గుడివాడలో కొడాలి నానికి ఎదురులేదా..!

March 20, 2019 at 6:56 pm

కొడాలి నాని…! రాజ‌కీయాల‌కు అతీతంగా మాంచి ఫాలోయింగ్ ఉన్న నేత‌. నంద‌మూరి తార‌క రామారావుకు వీరాభిమానిగా తెలుగు ప్ర‌జ‌ల‌కు సుప‌రిచితుడు. ఇక ప్ర‌స్తుత రాజ‌కీయనాయ‌కులకు ఎంతో వైవిధ్యం ఉన్న నేత‌. ఎంతో గాంభీర్యంగా క‌నిపించినా అంతే సున్నిత మ‌న‌స్త‌త్వంతో వ్య‌వ‌హ‌రించే మృదు స్వ‌భావి అని స‌మాచారం. జూనియ‌ర్ ఎన్టీఆర్ తండ్రి హ‌రికృష్ణ‌తో ఉన్న సాన్నిహిత్యంతోనే ఆయ‌న‌కు 2004లో గుడివాడ టికెట్ ద‌క్కింద‌ని స‌మాచారం. అప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్య‌ను కాద‌ని నానికి టికెట్ ఇవ్వ‌డం టీడీపీ వ‌ర్గాల్లో సంచ‌ల‌నంగా మారింది. టికెట్ ద‌క్కించుకోవ‌డ‌మే కాదు గెలిచి త‌న స‌త్తా చాటాడు. 2004 నుంచి 2009 మ‌ధ్య‌లో నాని పేరు తెలుగు నేల‌పై ప్ర‌తిధ్వ‌నించింది. నాని రాజ‌కీయ ప్ర‌స్థానానికి బ‌ల‌మైన అడుగులు ప‌డ్డాయి. జ‌నాల్లో ఆయ‌న‌కంటూ ప్ర‌త్యేక ఇమేజ్ వ‌చ్చేసింది. ముఖ్యంగా యూత్‌లో ఆయ‌న‌పై క్రేజ్ ఏర్ప‌డింది. సినీ క‌థానాయ‌కుడికి మ‌ళ్లే లెక్క‌కు మించి రాష్ట్ర వ్యాప్తంగా కొడాలినాని అభిమాన సంఘాలు ఏర్ప‌డ‌టం విశేషం.

ఇక 2009లోనూ గుడివాడ నుంచి పోటీ చేసి గెలిచారు. అయితే కొద్దికాలం త‌ర్వాత చంద్ర‌బాబుతో తలెత్తిన వివాదాల‌తో ఆయ‌న వైసీపీలో చేరిపోయారు. నంద‌మూరి ఫ్యామిలీతో ఎంతో సాన్నిహిత్యం ఉన్న కొడాలి నాని వైసీపీలో చేర‌డం అప్ప‌ట్లో సంచ‌ల‌నంగా మారింది. అయితే వైసీపీలో చేరాక ఆయ‌న ప్ర‌తిష్ఠ మ‌రింత పెరిగింద‌నే వాళ్లు ఉన్నారు. వైసీపీ కూడా ఆయ‌న్ను ప్ర‌త్యేకంగా గౌర‌వించ‌డం విశేషం. అసెంబ్లీలో పార్టీ శాస‌న‌స‌భ ప‌క్ష ఉప‌నేత‌గా నియ‌మించింది.2014లో కూడా గెలిచిన నాని ఇక త‌న‌కు తిరుగులేద‌ని అనిపించుకున్నాడు. ఇక చంద్ర‌బాబు అన్నా, లోకేష్ అన్నా నాని ఒంటి కాలుపై లెగుస్తుంటాడు. ప్ర‌భుత్వంలోని వైఫ‌ల్యాల‌ను ఎండ‌గడుతూ టీడీపీకి కొర‌క‌రాని కొయ్య‌గా మారాడు. ఫైర్ బ్రాండ్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు.

గుడివాడ రాజ‌కీయాన్ని నాని త‌న సొంత అడ్డాగా మార్చుకున్నాడు. ఇది టీడీపీ అధినేత చంద్ర‌బాబుకు మింగుడు ప‌డ‌టం లేదు. ఇప్ప‌టికే వ‌రుస‌గా మూడుసార్లు గుడివాడ నుంచి గెలిచిన నాని జైత్ర‌యాత్ర‌కు చెక్ పెట్టాల‌ని చంద్ర‌బాబు య‌త్నిస్తున్నారు. అందుకే దివంగ‌త నేత దేవినేని నెహ్రూ త‌న‌యుడు అవినాష్‌ను ఇక్క‌డి నుంచి బ‌రిలోకి దింపుతున్నాడు. అయితే ఎలాంటి రాజ‌కీయ ప‌రిప‌క్వ‌త లేని అవినాష్ కొడాలికి ఎంత‌మాత్రం పోటీ ఇవ్వ‌లేని ప‌రిస్థితి త‌యారైంది. స్థానిక టీడీపీ క‌ల‌హాల‌తో వ‌ర్ధిల్లుతోంది. స‌మ‌న్వ‌యం లోపిస్తుడ‌టంతో అవినాష్‌కు క‌నీస ఓట్లు ల‌భించే ప‌రిస్థితే క‌న‌బ‌డ‌టం లేద‌ని స‌మాచారం. అదే స‌మ‌యంలో నానికి విప‌రీత‌మైన జ‌నాద‌ర‌ణ ఉండ‌టం విశేషం. వైసీపీ అధికారంలోకి వ‌స్తే నానికి మంత్రి వ‌ర్గంలో చోటు ఖాయమ‌నే అభిప్రాయం కూడా ఆయ‌న వైపు ఓట‌ర్లు ఉండేలా చేస్తుండ‌టం గ‌మ‌నార్హం. మొత్తంగా గుడివాడ రాజ‌కీయ పీఠం నానికే ద‌క్క‌నుంద‌న‌డంలో ఎలాంటి సందేహం లేద‌నే అభిప్రాయ‌మే రాజ‌కీయ వ‌ర్గాల్లో వ్య‌క్త‌మ‌వుతోంది.

గుడివాడలో కొడాలి నానికి ఎదురులేదా..!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share