నికల్లో వరంగల్ పార్లమెంట్ స్థానం నుంచి విజయం సాధించారు. అదేసమయంలో తెలంగాణ ఉప ముఖ్యమంత్రిగా స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యను సీఎం కేసీఆర్ బర్తరఫ్ చేయడం అప్పట్లో సంచలనం సృష్టించింది. అయితే ఆ వెంటనే కడియం శ్రీవారి ని రాజీనామా చేయించి, ఉపముఖ్యమంత్రిగా సీఎం కేసీఆర్ నియమించారు. ఆ తర్వాత ఎమ్మెల్సీగా నియమించారు. అయితే అప్పట్లో రాజయ్యను ఉపముఖ్యమంత్రిగా తొలగించడానికి కడియమే కారణమనే ఆరోపణలు వచ్చాయి. ఇక్కడి వరకు బాగానే ఉన్నా.. ప్రస్తుతం పార్టీలో, ప్రభుత్వంలో కడియం శ్రీహరి ఏకాకిగా మిగిలి పోయారని గుసగుసగుసలాడుకుంటున్నారు. 

సొంత నియోజకవర్గం లేదు. సొంత క్యాడర్ లేదు. పేరుకే ఉపముఖ్యమంత్రి గానీ ఆయన ఎక్కువగా వరంగల్లులోనే ఉంటున్నాారు. మరో దయనీయ పరిస్థితి ఏమిటంటే.. ఎవరైనా ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లలో చేపట్టే కార్యక్రమాలకు పిలిస్తేనే పోతున్నారు. ఇక ఉమ్మడి వరంగల్ జిల్లాలో 12మంది ఎమ్మెల్యేలు ఉన్నా సగానికిపైగా ఆయనకు టచ్ లో లేేనట్లు సమాచారం. ఇక వరంగల్ పర్యటనలో మంత్రులు కేటీఆర్, హరీశ్ రావుకు కడియం శ్రీహ‌రి స్వాగతం పలకడం గమనార్హం. ఈ నేపథ్యంలో కడియం శ్రీహరి పైకి మేకపోతు గాంభీర్యం ప్రదర్శన ఇస్తున్నా లోలోపల తీవ్ర మానసిక ఆందోళనకు గురవుతున్నట్లు తెలుస్తోంది. 

మరో విషయం కూడా ప్రచారంలో ఉంది. కడియం ఎంపీగా ఉంటే రెండు రకాలుగా తమకు ఇబ్బందేననీ, ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వం తరపున కడియం పలుకుబడి పెరుగుతుందనీ, అటు బీజేపీకి కూడా ఆయన దగ్గరయ్యే అవకాశాలు ఉంటాయనీ సీఎం కేసీఆర్ భావించే రాజీనామా చేయించారనే టాక్ కూడా ఉంది. ప్రధానంగా కేసీఆర్ కూతురు నిజామాబాద్ ఎంపీ కవితను డామినేట్ చేసే ప్రమాదం ఉంటుందని గ్రహించిన కేసీఆర్ చకచకా కడియంకు ఉపముఖ్యమంత్రి పదవితో కట్టడి చేశాడని కూడా అప్పట్లో ప్రచారం జరిగింది.

డిప్యూటీ సీఎం చుట్టూ ఏం జ‌రుగుతోంది… ఏకాకిని చేస్తోందెవ‌రు..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share