జనసేనకు షాక్‌.. ఆ సీనియర్‌ వైసీపీలోకే..!

November 10, 2018 at 2:48 pm

కాంగ్రెస్‌ పార్టీకి ఇటీవల రాజీనామ చేసిన మాజీ మంత్రి, మాజీ రాజ్యసభ సభ్యుడు, మాజీ ఎమ్మెల్సీ సీ. రామచంద్రయ్య వైసీపీలో చేరుతున్నట్టు తెలిసింది. గతంలో తెలుగుదేశం పార్టీలో కీలకంగా వ్యవహరించిన ఆయన రాయలసీమ జిల్లాల్లో ఆ పార్టీకి బలమైన వ్యక్తిగా ఉండేవారు. చంద్రబాబు నియంతృత్వ విధానాలు నచ్చక ఆ పార్టీకి రాజీనామా చేసిన ఆయన 2009లో ప్రజారాజ్యంలోకి జంప్‌ చేసేసారు. ఆ ఎన్నికల్లో కృష్ణా జిల్లాలోని మచిలీపట్నం నుంచి ఎంపీగా పోటీ చేసిన రామచంద్రయ్య బలంగా ఓట్లు చీల్చారు. ఆ ఎన్నికల్లో గెలుపును రామచంద్రయ్య తృటిలో చేజార్చుకున్నారు. ఆ తర్వాత ప్రజారాజ్యం పార్టీని ఆ పార్టీ అధినేత చిరంజీవి కాంగ్రెస్‌లో విలీనం చెయ్యడంతో కాంగ్రెస్‌లోకి వెళ్లిన రామచంద్రయ్య ఆ పార్టీలో క్రియాశీలక పాత్ర పోషించారు.1376388749-19

రాయ‌ల‌సీమ జిల్లాలో బలమైన బలిజ సామాజికవర్గానికి చెందిన ఆయనకు కడప జిల్లాలో మంచి పట్టు ఉంది. ఇక తాజాగా కాంగ్రెస్‌ పార్టీ తన ఆగర్భ శత్రువు అయిన తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోవడాన్ని జీర్ణించుకోలేని కాంగ్రెస్ వాదులు కొందరు కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే రామచంద్రయ్య సైతం కాంగ్రెస్‌కు రాజీనామా చేశారు. కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన ఆయన పవన్‌ కళ్యాణ్‌ జనసేనలోకి వెళ్తారని… జనసేనకు చెందిన కొంత మంది పవన్‌ సూచనల మేరకు రామచంద్రయ్యతో చర్చలు జరిపారని కూడా వార్తలు వచ్చాయి. అయితే రామచంద్రయ్య మాత్రం జనసేనకు షాక్ ఇస్తూ వైసీపీలోకి వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ నెల 13వ తేదీన ఆయన వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నట్టు తెలిసింది.TDP-To-PRP--Then-Congress---Now-JSP--1539063369-1393

శుక్రువారం కడపలో ఓ వివాహ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ఆయన ఈ విషయాన్ని లీక్‌ చెయ్యడంతో రామచంద్రయ్య వైసీపీ ఎంట్రీ ఖాయం అయిపోయినట్టు తెలుస్తోంది. ఇక వైసీపీలో చేరేందుకు రెడీ అవుతున్న రామచంద్రయ్య ఏ ప్రతిపాద‌న, ఏ హామీ మెరకు ఆ పార్టీలో చేరుతున్నారన్న దానిపై మాత్రం స్పష్టత లేదు. ఇప్పటికే పలు కీలక పదవులు చేపట్టిన ఆయన ప్రస్తుతానికి అయితే వైసీపీలో ఎలాంటి క్రియాశీలక పాత్ర పోషిస్తారన్న దానిపై మాత్రం కాస్త సస్‌పెన్స్‌ ఉంది. ఇక చంద్రబాబు నాలుగున్నర ఏళ్ల పాలనను రామచంద్రయ్య ఎప్పుడూ తీవ్రంగా విమర్శిస్తూ వచ్చారు. ఇప్పుడు తాము విమర్శించిన చంద్రబాబుతోనే తమ పార్టీ పొత్తుకు సిద్ధ పడడాన్ని ఆయన ఏ మాత్రం జీర్ణించుకోలేకపోయారు.

జనసేనకు షాక్‌.. ఆ సీనియర్‌ వైసీపీలోకే..!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share