వైసీపీలో నూతన ఉత్సాహం కారణం అదే!

చాలాకాలం నుండి  ప్రధాని అపాయింట్‌మెంట్‌ దొరకక  లోలోపల జగన్ మరియు వైస్సార్సీపీ నాయకులూ మదనపడుతున్నవేళ ప్రధాని అపాయింట్‌మెంట్‌తో జగన్ తో  సహా వైస్సార్సీపీ నాయకులకి మొహాలలో ఎక్కడలేని ఉత్సాహం కనపడుతుంది . టీడీపీ దోస్తీతో మరియు చంద్రబాబు స్నేహం కారణంగా మోడీ జగన్ ని దూరం పెడుతున్నారు అని వైస్సార్సీపీ నాయకులూ అనుకునేవారు .ఎట్టకేలకు ప్రధాని అపాయింట్‌మెంట్‌ దొరకటం మోడీ  జగన్‌ను చూసిన వెంటనే జగన్ ను పేరు పెట్టి పిలవటం చూసి చంద్రబాబు మీద ప్రేమ ఉన్నదో లేదో తెలియదుకాని జగన్ ను మీద వ్యతిరేకత లేదని జగన్ మరియు వైస్సార్సీపీ నాయకులూ  సంతోషపడుతున్నారు .

కేసుల వ్యవహారం బీజేపీతో దోస్తీ పై మాట్లాడేందుకు ప్రధానితో భేటీ కావాలనుకున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. అంతకముందు టీడీపీలో చేరిన నలుగురు వైసీపీ ఎమ్మెల్యేలకు చంద్రబాబు మంత్రివర్గంలో చోటు లభించడంతో దానిపై ఫిర్యాదు విషయంతో మోదీని కలవాలనుకున్నారు. అయితే పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాల సమయంలో వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డికి మాత్రమే అపాయింట్‌మెంట్‌ దొరికింది. జగన్‌కు అవకాశం దొరకలేదు .

దీంతో జగన్ మరియు వైసీపీ నాయకులు నిరుత్సహపడ్డారు .  అప్పటికే కేసులు తో సత్తమౌతున్న జగనికి అదే  సమయంలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) నుంచి జప్తు, ఇతరత్రా నోటీసులు ఒకదాని వెంట ఒకటి రావడంతో ఆ పార్టీ అగ్ర నేతల్లో కలవరం మొదలైంది. ఒకవైపు మోదీ అపాయింట్‌మెంట్‌ ఇవ్వకపోవడం.మరోవైపు ఈడీ దూకుడుతో వైసీపీ నాయకత్వం డీలా పడింది. అయితే మంగళవారం మధ్యాహ్నం ప్రధాని కార్యాలయం నుంచి అపాయింట్‌మెంట్‌ ఖరారైనట్లు జగన్‌కు సమాచారం అందింది.

దాంతో వైస్సార్సీపీ ప్రధాన నాయకులు మంగళవారం సాయంత్రానికే ఢిల్లీ వెళ్లిపోయారు. జగన్‌ బుధవారం ఉదయం చేరుకున్నారు. నిజానికి బీజేపీతో దోస్తీకి సిద్ధంగా ఉన్నామని వైపీసీ సీనియర్‌ నేతలు ఎప్పటినుంచో బీజేపీకి  సంకేతాలిస్తున్నారు. అయితే, పొత్తు మాటెలాఉన్నా, మోదీతో జగన్‌ కలిశాక  వైసీపీ అధినేత జగన్ కి మరియు పార్టీ నాయకులకు ఆనందంతో పొంగిపోతున్నారు .