`వ‌సంత` గాలుల‌తో దేవినేని ఉక్కిరి బిక్కిరి!

June 15, 2018 at 9:04 am
uma -vansantha

సాధార‌ణంగా వ‌సంత గాలి అంటే.. అంద‌రూ హాయిగా ఫీల‌వుతారు. మ‌న‌సంతా హాయిగా ఉంటుంద‌ని అనుకుంటారు. కానీ, మైల‌వ‌రం నుంచి గ‌త ఎన్నిక‌ల్లో పోటీ చేసిన  టీడీపీ సీనియ‌ర్ నేత, మంత్రి దేవినేని ఉమా మ‌హేశ్వ‌ర‌రావుకు మాత్రం చెమ‌ట‌లు ప‌ట్టి.. ప‌రిస్థితి ఉక్కిరి బిక్కిరిగా మారిపోయింది. విష‌యంలోకి వెళ్తే.. నందిగామ నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన దేవినేని ఉమా.. నియోజ‌క‌వ‌ర్గాల డీలిమిటేష‌న్‌తో మైల‌వ‌రం చేరుకున్నారు. ఇక్క‌డ నుంచి గ‌త ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించారు. అయితే, ఆయ‌న విప‌క్షం వైసీపీపై ఒంటికాలిపై లేచేవారు. విప‌క్షాన్నితీవ్ర‌స్థాయిలో విమ‌ర్శించారు. 

 

ఇక‌, పోల‌వ‌రం ప్రాజెక్టుకు అన్నీతానై వ్య‌వ‌హ‌రించారు. చంద్ర‌బాబు వ‌ద్ద మార్కులు కొట్టేశారు. బాబు ద‌గ్గ‌ర మ‌రింత పేరు తెచ్చుకునేందుకు జ‌గ‌న్‌ను తిట్ట‌డ‌మే ప‌ర‌మావ‌ధిగా ముందుకు సాగారు. అయితే, దేవినేని కి షాక్ ఇవ్వాల‌ని నిర్ణ‌యించుకున్న విప‌క్షం వైసీపీ.. దేవినేనికి మొగుడులాంటి నేత‌ను రంగంలోకి దింపేందుకు రెడీ అయింది. ఈ క్ర‌మంలోనే దేవినేని సామాజిక వ‌ర్గానికి చెందిన, టీడీపీపై అసంతృప్తితో ర‌గిలిపోతున్న వ‌సంత నాగేశ్వ‌ర‌రావు ఫ్యామిలీని వైసీపీ అధినేత జ‌గ‌న్ చేర‌దీశారు. ఆయ‌న కుమారుడికి కృష్ణాజిల్లాలో టికెట్ ఇచ్చేందుకు నిరాకరించిన టీడీపీ అధినేత చంద్ర‌బాబుకు షాకిస్తూ.. జ‌గ‌న్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. 

 

ఈ క్ర‌మంలోనే ఆయ‌న వసంత కృష్ణ ప్ర‌సాద్‌కు మైల‌వ‌రం టికెట్‌ను ఖ‌రారు చేశారు. ఈ ప‌రిణామ‌మే దేవినేనికి కంటిపై కునుకు లేకుండా చేస్తోంది. ఇక్క‌డ త‌న‌కు తిరుగులేద‌ని దేవినేని అనుకున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో జోగి ర‌మేష్‌.  వైసీపీ త‌ర‌ఫున ఇక్క‌డ బ‌రిలోకి దిగినా.. ఆశించిన విధంగా ఆయ‌న పోటీ ప‌డ‌లేక పోయారు. దీంతో దేవినేనికి షాకిచ్చేలా జ‌గ‌న్‌.. ఇక్క‌డ నుంచి వసంత కృష్ణ‌ప్ర‌సాద్‌ను రంగంలోకి దింపేందుకు రెడీ అయ్యారు. గ‌తంలో వసంత నాగేశ్వ‌ర‌రావు.. మంత్రిగా చేసి ఉండ‌డం, ప్ర‌జ‌ల్లో మంచి పేరు సాధించ‌డం వంటి కీల‌క ప‌రిణామాలు ప్ర‌స్తుతం వ‌సంత ఫ్యామిలీకి ఎంత‌గానో లాభించే ప‌రిణామాలుగా ఇక్క‌డ ప్ర‌చారం జ‌రుగుతోంది. 

 

ముఖ్యంగా పేద‌లకు వ‌సంత ఫ్యామిలీ అనేక విధాలు గా సాయం చేసింది. దీనిని దృష్టిలో పెట్టుకునే జ‌గ‌న్‌.. మైల‌వ‌రం టికెట్‌ను కేపీకి కేటాయించార‌ని తెలుస్తోంది. ఈ ప‌రిణామాల నేప‌థ్యంలోనే దేవినేనికి కంటిపై కునుకు క‌రువైంద‌ని అంటున్నారు. మొత్తంగా చూస్తే.. మైల‌వ‌రంలో రాజ‌కీయాలు గ‌త ఎన్నిక‌ల మాదిరిగా ఉండ‌బోవ‌ని స్ప‌ష్టంగా తెలుస్తోంది. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి. 

`వ‌సంత` గాలుల‌తో దేవినేని ఉక్కిరి బిక్కిరి!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share