ఎన్టీఆర్, బాబు వలకు చిక్కినట్టేనా !

November 20, 2018 at 6:17 pm

బాబంబే బాబే మ‌రి. అవ‌స‌రానికి వాడుకోవ‌డం.. అది తీరాక ఇరుకున ప‌డేయ‌డం.. ప్ర‌తీ అవ‌కాశాన్ని రాజ‌కీయంగా వాడుకోవ‌డంలో ఆయ‌న‌కు ఆయ‌నే సాటి. తాజాగా.. బాబుగారు మ‌రోసారి త‌న అస్త్రాన్ని తార‌క్‌పై ప్ర‌యోగిస్తున్నాడా..? తాజా ప‌రిణామాలు మాత్రం ఔన‌నే అంటున్నాయి. ప్ర‌స్తుతం తెలంగాణ‌లో జ‌రుగుతున్న అసెంబ్లీ ఎన్నిక‌ల్లో గ్రేట‌ర్‌లోని కూక‌ట్‌ప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గం నుంచి మ‌హాకూట‌మి అభ్య‌ర్థిగా హ‌రిక‌`ష్ణ కూతురు సుహాసిని బ‌రిలోకి దిగుతున్న విష‌యం తెలిసిందే. కాంగ్రెస్ నేత‌`త్వంలో టీడీపీ, తెలంగాణ జ‌న స‌మితి, సీపీఐలు ప్ర‌జాకూట‌మిగా ఏర్పడ్డాయి. అయితే.. సుహాసిని నామినేష‌న్ సంద‌ర్భంగా బాల‌య్య ఆమె వెంటే ఉండి.. అన్నీ ద‌గ్గ‌రుండి చూసుకున్నారు.Not-A-Cakewalk-For-Nandamuri-Suhasini-1542627703-1468

అయితే.. సుహాసిని త‌రుపున జూనియ‌ర్ ఎన్టీఆర్ ప్ర‌చారం చేస్తాడా లేదా.. అన్న‌దానిపై ఇప్పుడు ఆస‌క్తిక‌ర‌మైన చ‌ర్చ జ‌రుగుతోంది. 2009 ఎన్నికల్లో టీడీపీ త‌రుపున ఎన్టీఆర్ ప్ర‌చారం చేసిన విష‌యం తెలిసిందే. ఆ ఎన్నికల్లో ప్రతికూల ఫలితం వచ్చాక..ఆ నింద‌ను ఆయ‌న‌పై నెట్టేసి.. ప‌క్క‌నే పెట్టేశారు బాబు. ఇక ఆ తర్వాత ఎప్పుడూ ఎన్టీఆర్‌ను పట్టించుకున్నది లేదు. మరోవైపు బాబాయి బాలకృష్ణ.. ఇతర నందమూరి కుటుంబ సభ్యులు సైతం ఎన్టీఆర్‌పై ఎలాంటి వివ‌క్ష చూపారో ఆంధ్రులంద‌రికీ తెలిసిందే. ఆఖ‌రికి ఆయ‌న సినిమాల‌పై కూడా టీడీపీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు వ్య‌తిరేక ప్ర‌చారం చేయ‌డం తెలిసిందే.Nandamuri-Suhasini-gets-support-from-Jr-NTR-and-Kalyan-Ram

ఇక 2014లో ఏపీ టీడీపీ విజయం తర్వాత హ‌రిక‌`ష్ణ‌ను, ఎన్టీఆర్‌ను చంద్ర‌బాబు పూర్తిగా ప‌క్క‌న పెట్టేశారు. రోడ్డు ప్ర‌మాదంలో హ‌రిక‌`ష్ణ దుర్మ‌ర‌ణం చెందిన త‌ర్వాత చంద్ర‌బాబు, బాల‌య్య సానుభూతి చూపించేందుకు ప్ర‌య‌త్నం చేస్తున్నారు. అర‌వింద స‌మేత స‌క్సెస్ మీట్‌కు బాల‌య్య హాజ‌రు కావ‌డం గ‌మ‌నార్హం. ఇప్పుడేమో హరికృష్ణ కూతురు సుహాసినికి కూకట్ పల్లి టికెట్ కేటాయించడం ద్వారా ఎన్టీఆర్ ను కంట్రోల్‌లో ఉంచుకునేందుకు ప్రయత్నం చేస్తున్నార‌నే టాక్ వినిపిస్తోంది. కూక‌ట్‌ప‌ల్లిలో సెటిల‌ర్లు ఎక్కువ‌గా ఉంటారు కాబ‌ట్టి ఈ సీటు ఎలాగైనా టీడీపీకే ద‌క్కుతుంద‌ని చంద్ర‌బాబు అనుకుంటున్నారు.pic (1)

హ‌రిక‌`ష్ణ మ‌ర‌ణం త‌ర్వాత ఆయ‌న కుటుంబానికి ప్రాధాన్యం చెప్పుకుని రాజ‌కీయంగా ల‌బ్ధిపొందాల‌న్న‌ది చంద్ర‌బాబు వ్యూహంగా క‌నిపిస్తోంది.
ఈ పరిస్థితుల్లో ఎన్టీఆర్ ను కూడా ప్రచారానికి రప్పించడానికి ఒత్తిడి చేస్తున్నారు. ఒక‌వేళ‌ అతను కాదంటే అక్క కోసం ప్రచారం కూడా చేయడానికి ఎన్టీఆర్ రాలేద‌న్న నింద‌ను నెట్టేందుకు కూడా టీడీపీ నేత‌లు వెనుకాడ‌రు. సుహాసిని నామినేష‌న్ రోజునే జూనియ‌ర్ ఎన్టీఆర్‌, క‌ళ్యాణ్‌రాం ట్విట్ట‌ర్‌లో శుభాకాంక్ష‌లు తెలిపారు. అయితే.. మ‌రోవైపు ఆర్ ఆర్ ఆర్ సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ మొద‌లైంది. ఈ నేప‌థ్యంలో తార‌క్ ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటారో చూడాలి మ‌రి.

ఎన్టీఆర్, బాబు వలకు చిక్కినట్టేనా !
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share