ఈసీ : అక్కడో నీతి, ఇక్కడో నీతి!

October 8, 2018 at 5:16 pm

లోక్ సభలో సభ్యుల రాజీనామా ల తో ఖాళీ స్ధానాలకు, ఉప ఎన్నికలు నిర్వహించడం లో ఎన్నికల సంఘం అనుసరిస్తున్న వైఖరిపై పలు అనుమానాలకు ఆస్కారం కలుగుతున్నది. ఖాళీ అయిన స్థానాల కు ఉప ఎన్నికలు జరపడంలో, రాష్ట్రాని కో రకంగా ఈసీ తీసుంటున్న నిర్ణయాలు పట్ల ప్రజలకు పలు అనుమానాలు కలుగుతున్నాయి.Election Commissioner O.P. Rawat . (File Photo: IANS)

వివరాల లోనికి వెళితే, ఏపి లో ఐదుగురు వైఎస్ఆర్ సిపి ఎంపీ లు, కేంద్రం ప్రత్యేక హోదా ఇవ్వనందుకు నిరసనగా, తమ ఎంపీ పదవులకు రాజీనామా చేయాలని తమ అధినేత జగన్ నిర్ణయం తీసుకున్న చాలా రోజుల తరువాత, ఎట్టకేలకు గత జూలై లో రాజీనామాలు చేయడం, స్పీకర్ సుమిత్రా మహాజన్ వాటిని ఆమోదించడం జరిగినది. అదే విధంగా కర్ణాటక లోని శివమొగ్గ, బళ్లారి, మాండ్య లోక్ సభ నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న, బిజేపి నేతలు, బీఎస్ యడ్యూరప్ప, శ్రీరాములు, జెడిఎస్ నేత సీఎస్ పుట్టరాజు, ఇటీవల జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల లో గెలవడంతో, వారు తమ లోక్ సభ సభ్యత్వాలకు చేసిన రాజీనామాలను కూడా స్పీకర్ ఆమోదించారు.705726-election-commission-pti (1)

అయితే, శనివారం ఎన్నికల సంఘం ప్రకటించిన తెలంగాణ తో కూడిన నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తో పాటు, కర్ణాటక లోని మూడు లోక్ సభ సీట్ల కు ఉప ఎన్నికలు నిర్వహించాలని, అంతకు ముందే రాజీనామాలు ఆమోదించబడిన ఏపి కి సంబంధించిన ఐదు సీట్ల లో మాత్రం,ఎన్నికలు అవసరం లేదని ప్రకటించడం అన్ని రాజకీయ పార్టీలను విస్మయానికి గురిచేసింది. ఏపి లో ఎన్నికలు అవసరం లేదనడానికి ఎన్నికల సంఘం చెబుతున్న కారణం లోక్ సభ కాలపరిమితి ఒక సంవత్సరం అని చెపుతున్నా, మరి ఆరు నెలల లో లోక్ సభకు సార్వత్రిక ఎన్నికలు జరగనున్న తరుణంలో కర్ణాటక లోక్ సభ ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదల వెనుక మతలబు ఏంటో ఈసీ కే తెలియాలి.

ఈసీ : అక్కడో నీతి, ఇక్కడో నీతి!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share