ఎన్నిక‌ల్లో ఒంట‌రిగా పవన్ .. అంతా డౌటే..!

January 10, 2019 at 4:09 pm

తాము వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఒంట‌రిగానే బ‌రిలోకి దిగుతామ‌ని జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ ప్ర‌క‌టించినా.. జ‌నం మాత్రం డౌటు ప‌డుతూనే ఉన్నారు. ప‌వ‌న్ చెప్పిన దాంట్లో నిజం లేద‌నీ.. తెలుగుదేశం పార్టీ, జ‌న‌సేన‌ల మ‌ధ్య ఎక్క‌డో లింకు ఉంద‌నే అంచ‌నాకు వ‌స్తున్నారు. ఇక రాజ‌కీయ విశ్లేష‌కులు అయితే.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీ, జ‌న‌సేన‌లు క‌లిసి న‌డిచే అవ‌కాశాలు మెండుగానే ఉన్నాయని, ఒంట‌రిగా ప‌వ‌న్ బ‌రిలోకి దిగడం డౌటేన‌ని చెప్పుకొస్తున్నారు. ఇందుకు వారు కొన్ని బ‌ల‌మైన కార‌ణాలు చెబుతున్నారు. వాటి ఆధారంగానే ప‌వ‌న్ చేసిన ప్ర‌క‌ట‌న‌పై జ‌నంతోపాటు రాజ‌కీయ విశ్లేష‌కులు అనుమానాలు వ్య‌క్తం చేస్తున్నారు.

టీడీపీ, జ‌న‌సేన పార్టీలు క‌లిసి న‌డిచే అవ‌కాశాలు ఉన్నాయ‌ని చెప్పడానికి ఇక్క‌డ మ‌నం మూడు నాలుగు ప‌రిణామాల గురించి చెప్పుకోవ‌చ్చు. ఇందులో మొద‌టిది.. జ‌న‌సేన పార్టీ నేత తోట చంద్ర‌శేఖ‌ర్ 99టీవీని సొంతం చేసుకున్న విష‌యం తెలిసిందే. అయితే.. ఇక్క‌డ మ‌నం గ‌మ‌నించాల్సిన విష‌యం ఏమిటంటే.. ఈ ఛానెల్‌లో ఈ మ‌ధ్య చంద్ర‌బాబు ప‌ర్య‌ట‌న‌ల‌కు విప‌రీత‌మైన క‌వ‌రేజీ ఇస్తున్నారు. ఏబీఎన్‌, మ‌హాటీవీల కంటే ఎక్కువ‌గా క‌వ‌రేజీ ఇవ్వ‌డం గ‌మ‌నార్హం. టీడీపీ, జ‌న‌సేన‌ల మ‌ధ్య కుదిరిన అవగాహ‌న‌లో భాగంగానే… 99టీవీలో చంద్ర‌బాబు క‌వ‌రేజీ పెరిగిపోయింద‌నే టాక్ బ‌లంగా వినిపిస్తోంది.

ఇక రెండో కార‌ణం చూస్తే.. అమెరికా ప‌ర్య‌ట‌న‌లో త‌ర్వాత జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ మాట‌ల్లో బాగా తేడా వ‌చ్చింది. చంద్ర‌బాబును, ఆయ‌న‌కు మారుడు, మంత్రి లోకేశ్‌ను తిట్ట‌డం మానేశారు. దాదాపుగా మాట్లాడ‌డం లేదు. ఎంత‌సేపూ వైసీపీ అధినేత జ‌గ‌న్‌పైనే ప‌వ‌న్ విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. ఇక దీటుగా జ‌గ‌న్ ఎదురుదాడి చేయ‌డంతో జ‌న‌సేన తోక‌ముడించింద‌న్న‌ది బ‌హిరంగ ర‌హ‌స్య‌మే. మూడో విష‌యానికి వ‌స్తే.. జ‌న‌వ‌రి ఒక‌టి త‌ర్వాత మిగ‌తా జిల్లాల్లోనూ ప‌ర్య‌టిస్తాన‌ని చెప్పిన ప‌వ‌న్ అనూహ్యంగా దానిని ర‌ద్దు చేసుకున్నారు.What-transpired-between-Naidu-and-Pawan

మ‌రోవైపు.. ఈ సంక్రాంతి కంటే ముందే టీడీపీ అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టిస్తాన‌ని చంద్ర‌బాబు చెప్పారు. కానీ.. ఇప్పుడు అభ్య‌ర్థుల జాబితాను ప్ర‌క‌టించే అవ‌కాశాలు క‌నిపించ‌డం లేదు. దీంతో జ‌న‌సేనతో క‌లిసి న‌డిచే అవ‌కాశాలు ఉన్నాయ‌నీ.. అందుకే చంద్ర‌బాబు అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించ‌డం వాయిదా వేస్తున్నార‌ని టీడీపీవ‌ర్గాల్లోనే గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ఈ ప‌రిణామాల‌న్నీ కూడా జ‌న‌సేన‌, టీడీపీలు వ‌చ్చే ఎన్నిక‌ల్లో పొత్తు పెట్టుకుంటాయ‌న‌డానికి సంకేతాల‌ని ప‌లువురు రాజ‌కీయ విశ్లేష‌కులు భావిస్తున్నారు.

ఎన్నిక‌ల్లో ఒంట‌రిగా పవన్ .. అంతా డౌటే..!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share