ఘాజి TJ రివ్యూ

February 17, 2017 at 9:46 am
Ghazi new

సినిమా : ఘాజి
రేటింగ్ : 3 /5
పంచ్ లైన్ : ప్రయత్నం బాగున్నా ప్రయోజనం అంతంతే

నటీనటులు : రానా ద‌గ్గుబాటి, కె.కె.మీన‌న్‌, అతుల్ కుల‌క‌ర్ణి, తాప్సీ, నాజ‌ర్‌, ఓంపురి, రాహుల్ సింగ్‌, స‌త్య‌దేవ్‌, ర‌వి వ‌ర్మ‌, ప్రియ‌దర్శి
స్టంట్స్ : జాషువా
ఎడిట‌ర్ : శ్రీక‌ర్ ప్ర‌సాద్‌
విజువ‌ల్ ఎఫెక్ట్స్ : ఈవా మోష‌న్ స్టూడియోస్‌
మ్యూజిక్ : కె కృష్ణ కుమార్
ఆర్ట్ : ముర‌ళి ఎస్.వి
బ్యానర్ : మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్మెంట్‌, పివిపి సినిమా
నిర్మాత‌లు : ప‌ర‌మ్ వి.పొట్లూరి, క‌విన్ అన్నె, అన్వేష్ రెడ్డి, జ‌గ‌న్‌మోహ‌న్ వంచ‌, వెంక‌ట ర‌మ‌ణా రెడ్డి
క‌థ‌, స్క్రీన్‌ప్లే, ద‌ర్శ‌క‌త్వం : సంక‌ల్ప్ రెడ్డి

తెలుగులో ప్రయోగాత్మక సినిమాలు చాలా అరుదు.అడపా దడపా ఒకటి అరా గగనం లాంటి సినిమాలు వచ్చినా అవి కమర్షియల్ గా పెద్ద సక్సెస్ అయినా దాఖలాలు లేవు. దీన్ని రెండు రకాలుగా చూడొచ్చు.ఒకటి తెలుగు ప్రేక్షకులు ప్రయోగాల్ని పెద్దగా ఆదరించకపోవడం,రెండోది ప్రయోగం వికటించడంతో లేదా ప్రయోగం ఉండాల్సిన రేంజ్ లో వుండకపోవడమే.చాలామటుకు ప్రయోగాత్మక సినిమాలు అభినందనలు పొందాయి కానీ కాసులు కురిపించకపోవడానికి ప్రయోగం చేయడానికి కావాల్సిన కంటెంట్ సినిమాల్లో వుండకపోవడమే.

మన రెగ్యులర్ తెలుగు మసాలా సినిమాలకి అయితే మన వాళ్లే ఓ బెంచ్ మార్క్ సెట్ చేశారు. ఆరు పాటలు నాలుగు ఫైట్స్,కామెడీ,సెంటిమెంట్ ఇలా..సో అలాంటి రెగ్యులర్ సినిమా ఓ ఫార్ములా ప్రకారం కొట్టుకుపోతోంది.అయితే ప్రయోగాత్మక సినిమాల్లో..అందులోను వార్ బేస్డ్ మూవీస్ కి హాలీవుడ్ ఇప్పటికే టెక్నికల్ గా ఎమోషనల్ గా పీక్స్ ని టార్గెట్ గా సెట్ చేసేసింది.మన వాళ్ళు అలాంటి సబ్జెక్టు టచ్ చెయ్యాలంటే దానికి తగ్గ కంటెంట్ ని పట్టుకోవాలి.కాలక్షేపణాకి తప్ప కాసులు కురిపించడానికి పనికిరాకుండా పోతాయి.సరిగ్గా ఇలాంటిదే ఘాజి కూడా.

పీవీపీ నిర్మాణం,రానా,ఓంపురి,నాజర్,అతుల్ కులకర్ణి లాంటి వెయిట్ ఉన్న నటులు మంచి టెక్నిషన్స్ ఇండో పాక్ వాటర్ వార్,సబ్ మెరైన్ అనే సరికి అందరిలో ఆసక్తిని పుట్టించగలిగింది ఘాజి కానీ అందుకు తగ్గ కథనం లేక రెండు గంటలపాటు గ్రిప్పింగ్ గా సాగాల్సిన స్క్రీన్ ప్లే కాస్తా పడుతూ లేస్తూ పర్లేదనిపిస్తుంది అంతే.

పాకిస్థాన్ నుండి బాంగ్లాదేశ్ వేర్పడక ముందు తూర్పు పాకిస్థాన్ లో చెలరేగిన వ్యతిరేకతను అణచివేయడానికి సముద్రమార్గం గుండా ఘాజి అనే యుద్ధ నౌక ని తూర్పు పాకిస్థాన్ పంపేందుకు మార్గ మధ్యలో భరత్ ని ఎలా తప్పించుకు వెళ్ళాలి ఒకవేళ కుదరక పోతే భారత్ తీరప్రాంతాల్ని ఎలా దెబ్బకొట్టాలి అనే పథకం తో బయల్దేరిన ఘాజికి మన ణౌకాదళం,మన జలాంతర్గామి ఎలా బదులిచ్చాయన్నదే కథ అంశం.

ఒక సినిమాటిక్ కథకి కావాల్సిన ముడి సరుకునంతా పైన చెప్పిన కథ ఇవ్వగలదు.దానికి చేయాల్సిందంతా గ్రిప్పింగ్ స్క్రీన్ప్లే తో ప్రెజెంట్ చేయడమే.అక్కడే దర్శకుడు విఫలమయ్యాడు.ఇండో పాక్ సముద్ర యుద్ధం అనేసరికి ప్రేక్షకులు ఆశించే రేసీ సీన్స్ ఒకటి ఆరా తప్ప సినిమా అంత చప్పగా సాగుతుంది.ఒక సారి సినిమా సముద్రంలోకి వెళ్లిన తరువాత నావిహెడ్ క్వార్టర్స్ ని కథలో ఇన్వాల్వ్ చేయకపోవడం పెద్ద లోటు.

సముద్రం లో జలాంతర్గాములతో యుద్ధం తెరపైన ప్రెజెంట్ చెయ్యడం అంటేనే కత్తిమీద సాములాంటిది.ఎందుకంటే ఇందులో ప్రత్యక్ష ముఖా ముఖి యుద్ధ సన్నివేశాలుండవు.అంతా మైండ్ గేమ్స్ నడుస్తూ ఉంటాయి.వాటిలో ప్రేక్షకుడ్ని లీనం చేసేందుకు తగ్గ సిట్యుయేషన్స్ క్రియేట్ చేయాలి.అక్కడక్కడా కొన్ని సిట్యుయేషన్ వున్నా సినిమా మొత్తం మూడ్ క్యారీ చేయడానికి అవి సరిపోవు.

బాహుబలి తరువాత రానా నటించిన సినిమా ఇది. నావి కమాండర్ గా రానా పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాడు.ఎక్స్ప్రెషన్స్ కి పెద్దగా స్కోప్ ఉన్న పాత్ర కాదు రానది.అయినా తన పరిధి మేరలో మెప్పించాడు.కసి వున్నా కెప్టెన్ గా కేకే మీనన్ మంచి నటన ప్రదర్శించాడు ఇంకొ రకంగా ఫస్ట్ హాఫ్ అంతా రానాని సైడ్ చేసి కథని నడిపిస్తాడు,అతుల్ కులకర్ణి నటన సినిమాని ఎమోషన్ ని పీక్స్ లో నిలబెడుతుంది.తాప్సి పాపం ఎదో సినిమా అన్నాక ఓ హీరోయిన్ ఉండాలి అని ఉండడం తప్ప కథకి అతికే పాత్ర కాదు.ఓంపురి,నాజర్ తదితరులు పరిధిమేర నటించి మెప్పించారు.

సినిమా కథకి తగ్గ రీసెర్చ్ అయితే బాగా చేశారు.నేవీ ఎలా ఫంక్షన్ అవుతుంది,సబ్ మెరైన్ లో ఎలాంటి మెకానిజం ఉంటుంది అన్నది చక్కగా ప్రెజెంట్ చేశారు.టార్పీడో ,లాటిట్యూడ్,లాంగిట్యూడ్,నాటికాన్ మెయిల్స్ ఇలా నేవి నేటివిటీ మీద బాగా రీసెర్చ్ చేశారు.ఆర్ట్ డైరెక్టర్ వర్క్ స్పెషల్ గా మెచ్చుకోవాలి.ఇంకా ఎడిటర్ గా శ్రీకర్ ప్రసాద్ ఎందుకు టాప్ ఎడిటర్స్ లో ఒకడో మరోసారి ప్రూవ్ చేసాడు.మాటలు సినిమా ఫీల్ కి కావాల్సిన బేస్ లో లేవు.పాపం మాటల్తో క్లైమాక్స్ లో ఎమోషన్ రగిల్చలేక జనగణమన,వందేమాతరం వాడుకోవడం మాటల్లో లోటుని సూచిస్తుంది.బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పర్లేదు.స్క్రీన్ ప్లే సినిమాకి కథకి చెయ్యాల్సిన డామేజ్ అంతా చేసేసింది.

రొటీన్ మసాలా మూవీస్ తో విసిగిపోయిన,కొత్తదనం,ప్రయోగాత్మక సినిమాల్ని కోరుకునే ప్రేక్షకులకి ఘాజి ఒక రిలీఫ్.కథ నేపథ్యం,నటీ నటులు సినిమాని బ్రతికించే ప్రయత్నం ఎంత చేసినా కథనం,స్క్రీన్ ప్లే లతో దర్శకుడు సినిమాని కింద పడేసాడు.

ఘాజి TJ రివ్యూ
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share