ప‌వ‌న్ ప్ర‌చార వ్యూహం తెలిస్తే షాక‌వ్వాల్సిందే!

September 25, 2017 at 7:52 am
Pawan Kalyan, JanaSena

త‌క్కువ ఖ‌ర్చు.. ఎక్కువ ప్ర‌చారం!! ఇదే ఇప్పుడు జ‌న‌సేన ఫాలో అవుతోంది! ఇప్పుడే కాదు గ‌తంలోనూ ఇటువంటి సూత్రాన్నే ఫాలో అయినా.. ఇప్పుడు మ‌రింత ఎక్కువైన‌ట్టు క‌నిపిస్తోంది. ఈ ప్ర‌చారం ఇత‌ర పార్టీ నేత‌ల్లో గుబులు పెంచుతోంది. ప‌వ‌న్ ఆదేశించినా.. ఆదేశించ‌క‌పోయినా జ‌న‌సేన గురించి ఏ చిన్న వార్త వ‌చ్చినా.. దానిని ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్ల‌డంలో ఆయ‌న అభిమానులు ఎప్పుడూ సంసిద్ధంగా ఉంటారన‌డంలో సందేహం లేదు! ముఖ్యంగా ప‌వ‌న్ అభిమానులు సోష‌ల్ మీడియాలో చేస్తున్న ప్ర‌చారం.. మిగిలిన పార్టీ నేత‌ల్లో ఆందోళ‌న క‌లిగిస్తోంది! వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప్ర‌చారానికి ఇప్ప‌టినుంచే లెక్క‌లు వేసుకుంటుంటే.. జ‌న‌సేన‌కు మాత్రం ఆ టెన్ష‌న్ ఏమాత్రం అక్క‌ర్లేదు!!

వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ చేస్తాన‌ని సినీన‌టుడు, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌క‌టించిన నాటి నుంచి.. అందరిలోనూ ఎన్నో సందేహాలు!! వచ్చే ఎన్నికల్లో ఎన్ని స్థానాల్లో జనసేన పోటీ చేస్తుంది? గతంలోలాగే మద్దతు ప్రకటించి ప్రచారంతో సరిపెడుతుందా? అనే ప్ర‌శ్న‌ల్లో ఇంకా స్ప‌ష్ట‌త క‌రువైంది. జ‌న‌సేన అభిమానులు మాత్రం ఇవేమీ ప‌ట్టించు కోవ‌డం లేదు. ఇక అభిమానుల గురించి.. ఎంత చెప్పినా త‌క్కువే అవుతుంది. ప‌వ‌న్ అంటే పిచ్చిగా అభిమా నించే వారు మాత్రం తమ బాస్ చెప్పిందే వేదం అన్న రీతిలో వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ప్ర‌స్తుతం సోషల్ మీడియాలో మాత్రం జనసేన పై రోజుకో రకమైన ప్రచారం జ‌రుగుతోంది!!

`175 అసెంబ్లీ స్థానాల్లో ఏపీలో జనసేన పోటీ చేస్తుంది. సిద్ధంగా ఉండండి. మన కేంద్ర కార్యాలయంలో శిక్షణ కార్యక్రమాల్లో ఈ అంశం పై అధినేత క్లారిటీ ఇచ్చారు` అంటూ మెసేజ్ లు వైరల్ గా తిరుగుతున్నాయి. దాంతో జనసేన అభిమానులు ఉత్సహంగా పోస్టింగ్‌ల మీద పోస్టింగులు పెడుతున్నారు. జనసేన 175 అసెంబ్లీ స్థానాల్లో ఒకవేళ పోటీ చేస్తే ఏ పార్టీకి నష్టం ఏ పార్టీకి లాభం అన్న చర్చలు నడుస్తున్నాయి. ఆన్ లైన్ పార్టీ గా పేరు తెచ్చుకున్న జనసేన ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా తమ పార్టీ ని ఫోకస్ చేసే పనిలో బిజీగా ఉంది. ప్రజలకు వేగంగా చేరువ కావాలంటే ట్రెండ్ కి తగ్గట్టు నడుచుకోవాలన్నది జనసేన ప్రస్తుతం అనుసరిస్తున్న విధానం.

తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రచారం లభించేది సోషల్ మీడియానే! అందుకే కంటెంట్ రైటర్స్ స్పీకర్స్ కి జనసేన శిక్షణ ఇస్తుంది. ప్రతి నియోజకవర్గంలో 10 వేలమందికి తగ్గకుండా పవన్ హార్డ్ కొర్ ఫ్యాన్స్ ఉంటారు. ఇక ఆయన అభిమాన సంఘాలు కట్టే లెక్క. అందులో అత్యధికులు యువతే కావడం విశేషం. ఇక జనసేన చేపట్టే కార్యక్రమాలకు వీరంతా పవన్ వేసుకునే ఎర్ర తువ్వాలు మెడలో వేసుకోవడం లేదా తలకు చుట్టుకుని ప్రత్యేకంగా కనిపిస్తారు. మ‌రి ప్ర‌చారం చాలు క‌దా.. ఇత‌ర పార్టీల నేత‌ల్లో గుబులు పుట్టించ‌డానికి!!

 

ప‌వ‌న్ ప్ర‌చార వ్యూహం తెలిస్తే షాక‌వ్వాల్సిందే!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share