జ‌గ‌న్‌కి కూడా శ‌శిక‌ళ బాట త‌ప్ప‌దా?!

దేశం మొత్తం ఇప్పుడు త‌మిళ‌నాడు వైపు చూస్తోంది! సీఎం పీఠంపై ఎన్నో ఆశ‌లు పెట్టుకున్న దివంగ‌త జ‌య‌ల‌లిత నెచ్చెలి శ‌శిక‌ళ అక్ర‌మార్జ‌న కేసులో జైలుకు వెళ్ల‌నున్నారు. నిన్న మొన్న‌టి వ‌ర‌కు తాను సింహాన్న‌ని, త‌న‌ను ఎవ‌రూ మోసం చేయ‌లేర‌ని బీరాలు ప‌లికిన శ‌శి నేడు క‌న్నీటి ప‌ర్యంటి ప‌ర్యంత‌మైంది. అమ్మ అండ చూసుకుని, తెర‌వెనుక సాగించిన అక్ర‌మాల పుట్ట ప‌గ‌లి.. అత్యున్న‌త న్యాయ‌స్థానం జైలు శిక్ష విధించ‌డం దేశ చ‌రిత్రంలో కొత్త‌కాదు. గ‌తంలోనూ అనేక మందికి ఈ అనుభవం ఉంది. అయితే, ఇక్క‌డ సీఎం సీటు కోసం ఎన్నో ఆశ‌లు పెట్టుకున్న వాళ్ల‌కి.. ఈ అక్ర‌మాల సంకెళ్లు.. వారి క‌ల‌ల‌ను క‌ల్ల‌లు చేయ‌డ‌మే!

శ‌శిక‌ళ తాజా ఉదంతం ఆమెతోనే అంత‌మ‌య్యేలా క‌నిపించ‌డం లేదు. ఈ ప‌రిణామం దక్షిణాదిలో స‌న్‌రైజింగ్ స్టేట్‌గా ఉన్న ఏపీకి కూడా పాకేలా క‌నిపిస్తోంది. ఏపీ సీఎం పీఠంపై అనేక ఆశ‌లు పెట్టుకుని, క‌న్ను తెరిచినా మూసినా సీఎం సీటునే క‌ల‌వ‌రించి, ప‌ల‌వ‌రిస్తున్న వైకాపా అధినేత‌, దివంగ‌త సీఎం వైఎస్ కుమారుడు జ‌గ‌న్‌కి కూడా శ‌శికళ ప‌రిస్థితే దాపురించ‌నుంద‌నే క‌థ‌నాలు తాజాగా సోష‌ల్ మీడియాను హోరెత్తిస్తున్నాయి. ఇప్ప‌టికే పీక‌ల్లోతు కేసుల్లో మునిగిపోయిన జ‌గ‌న్ ఆస్తుల‌ను రోజుకొక‌టి.. వారానికొక‌టి చందంగా ఈడీ జ‌ప్తు చేస్తున్న ప‌రిణామాలే ఆయ‌నను ఊపిరి తీసుకోనీయ‌డం లేదు.

ప్ర‌స్తుతం విచార‌ణ ప‌రిధిలో ఉన్న‌ప్పుడు ప‌రిస్థితి ఇలా ఉంటే.. కేసులు విచార‌ణ పూర్త‌యి గ‌డ‌ప దాటి తీర్పుల దాకా వెళ్తే.. జ‌గ‌న్ ప‌రిస్థితి ఏమిటి?  నిజంగానే ఆయ‌న సీఎం కాగ‌ల‌డా?  లేక శ‌శిక‌ళ మాదిరిగానే ఆయ‌న కూడా జైలుకు వెళ్లాల్సిందేనా?  తాజా ప‌రిణామాలు ఆదిశ‌గానే శంకించాల్సిన ప‌రిస్థితులు ఏర్ప‌డేలా చేస్తోంది. నిజానికి 2019లో ఏపీలో ఎన్నిక‌లు పెద్ద ఎత్తున సంచ‌ల‌నం సృష్టించ‌నున్నాయి. ఏపీలో ఈ సారి గెలుపొంద‌డం అంటే మాట‌లు కాదు. 2014లో ఉన్న ప‌రిస్థితి ఇప్పుడు అక్క‌డ లేదు. అయిన‌ప్ప‌టికీ.. వీటిని ఛేదించుకుని మెజారిటీ సంపాయించినా.. జ‌గ‌న్ వెనుకాలే.. కేసులు కాచుకుని కూర్చున్నాయి.

ఈ నేప‌థ్యంలో సీఎం సీటు ఆయ‌న‌కు ద‌క్క‌డం అనేది ఊహించ‌లేని ప‌రిణామంగా ఇప్పుడు శ‌శిక‌ళ ఉదంతం క‌ళ్ల‌కు క‌డుతోంది. అంతేకాదు, శ‌శిక‌ళ ఉదంతాన్ని జ‌గ‌న్‌కి ముడి ప్ర‌చారం చేసేందుకు టీడీపీ ఇప్ప‌టికే స‌ర్వం సిద్ధం చేసుకున్న‌ట్టు తెలుస్తోంది. ఈ క్ర‌మంలో త‌న తండ్రి అధికారాన్ని అడ్డు పెట్టుకుని ఏర్ప‌రుచుకున్న వ్యాపార సామ్రాజ్యం జ‌గ‌న్ మెడ‌కు ఉచ్చుబిగుస్తుంద‌న‌డంలో సందేహం లేదు. కాబ‌ట్టి.. జ‌గ‌న్ ఆశ‌లు కూడా శ‌శిక‌ళ మాదిరిగానే ప‌ఠాపంచలు కావ‌డం ఎంత మాత్రం సందేహం లేద‌నే టాక్ వినిపిస్తోంది. మ‌రి జ‌గ‌న్ ఇప్ప‌టి నుంచే త‌న పంథాను మార్చుకుంటారో?  లేక త‌న మొండి ప‌ట్టుతో ముందుకు వెళ్తారో చూడాలి.