జీవిత మ‌ళ్లీ పార్టీ మారుతుందోచ్‌… ఎంపీగా పోటీనా..!

March 19, 2018 at 5:29 pm
jeevitha-party

రాజ‌కీయాల్లో ఆయారాం.. గ‌యారాం.. బ్యాచ్‌లో ఫ‌స్ట్ ఉన్న న‌టి జీవిత మ‌రోసారి పార్టీ మారేందుకు రంగం సిద్ధం చేసుకు న్న‌ట్టు తెలుస్తోంది. ఇప్ప‌టికే రెండు మూడు పార్టీల్లో చేరి.. మ‌ళ్లీ కండువాలు మార్చేసిన జీవితా రాజ‌శేఖ‌ర్ ప్ర‌స్తుతం జాతీ య పార్టీ బీజేపీలో ఉన్న విష‌యం తెలిసిందే.  అయితే, ఆమె త్వ‌ర‌లోనే బీజేపీకి కూడా రాంరాం చెప్పాల‌ని డిసైడ్ చేసు కున్న‌ట్టు స‌మాచారం. 

 

చాలా పార్టీలు చూసిన తరువాత జీవిత లేటెస్ట్ గా బీజేపీలో సెటిల్ అయ్యారు. ఆ పార్టీ సాయంతోనే  కేంద్ర సెన్సారు బోర్డు మెంబర్ కూడా అయ్యారు. అయితే ప్రస్తుతం మారుతున్న రాజకీయ పరిస్థితులు, ఏపీలో పెరుగుతు న్న హోదా సెంటిమెంట్ తో జీవిత మళ్లీ ఆలోచనలో పడినట్లు తెలుస్తోంది. గత కొంతకాలంగా జీవిత తెలుగుదేశం పార్టీలో చేరే ఆలోచనలో ఉన్నారు. 

 

ఇలాంటి టైమ్ లో హోదా సెంటిమెంట్ బలంగా రాజుకుంటోంది. అందుకే ఇదే తరుణంలో బీజేపీలో త‌మ ఉనికికే ప్ర‌మాద‌మ‌ని భావించిన ఆమె.. ఆ పార్టీకి  రాజీనామా చేయాలని డిసైడ్ అయినట్లు టాలీవుడ్ వ‌ర్గాల్లో వినిపిస్తోంది. తాజాగా ఓ సినిమా ఓపెనింగ్ కు వచ్చిన అనంత‌పురం టీడీపీ ఎంపీ జేసీ దివాకర రెడ్డితో నటి జీవిత, హీరో రాజశేఖర్ రాజకీయ సమాలోచనలు జరిపినట్లు తెలుస్తోంది. 

 

తాము టీడీపీలోకి వ‌స్తామ‌ని వారు దివాక‌ర్ రెడ్డికి ప్ర‌పోజ్ చేసిన‌ట్టు తెలుస్తోంది. దీంతో ఆయన ఈ విషయంలో చంద్రబాబుతో మాట్లాడతానని హామీ ఇచ్చినట్లు స‌మాచారం. పార్లమెంట్ సమావేశాలు ముగిశాక, జీవిత దంపతులను చంద్రబాబుతో సమావేశపరుస్తానని చెప్పినట్లు స‌మాచారం. ఇదే జ‌రిగితే.. జీవిత ఏపీ అధికార పార్టీలోకి మార‌డం ఖాయ‌మ‌ని తెలుస్తోంది. 

 

ఇక‌, రాజ‌కీయాల్లో ఉన్న‌వారి ఏకైక ల‌క్ష్యం ప‌ద‌వుల‌ను అనుభ‌వించ‌డ‌మే. దీనికి జీవిత కూడా వ్య‌తిరేకం కాదు. అందుకే ఆమె కూడా ప‌ద‌వుల కోసమే టీడీపీలోకి వ‌స్తున్న‌ట్టు తెలుస్తోంది. అయితే, ఆమె ఏపీ టీడీపీ నుంచి కాకుండా తెలంగాణ టీడీపీ నుంచి పోటీ చేసే యోచ‌న‌లో ఉన్న‌ట్టు స‌మాచారం. ప్ర‌స్తుతం తెలంగాణ టీడీపీ వీక్ గానే ఉన్న‌ప్ప‌టికీ.. ఏపీ వాసులు ఎక్కువ‌గా ఉన్న కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో మాత్రం ఇప్ప‌టికీ చంద్ర‌బాబు హ‌వా పార్టీకి అండ కొన‌సాగుతూనే ఉంది. 

 

అలాంటి మ‌ల్కాజ్‌గిరి నియోజ‌క వ‌ర్గం నుంచి జీవిత ప్రాతినిధ్యం వ‌హించాల‌ని భావిస్తున్న‌ట్టు తెలుస్తోంది. జీవితంలో ఒక్క‌సారైనా చ‌ట్ట‌స‌భ‌ల‌కు ఎన్నిక కావ‌డం జీవిత ల‌క్ష్యంగా గ‌తంలోనే ఆమె ప్ర‌క‌టించుకున్నారు. అయితే, ఇప్ప‌టి వ‌ర‌కు ఆమె త‌న క‌ల‌ను సాకారం చేసుకోలేక పోయారు. ఈ క్ర‌మంలో ఇప్పుడు జీవిత టీడీపీ పంచ‌న చేరి త‌న క‌ల తీర్చుకునే ప్ర‌య‌త్నాలు చేస్తున్నార‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి బాబు ఎలా డిసైడ్ చేస్తాడో చూడాలి. 

జీవిత మ‌ళ్లీ పార్టీ మారుతుందోచ్‌… ఎంపీగా పోటీనా..!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share