వైసీపీలోకి డీఎల్ ర‌వీంద్రారెడ్డి

March 20, 2019 at 12:43 pm

క‌డ‌ప జిల్లా సీనియ‌ర్ కాంగ్రెస్ లీడ‌ర్ , మాజీ మంత్రి డీఎల్ ర‌వీంద్రరెడ్డి జ‌గ‌న్ స‌మ‌క్షంలో వైసీపీలో చేర‌బోతున్న‌ట్టు ప్ర‌క‌టించారు. మైదుకూరు అసెంబ్లీ నియోజ‌క వ‌ర్గం నుంచి పోటీకి ఆస‌క్తి చూపుతున్న ర‌వీంద్ర కొద్ది గంట‌ల కింద‌ట టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు కూడా క‌లిశారు. ఏకంతంగా ఏమేమీ మాట్లాడారో ఏమో గానీ మొత్తంగా తాను వైసీపీలో చేర‌డానికి సిద్ధ‌ప‌డిన‌ట్టు ప్ర‌కటించారు. కాగా, గ‌త మూడు విడ‌తలుగా ఎన్నిక‌ల‌ను తీసుకుంటే అంటే 2004, 2009లో ఇండియ‌న్ నేష‌న‌ల్ కాంగ్రెస్ త‌ర‌ఫున పోటీ చేసి మైదుకూరు నుంచి రవీంద్రా రెడ్డి గెలుపొందారు. 2014 ఎన్నిక‌ల్లో మాత్రం వైసీపీ అభ్య‌ర్థి సెట్టుప‌ల్లి ర‌ఘురామీరెడ్డి మైదుకూరునుంచి సుమారు 12వేల ఓట్ల‌తో టీడీపీ అభ్య‌ర్థి పుట్ట సుధాక‌ర్‌యాద‌వ్‌పై గెలుపొందిన విష‌యం తెలిసిందే.

మొత్తంగా ఐదుసార్లు మైదుకూరు నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన డీఎల్ కొద్ది రోజులుగా స్వ‌తంత్ర అభ్య‌ర్థిగా పోటీ చేయాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు ఆయ‌న అనుచ‌రులు చెప్పారు. అయితే మొద‌ట వైసీపీలో చేరాల‌ని నిర్ణ‌యించుకున్నా త‌న‌కు మైదుకూరు టిక్కెట్ కేటాయించాల‌ని వైఎస్ జ‌గ‌న్‌ను కోరిన‌ట్టు వార్త‌లొచ్చాయి. అయితే అక్క‌డ సిట్టింగ్ ఎమ్మెల్యే ర‌ఘురామీరెడ్డికే టిక్కెట్ ఇస్తామ‌ని చెప్ప‌డంతో ఆయ‌న డైలామాలో ప‌డిన‌ట్టు తెలుస్తోంది. ఈ క్ర‌మంలోనే బుధ‌వారం తిరిగి తెలుగుదేశం అధినేత‌, ప్ర‌స్తుత ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడును క‌లిసి మంత‌నాలు జ‌రిపిన‌ట్టు తెలిసింది.

కాగా, ఏం నిర్ణ‌యించుకున్నారో ఏమో గానీ ఆయ‌న గురువారం జ‌గ‌న్ స‌మ‌క్షంలో వైసీపీలో చేర‌బోతున్న‌ట్టు ప్ర‌క‌టించారు. ఆయ‌న‌తో పాటు శివ‌రామ‌క్రుష్ణ‌య్య కూడా వైసీపీలోకి రానున్నారు. మొత్తంగా జ‌గ‌న్ ప్ర‌భంజ‌నం వీస్తున్న ప్ర‌స్తుత స్థితిలో వైసీపీలోకి వ‌ల‌స‌లు జోరందుకున్నాయి. అధికార పార్టీపై పెరుగుతున్న జ‌న వ్య‌తిరేక‌త కూడా ఇందుకు దోహ‌దం చేస్తుంది. **ఫ్యాన్‌** ప్రజాద‌ర‌ణ చూసి అన్ని వ‌ర్గాల వారు జ‌గ‌న్ పార్టీలోకి వ‌ల‌స‌లు క‌డుతున్నారు.

వైసీపీలోకి డీఎల్ ర‌వీంద్రారెడ్డి
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share