క‌డప‌పై బాబు వ్యూహం అట్ట‌ర్ ప్లాప్‌..!

August 21, 2018 at 10:26 am

టీడీపీ అధినేత చంద్రబాబు.. ఎన్నికల వ్యూహాలు చాలా గమ్మత్తుగా ఉంటాయి. ఆయన ఏదైనా ప్లాన్ వేశారంటే.. అది సక్సెస్ కాకుండా మాత్రం ఉండదు. కానీ, ఇప్పుడు వైసీపీ అధినేత జగన్ సొంత జిల్లాలో పాగా వేయాలని భావిస్తున్న ప్లాన్ మాత్రం ఒక అడుగు ముందుకు నాలుగు అడుగులు వెనక్కి అన్న చందంగా మారిపోయింది. ఎట్టి పరిస్థితిలోనూ వచ్చే ఎన్నికల్లో కడపలో సత్తా చాటాలని చంద్రబాబు నిర్ణయించుకున్నారు. రాష్ట్రంలో జగన్ను దెబ్బకొట్టడం కన్నా.. ఆయన సొంత జిల్లా కడపలోనే ఆయనను దెబ్బతీయడం వల్ల నైతికంగా వైసీపీపై టీడీపీ పైచేయి సాధించవచ్చని చంద్రబాబు ప్లాన్ వేశారు. ఈ క్రమంలోనే ఆయన ఇక్కడి నాయకులు ప్రాధాన్యం పెంచారు. అడిగిన వెంటనే బీటెక్ రవికి ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చారు.jagan-tv-media

అదేవిధంగా సీఎం రమేష్కు రాజ్యసభ సభ్యత్వాన్ని రెన్యువల్ చేశారు. నిజానికి ఈ రెండు అంశాల్లోనూ చంద్రబాబు తీవ్రమైన ఒత్తిడి ఎదుర్కొన్నారు. ఎమ్మెల్సీ టికెట్ కోసం పోటీ పోటీగా నాయకులు చంద్రబాబు ముందు మూగారు. అయి నా కూడా యువ నాయకులుగా భావించి బీటెక్ రవికి అవకాశం ఇచ్చారు. ఇక, కడపలో టీడీపీని పరుగులు పెట్టిస్తాడని భావించి సీఎం రమేష్కు రాజ్యసభ సీటును రెన్యువల్ చేశారు. అదేవిధంగా జమ్మలమడుగు నుంచి వైసీపీ టికెట్పై గెలుపొందిన ఆదినారాయణ రెడ్డిని పార్టీలోకి ఆహ్వానించి మంత్రిని చేశారు. అదేవిధంగ బద్వేలులో జయరాములును పార్టీలోకి ఆహ్వానించి నిధులు కుమ్మరించారు. ఇలా ప్రతి విషయంలోనూ చంద్రబాబు ఇక్కడ టీడీపీ నాయకులకు అనుకూలంగా వ్యవహరించారు.Ravi-

ఒక్కమాటలో చెప్పాలంటే.. కడపలో పార్టీని బలోపేతం చేసుకునేందుకు చంద్రబాబు చాలా మెట్లే కిందికి దిగారు. అయి నా కూడా నాయకులు ఇక్కడ టీడీపీ విజయం సాధిస్తుందా? అని అడిగితే.. సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఉండడం గమనార్హం. అంతేకాదు, నాయకుల మధ్య ఆధిపత్య పోరు నానాటికీ పెరుగుతోంది. ఇక, వైసీపీ నుంచి వచ్చిన నాయకుల మధ్య టీడీపీ నాయకులకు సమన్వయం లేదు. ఈ పరిస్థితిలో కడపలో ఏదో చేయాలని భావించి.. అనేక విధాలుగా ఇక్కడ సహకరించిన చంద్రబాబు ఇప్పుడు ఎలాంటి ఫలితమూ కనిపించని పరిస్థితి నెలకొనడం గమనార్హం. ఇటీవల సీఎం రమేష్ నిర్వహించిన కడప ఉక్కు పోరాట దీక్ష కూడా నైతికంగా సక్సెస్ కాలేదనే అపవాదు మూటకట్టుకోవడం, వైసీపీని ఏమీ చేయలేరనే ప్రచారం జరగడం కూడా గమనార్హం. ఇదీ కడపలో టీడీపీ పరిస్థితి.d4e573c1432195e834603433517d1e3d

క‌డప‌పై బాబు వ్యూహం అట్ట‌ర్ ప్లాప్‌..!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share