లావు ఎంట్రీతో.. గుంటూరు ఎంపీ రేసు హోరా హోరీ..!

August 20, 2018 at 6:33 pm

వార్ వన్‌సైడే! అన్న ధీమా నుంచి టీడీపీ నాయకులు తప్పుకొంటున్న పరిస్థితి కనిపిస్తోంది! వచ్చే ఎన్నికల్లో వార్ హోరా హోరీ అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. దీంతో టీడీపీ నేతల్లో ఒకింత ఖంగారు చోటు చేసుకోవడం గమనార్హం. ఇదంతా కూడా రాజధాని జిల్లా గుంటూరు ఎంపీ నియోజకవర్గానికి సంబంధించి జరుగుతున్న చర్చ కావడం గమనార్హం. విషయం లోకి వెళ్తే.. రాజధాని ప్రాంతం గుంటూరు జిల్లాలోని మూడు ఎంపీ నియోజకర్గాల్లోనూ గత ఎన్నికల్లో టీడీపీ జెండానే రెపరెపలాడింది. నరసరావుపేట, బాపట్ల, గుంటూరు నియోజకవర్గాల్లో అధికార పార్టీ విజయం సాధించింది. అయితే, ఆ ఎన్నికల్లో గుంటూరు ఎంపీగా పోటీ చేసిన సూపర్ స్టార్ మహేష్ బాబు బావ గల్లా జయదేవ్‌కు అన్ని వైపుల నుంచి పరిస్థితులు అనుకూలించాయి. 26195942_162037464520941_1008616608965785860_n

ఇక, అప్పటి ఎన్నికల్లో వైసీపీ తరఫున వల్లభనేని బాలశౌరి పోటీ చేశారు. అయితే, అప్పట్లో ఈయన బలమైన పోటీ ఇవ్వలేక పోయారు. ఆ ఎన్నికల్లో గల్లాకు 618,417 ఓట్లు రాగా, వల్లభనేని బాలశౌరికి 549,306 ఓట్లు వచ్చాయి. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లోనూ తమదే వన్ సైడ్ అవుతుందని గల్లా వర్గం భావిస్తోంది. కానీ, వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితిలోనూ ఇక్కడ గెలిచి తీరాలని పట్టుబట్టిన వైసీపీ అధినేత జగన్.. వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాడు. ఇక్కడ ప్రజల్లో దూసు కుపోగలిగే నాయకుడు, ఆర్థికంగా బలమైన స్థితిలో ఉన్న నేత అయితేనే గెలుపు సాధ్యమని గుర్తించిన జగన్ ఆది శగా అన్ని వర్గాలను మెప్పించగలిగిన వ్యక్తికి టికెట్ ఇవ్వాలని నిర్ణయించుకున్నట్టు వార్తలు వచ్చాయి. రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా కర్ణాటక, తమిళనాడుల్లోనూ గుర్తింపు పొందిన విజ్ఞాన్ సంస్థల అధినేత కుమారుడికి ఈ టికెట్ ఇవ్వాలని డిసైడ్ అయ్యారు.

విజ్క్షాన్ సంస్థల అధినేత లావు రత్తయ్య.,. తరచుగా రాజకీయాల్లో కనిపిస్తూనే ఉంటారు. ఆయన గతంలో బాపట్ల, మల్కాజ్గిరి నుంచి ఎంపీగా పోటీ చేసి తన వ్యక్తిగత ఇమేజ్‌తో గణనీయమైన ఓట్లు సాధించారు. ఇప్పుడు.. వచ్చే ఎన్నికల్లో ఆయన తన వారసుడు లావు శ్రీకృష్ణ దేవరాయులను రంగంలోకి దింపాలని నిర్ణయించుకున్నారు. దీనికి వైసీపీ జగన్ కూడా రెడ్ కార్పెట్ పరిచారు. ఈ క్రమంలోనే శ్రీకృష్ణదేవరాయలకు.. గుంటూరు ఎంపీ టికెట్‌ను కేటాయించారు. ఈ క్రమంలోనే వచ్చే ఎన్నికల్లో గుంటూరు ఎంపీ నియోజకవర్గంలో టీడీపీ, వైసీపీ మధ్య హోరా హోరీ పోరు జరగడం ఖాయమని తెలుస్తోంది. టీడీపీ తరఫున మళ్లీ గల్లా జయదేవ్‌కే టికెట్ ఇవ్వనున్నారు. ఈ క్రమంలో వైసీపీ తరఫున లావు శ్రీకృష్ణదేవరాయలకు టికెట్ ఇవ్వడం ద్వారా ఇద్దరు యువ నాయకులు హోరా హోరీ తలపడే అవకాశం కనిపిస్తోందని అంటున్నారు పరిశీలకులు.

విజ్క్షాన్ కాలేజీల్లో చదివి ఎంతో మంది దేశ, విదేశాల్లో స్థిరపడ్డారు…. వాళ్ల ఫ్యామిలీ ఓట్లు కూడా ఈ సారి కీలకం కానున్నాయి… ఇవన్నీ.. లావుకే పడతాయని పరిశీలకులు భావిస్తున్నారు. జయదేవ్ విజిటింగ్ ఎంపీ అన్న టాక్ బాగా స్ప్రెడ్ అవ్వడంతో ఈ సారి లోకల్ ఫీలింగ్ ఇక్కడ ఓటర్లలో ఎక్కువుగా కనిపిస్తోంది. అలాగే టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలపై వ్యతిరేకతతో పాటు లోక్‌సభ సెగ్మెంట్ పరిధిలోని నాలుగు నియోజకవర్గాల్లో వైసీపీ ఎంపీ క్యాండెట్‌కు సానుకూలత కనిపిస్తోంది. మొత్తానికి గుంటూరు ఎంపీ స్థానంలో పోరు పతాక స్థాయికి చేరుతుందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

లావు ఎంట్రీతో.. గుంటూరు ఎంపీ రేసు హోరా హోరీ..!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share