2019 ఎలక్షన్స్ పై జేసీ జోస్యం..!/

March 4, 2019 at 11:10 am

ఎవ‌రైనా నాకొక్క‌టే.. అది జ‌గ‌న్ అయినా.. చంద్ర‌బాబు అయినా.. నా దారి ర‌హ‌దారి… నాకు న‌చ్చింది నే చేస్తా.. నాకు నేనే సాటి.. నాకు నేనే ప‌రిపాటి.. అదే జేసీ గారి వాగ్దాటి.. ఆయ‌న ఏ పార్టీలో ఉన్న కుండ బ‌ద్ద‌లు కొట్టిన‌ట్టు మాట్లాడుతూనే ఉంటారు.. కాదు కాదు సైకిల్ పంచ‌ర్ అయ్యేట‌ట్టు మాట్లాడుతారు.. ఎందుకంటే ఆయ‌న జేసీ కాబట్టి. దివాక‌రుడి రూటే స‌ప‌రేట్‌.. ఇప్పుడు అధినేత‌కు కూడా త‌న మాట‌ల‌తో హ‌డ‌లెత్తించాడు.. క‌నీసం న‌ల‌భై మంది ప‌ని మటాష్ అంటూ హెచ్చ‌రిక‌లు పంపారు. మేల్కొల్ప‌డానికో, లేక మ‌రెందుకో గానీ త‌న మ‌న‌సులో మాట‌ను క‌క్కేశాడు.

తాను తెలుగుదేశం పార్టీకి చెందిన ఎంపీయే. కానీ త‌న పార్టీ క‌దా అని దాచుకోలేదు. త‌మ పార్టీకి చెందిన ప‌లువురు ఎమ్మెల్యేలు ప‌నితీరును మార్చుకోవాల‌ని సూచించారు. వాళ్ల ప‌ని ఏ మాత్రం బాగులేద‌ని, భ‌విష్య‌త్తులో చాలా ఇబ్బందులు ప‌డాల్సి వ‌స్తుంద‌ని అధినేత‌కు తెలిసేలా సెల‌విచ్చారు. వారంద‌రినీ మార్చ‌డ‌మైనా చేయాల‌ని లేక‌పోతే వారి ప్ర‌వ‌ర్త‌న‌ను మార్చుకోమ‌నైనా చెప్పాల‌ని సూచించారు. ప్ర‌వ‌ర్త‌న మార్చుకోవ‌డం అంటే ఇప్ప‌ట్లో జ‌రిగే ప‌ని కాదు కానీ వారిని వారి వారి స్థానాల నుంచి త‌ప్పించి వేరే వారికి టిక్కెట్టు ఇస్తేనే పార్టీకి ఉప‌యోగంగా ఉంటుంద‌ని చెప్పుకొచ్చారు.

ఘాటైన మాట‌ల‌తో గ‌ర‌మెక్కించే జేసీ దివాక‌ర్‌రెడ్డి మాట‌ల‌ను బాబు గారు ఎలా అర్థం చేసుకుంటారో తెలియ‌దు కానీ భ‌విష్య‌త్తు మాత్రం వారికే సీటిచ్చి స‌మ‌ర్పించుకుంటారో లేక చ‌క్క‌దిద్దుకుంటారో చూడాలి మ‌రీ. ఏదిఏమైనా 175 స్థానాల్లో అంత మంది ప్ర‌వ‌ర్త‌న‌పై జేసీ లాంటి సీనియ‌ర్ నాయ‌కుడు అలా అన్నాడంటే పాల‌న ప‌రిస్థితి ఎంత అధ్వానంగా ఉందో అర్థం చేసుకోవ‌చ్చు. కానీ ఇవేవైనా బ‌య‌ట‌కు అంటే బాబుగారూ అగ్గిమీద గుగ్గిల‌మై అంతేతున లేస్తాడు. మీరు కూడా ఎక్క‌డ అన‌కండే.. చూద్దాం బాబూ గారి దిద్దుబాటు చ‌ర్య‌లు.

2019 ఎలక్షన్స్ పై జేసీ జోస్యం..!/
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share