జనసేన లోకి అక్కినేని అమల?

July 13, 2018 at 11:33 am
Pawan-Amala-Janasena

ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు ఇప్పుడు వాడీ వేడిగా సాగుతున్నాయి.  మొన్నటి వరకు అధికార పార్టీ అయిన టీడీపీలోకి వలసలు భారీగా జరిగాయి. ఇప్పుడు ట్రెండ్ మారుతుంది..వచ్చే ఎన్నికల్లో గెలుపు లక్ష్యంగా ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ‘ప్రజా సంకల్ప యాత్ర’ మొదలు పెట్టినప్పటి నుంచి కొంత మంది ముఖ్య నేతలు వైసీపీలోకి ఎంట్రీ ఇస్తున్నారు.  మరోవైపు పవన్ కళ్యాన్ కూడా వచ్చే ఎన్నికలకు సిద్దం అవుతున్న విషయం తెలిసిందే. 

 

  గత ఎన్నికల కంటే కూడా ఈ ఎన్నికలు వైసీపీ ,తెలుగుదేశం పార్టీలకి చావో రేవో అనేట్టుగా ఉంటే జనసేన మాత్రం పూర్తిస్థాయిలో పార్టీ నిర్మాణం జరుగక పోయినా సరే వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేవిషయంలో కింగ్ మేకర్ అవుతుందని అంటున్నారు..అయితే ఇప్పుడిప్పుడే జనసేన పార్టీ లో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి.   

 

ప్రత్యర్ధి పార్టీలని సైతం చిత్తుగా ఓడించగలిగే అభ్యర్ధులు గానీ జనసేనలో లేకపోవడం పార్టీ కి పవన్ కి తీవ్రమైన నష్టాన్ని తీసుకు వచ్చేలా ఉన్న తరుణంలో  జనసేనలోకి చిరంజీవి అభిమాన సంఘాలు వచ్చి చేరడం జనసేన పార్టీకి మంరింత బలాన్ని తెచ్చి పెట్టింది.. అంతేకాదు చిరంజీవి నాగబాబు లు మూతం మెగా ఫ్యామిలీ అంతా పవన్ కి తోడుగా నిలవబోతున్నాయి. 

 

 కొత్త పార్టీ కనుక సినీ గ్లామర్ ఉంటే జనసేనకు బాగా కలిసి వస్తుందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో జనసేన లోకి అక్కినేని ఫ్యామిలీ నుంచి అదీ కూడా అక్కినేని అమల రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తే ఎలా ఉంటుందని భావించారు.  అంతే ఇదే విషయంపై నాగార్జున ని సంప్రదించడం కూడా జరిగిందట ఇదిలాఉంటే ఇప్పటికే నాగార్జున వైసీపి అధినేత జగన్ కి మంచి మిత్రుడు అవడం ఇద్దరూ వ్యాపార విషయాలలో కూడా ఉండటంతో ముందు సున్నితంగా తిరస్కరించినా చిరు కి నాగార్జున కి ఉన్న మైత్రి కారణంగా అమలకే ఈ నిర్ణయం వదిలేశారని తెలుస్తోంది. 

 

అమల కేవలం ఒక నటిగా మాత్రమే కాకుండా మూగజీవాల సంరక్షణ మరియు స్త్రీల సమస్యలపై సామాజిక అంశాలపై కూడా ఆమె ఎప్పుడు ముందు ఉంటారు ఈ కోణంలోనే చిరు అమల పేరుని ప్రతిపాదించారని తెలుస్తోంది.

జనసేన లోకి అక్కినేని అమల?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share