ఎన్టీఆర్ మ‌ళ్లీ తండ్ర‌య్యాడు…ఈసారి ఎవరంటే ..

June 14, 2018 at 2:00 pm
ntr-son

టాలీవుడ్ యంగ్‌టైగ‌ర్ జూనియ‌ర్ ఎన్టీఆర్ మ‌రోసారి తండ్రి అయ్యాడు. ఈ సారి కూడా ఆయ‌న భార్య ల‌క్ష్మి ప్ర‌ణ‌తి మ‌గ‌బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చింది. తల్లి, బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ విష‌యాన్ని ఎన్టీఆర్ ట్వీట్ట‌ర్ ద్వారా తెలుపుతూ ఎన్టీఆర్ ‘కుటుంబం పెద్దదైంది.. మరోసారి బాబు’ అంటూ ట్వీట్ చేశారు. ఎన్టీఆర్ మ‌రోసారి తండ్రి అయ్యాడు.. మ‌ళ్లీ ఎన్టీఆర్ ఇంట వార‌సుడే పుట్టాడ‌న్న వార్త‌తో ఆయ‌న అభిమానుల్లో ఎక్క‌డా లేని సంతోషం వ్య‌క్త‌మ‌వుతోంది. ఇక ఎన్టీఆర్ కుటుంబ స‌భ్యులు కూడా తాజా వార్త‌తో ఫుల్ ఖుషీగా ఉన్నారు. 

 

ఎన్టీఆర్ అభిమానులు ఈ వార్త‌ను సోష‌ల్ మీడియాలో షేర్ చేసుకుంటూ ఎన్టీఆర్‌కు శుభాకాంక్ష‌లు చెపుతున్నారు. సినీ ప్రముఖులు సైతం ఎన్టీఆర్ కు అభినందనలు తెలుపుతున్నారు. ఇక ఎన్టీఆర్ – ల‌క్ష్మీప్ర‌ణ‌తి దంప‌తుల‌కు 2011లో వివాహ‌మైంది. ఈ దంప‌తుల‌కు ఇప్ప‌టికే కుమారుడు అభ‌య్ రామ్ ఉన్న సంగ‌తి తెలిసిందే. ఇక ఇప్పుడు రెండోసారి కూడా వారి కుటుంబంలో అబ్బాయే పుట్ట‌డంతో ఎన్టీఆర్‌కు ఇద్ద‌రు వార‌సులు వ‌చ్చిన‌ట్ల‌య్యింది. 

నా నువ్వే TJ రివ్యూ

ఎన్టీఆర్ మ‌ళ్లీ తండ్ర‌య్యాడు…ఈసారి ఎవరంటే ..
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share