లేడీ ఎమ్మెల్యేపై ఇంటిలిజెన్స్ రిపోర్ట్‌….బాబు షాకింగ్ డెసిష‌న్‌

ఏపీలో ఓ లేడీ ఎమ్మెల్యే వ్య‌వ‌హారంపై సీఎం చంద్ర‌బాబు చాలా సీరియ‌స్‌గా ఉన్నారు. స‌ద‌రు లేడీ ఎమ్మెల్యే ప‌దే ప‌దే త‌న చ‌ర్య‌ల ద్వారా పార్టీకి తీవ్ర న‌ష్టం క‌లిగిస్తుండ‌డంతో చంద్ర‌బాబు ఆమెపై ఇప్ప‌టికే ఇంటిలిజెన్స్ రిపోర్ట్ కూడా తెప్పించుకున్నారు. టీడీపీకి కంచుకోట అయిన ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాలో ఏలూరు ఎంపీ మాగంటి బాబుకు, చింత‌ల‌పూడి ఎమ్మెల్యే, మాజీ మంత్రి పీత‌ల సుజాత మ‌ధ్య కూల్ వాట‌ర్ పోసినా పెట్రోల్ మాదిరిగా మండుతోంది. 

గ‌త ఎన్నిక‌ల త‌ర్వాత పార్టీ కోసం ఎప్ప‌టి నుంచో క‌ష్ట‌ప‌డిన వారికి ప్ర‌యారిటీ ఇవ్వాల‌ని బాబు చేస్తోన్న ప్ర‌య‌త్నాల‌కు అప్పుడు మంత్రిగా ఉన్న సుజాత ఎప్ప‌టిక‌ప్పుడు అడ్డు త‌గులుతూ వ‌స్తున్నారు. చివ‌ర‌కు ఈ గ్రూపు రాజ‌కీయాలు తీవ్రం కావ‌డంతో పాటు మంత్రి సుజాత ఒంటెద్దు పోక‌డ‌లు ఆమె మంత్రి ప‌ద‌వి పోయే వ‌ర‌కు వెళ్లాయి. 

తాజాగా చింత‌ల‌పూడి ఏఎంసీ చైర్మ‌న్ భ‌ర్తీ విష‌యంలో సుజాత తాను చెప్పిన వాళ్ల‌కే ఏఎంసీ ఇవ్వాల‌ని ప‌ట్టుబ‌డుతున్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి క‌ష్ట‌ప‌డిన వాళ్ల‌ను ప‌క్క‌న పెట్టేయాల‌ని సుజాత డెసిష‌న్ తీసుకోవ‌డాన్ని ఎంపీ మాగంటి త‌ప్పుప‌ట్టారు. చివ‌ర‌కు వీరి మ‌ధ్య గొడ‌వ‌ల‌తో పార్టీ ప‌రువు బ‌జారున ప‌డ‌డంతో చంద్ర‌బాబు మంత్రులు పితాని స‌త్యానారాయ‌ణ‌, ప్ర‌త్తిపాటి పుల్లారావుతో ఓ క‌మిటీ కూడా వేశారు. ఈ క‌మిటీ కూడా గొడ‌వ స‌ర్దుబాటు చేయ‌లేక‌పోయింది.

చివ‌ర‌కు మాగంటీ వ‌ర్గీయులు రాజీనామా చేయ‌డంతో ఇంటిలిజెన్స్ రిపోర్ట్ చంద్ర‌బాబు వ‌ద్ద‌కు చేరింది.  జిల్లా ఇన్ ఛార్జి మంత్రి పత్తిపాటి పుల్లారావు ఇచ్చిన నివేదికతో పాటు ఇంటలిజెన్స్ నివేదిక కూడా మాజీ మంత్రి పీతలకు వ్యతిరేకంగా ఉండటంతో చింతలపూడిలో ఇన్నాళ్లూ జరుగుతున్న విష‍యం తన దృష్టికి ఎందుకు తేలేదని చంద్రబాబు సీరియస్ గా ప్రశ్నించారట. 

గ‌త ఎన్నిక‌ల్లో త‌న‌ను సీఎం చేసిన ప‌శ్చిమ‌గోదావ‌రిలో పార్టీకి న‌ష్టం జ‌రిగితే తాను చూస్తూ ఊరుకోన‌ని అవ‌స‌ర‌మైతే పీత‌ల‌ను ప‌క్క‌న పెట్టేస్తాన‌ని కూడా బాబు చెప్పేశార‌ని తెలుస్తోంది. పీత‌ల తీరుతో నియోజ‌క‌వ‌ర్గంలో టీడీపీ బాగా లాస్ అయ్యింద‌ని రెండు నివేదిక‌ల్లో తేల‌డంతో వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆమెకు టిక్కెట్ రాద‌ని టాక్‌. ఇక ఏఎంసీ చైర్మ‌న్ పోస్టు దాదాపు మాగంటి వ‌ర్గానికే ఖ‌రారు కానుంద‌ని తెలుస్తోంది.