కాంగ్రెస్‌కే డీఎస్ జై..కాంగ్రెస్ ఎంట్రీకి ముహూర్తం ఫిక్స్‌!

September 6, 2018 at 10:27 am

తెలంగాణాలో ముందస్తు ఎన్నికలు వస్తాయనే ఊహాగానాల నేపథ్యంలో రాజకీయాలు వడివడిగా మారుతున్నాయి. నిన్న మొన్నటి వరకు కేసీఆర్ చెంతనే ఉండి.. ప్రభుత్వ సలహాదారుగా పదవిని సైతం పొందిన కాంగ్రెస్ మాజీ నేత ధర్మపురి శ్రీనివాస్ ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్ గూటికే చేరుతున్నారనే వార్త తెలంగాణ వ్యాప్తంగా హల్చల్ చేస్తోంది. కాంగ్రెస్ ఉమ్మడి రాష్ట్ర అధ్యక్షుడిగా ఆ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా చక్రం తిప్పారు డీ శ్రీనివాస్. గడిచిన మూడు నాలుగు నెలలుగా టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. డీఎస్ వైఖరిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. వరంగల్ వేదికగా ఆయన పుత్రిక, ఎంపీ కవిత.,. డీఎస్ను టార్గెట్ చేస్తూ.. తీవ్ర వ్యాఖ్యలు చేశారు.22-1456145928-kcr-ds-600

సొంత పార్టీలోనే ఉండి కాంగ్రెస్కు మద్దతు పలకడం ఏంటని ప్రశ్నించారు. రహస్యంగా వెళ్లి కాంగ్రెస్ నేతలతో మంతనాలు చేయడం ఎందుకని నిలదీశారు. ఇలా ప్రారంభమైన వివాదం చివరకు కేసీఆర్ అప్పాయింట్మెంట్ ఇచ్చేందుకు కూడా విముఖత వ్యక్తం చేసే వరకు వెళ్లింది. దీంతో కేసీఆర్-డీఎస్ల మధ్య సంబంధాలు పూర్తిగా దెబ్బ తిన్నాయి. మరోపక్క, ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో పాతకాపులను పార్టీలోకి తీసుకోవాలని కాంగ్రెస్ నిర్ణయం తీసుకోవడం ఇప్పుడు డీఎస్కు కలిసి వచ్చింది. త్వరలోనే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, సోనియాలను డీఎస్ కలవనున్నారని, ఆయన చేరికకు అధిష్టానం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.14-ds-532532

అంతేకాదు, డీఎస్ చేరికకు ముహూర్తం కూడా ఖరారైందని అంటున్నారు. ఈ నెల 11న సోనియా, రాహుల్ సమక్షంలో ఎమ్మెల్సీ భూపతి రెడ్డితో పాటు డీఎస్ కాంగ్రెస్లో చేరనున్నారని తెలంగా ణలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. అయితే, డీఎస్ మాత్రం తనను టీఆర్ ఎస్ పార్టీ నుంచి తొలగించాక కానీ బయటకు వచ్చేది లేదని చెబుతున్నారు. తనకు టీఆర్ఎస్ అధిష్టానం నుంచి సమాధానం కావాలని అంటున్నారు. తానడిగిన ప్రతి ప్రశ్నకు టీఆర్ఎస్ స్పష్టతను ఇవ్వాలన్నారు. మొత్తానికి ఇప్పుడు డీఎస్ ఎన్ని రకాలుగా ఏం చెప్పినా.. ఆయన త్వరలోనే కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునేం దుకు రెడీ అయ్యారనే అంటున్నారు పరిశీలకులు. సో.. మొత్తానికి తెలంగాణలో డీఎస్ పరిస్థితి ఇదీ!!7135Focus On AP Affairs

కాంగ్రెస్‌కే డీఎస్ జై..కాంగ్రెస్ ఎంట్రీకి ముహూర్తం ఫిక్స్‌!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share