ఈనాడు అలా… ఆంధ్ర‌జ్యోతి ఇలా

ప్ర‌ధాన తెలుగు దిన‌ప‌త్రిక‌లు అయిన ఈనాడు, ఆంధ్ర‌జ్యోతి రెండిటిపై టీడీపీకి ఫేవ‌ర్ అన్న ముద్ర ఉంది. అయితే ఈ విష‌యంలో ఆంధ్ర‌జ్యోతితో పోలిస్తే ఈనాడు కాస్త న్యూట్ర‌ల్‌గానే ఉంటుంది. ఏదైనా విష‌యాన్ని మ‌రీ ప‌చ్చిగా, అభూత‌కల్ప‌న‌లు లేకుండా ప్ర‌చురిస్తుంటుంది. అలాగే అంద‌రికి మంచి ప్ర‌యారిటీయే ఇస్తుంది. ఇక ఆంధ్ర‌జ్యోతి అలా కాదు.. జ‌గ‌న్ అన్నా, వైసీపీ అన్నా రెచ్చిపోయి మ‌రీ రంకెలేస్తోంది. కొద్ది రోజుల క్రితం వ‌ర‌కు తెలంగాణ‌లోను అధికార టీఆర్ఎస్‌కు యాంటీగా దూకుడుగా వెళ్లిన జ్యోతి అక్క‌డ కేసీఆర్ దెబ్బ‌తో ఇప్పుడు కాస్త రాజీకి వ‌చ్చిన‌ట్టే క‌న‌ప‌డుతోంది.

ఇదిలా ఉంటే ఏపీ రాజ‌కీయాల్లో ఈనాడు, ఆంధ్ర‌జ్యోతి ఎడ్డెం, తెడ్డంలా వ్య‌వ‌హిస్తున్నాయ‌న్న టాక్ ఉంది. జ్యోతి మ‌రీ టీడీపీకి డ‌ప్పేస్తూ, బాకాలూ ఊదేస్తోంది. ఈనాడు మాత్రం టీడీపీకి టాప్ ప్ర‌యారిటీ ఇచ్చినా, వైసీపీకి మంచి క‌వ‌రేజే ఇస్తోంది. ఇక ఈ రెండు పేప‌ర్లు ఒకే అంశంలో ఎలా జ‌నాల‌ను క‌న్‌ఫ్యూజ్ చేస్తున్నాయో ఈ క్రింది వార్తే చాలా క్లీయ‌ర్‌గా చెప్పేస్తోంది. నియోజ‌క‌వ‌ర్గాల పెంపు గురించి ఈనాడులో సీట్ల పెంపుపై ఒత్తిడి చేయ‌డం, పార్లమెంటు లోప‌లా, బ‌య‌టా, అమిత్ షా క‌నిపించినా ఇదే అడ‌గాల‌ని బాబు సూచించిన‌ట్టు క‌థ‌నం వ‌చ్చింది.

ఇక జ్యోతిలో సీట్ల పెంపు ఖాయంగా జరుగుతుంది. దానికి అందరూ సిద్ధంగా ఉండండి. 175 స్థానాలు కాస్తా 225 అవుతాయి. దీనికి కేంద్రం రెడీగా ఉంది. వచ్చే పార్లమెంటు సమావేశాల్లోనే బిల్లు అని బాబు అన్న‌ట్టు వార్త వ‌చ్చింది. ఈ రెండు ప‌త్రిక‌ల క‌థ‌నాలు కాస్త ప‌క్క‌న పెట్టేసి నిజంగా నియోజ‌క‌వ‌ర్గాల పెంపు గురించి మాట్లాడుకుంటే అది ప్ర‌స్తుతానికి అయ్యేలా క‌న‌ప‌డడం లేదు.

నియోజ‌క‌వ‌ర్గాలు పెంచితే రెండు తెలుగు రాష్ట్రాల్లోను రాజ‌కీయంగా త‌మ‌కు వ‌చ్చే లాభ‌మేది లేదని తెలుసుకున్న అమిత్ షా, మోడీ ఆ అంశాన్ని పూర్తిగా ప‌క్క‌న పెట్టేశారు. కానీ నియోజ‌క‌వ‌ర్గాల పెంపును బూచీగా చూపి ఇత‌ర పార్టీల‌కు చెందిన ప‌లువురు ఎమ్మెల్యేల‌ను త‌మ పార్టీలో చేర్చేసుకున్నారు. ఇప్పుడు సీట్లు పెర‌గ‌క‌పోతే వీళ్ల‌కు వ‌చ్చే ఎన్నిక‌ల్లో టిక్కెట్ల కేటాయింపులో పెద్ద త‌ల‌నొప్పులు త‌ప్ప‌వు. ఇక ఏపీలో అధికార టీడీపీకి ఓ రేంజ్‌లో కొమ్ము కాస్తోన్న జ్యోతి ఇప్పుడు ఇక్క‌డ సీట్లు పెరుగుతాయ‌ని ప‌దే ప‌దే వార్త‌లు రాస్తూ చంద్ర‌బాబుకు, టీడీపీ వాళ్ల‌కు ఇబ్బంది లేకుండా చేస్తోంది. అది అస‌లు సంగ‌తి. ఈనాడు మాత్రం ఈ విష‌యంలో ఉన్న‌ది ఉన్న‌ట్టు రాసేందుకే మొగ్గు చూపుతోంది.