బాపీరాజుకు వైసీపీ వ‌ల‌.. టీడీపీకి దెబ్బేనా..?

May 9, 2018 at 10:37 am
bapiraju-kanumuri

రాజ‌కీయాల్లో ప్ర‌త్య‌ర్థి బ‌లాన్ని తెలుసుకుని అడుగులు వేస్తేనే.. గెలుపు ద‌క్కేది లేదా బ‌ల‌మైన పోటీ ఇచ్చేది! ఈ విష‌యంలో రాటుదేలిన‌ట్టు ఉన్నా డు వైసీపీ అధినేత జ‌గ‌న్‌. 2019 ఎన్నిక‌ల్లో త‌న స‌త్తా చాటేందుకు జ‌గ‌న్ వేస్తున్న ప్ర‌తి అడుగూ వ్యూహాత్మ‌కంగానే సాగుతోంది. ప్ర‌జా సంక‌ల్ప యాత్ర ద్వారా ఆయ‌న గ్రామ గ్రామాన పార్టీని బ‌లోపేతం చేశాడు. ముఖ్యంగా మ‌హిళ‌ల‌ను ఆయ‌న టార్గెట్ చేసుకుని ముందుకు సాగుతున్నాడు. అదేస‌మ‌యంలో నియోజ‌క‌వ‌ర్గాల‌పై వైసీపీకి ఉన్న ప‌ట్టును కూడా అంచ‌నా వేసుకుని.. మ‌రింత బ‌ల‌ప‌డేందుకు లేదా టీడీపీని మ‌రింత బ‌లంగా దెబ్బ‌కొట్టేందుకు జ‌గ‌న్ అడుగులు వేస్తున్నాడు. ఈ క్ర‌మంలోనే ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలో న‌ర‌సాపురం పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గాన్ని వైసీపీ ఖాతాలో వేసుకునేందుకు ఆయ‌న పావులు క‌దుపుతున్నారు. ఇక్క‌డ నుంచి ప్ర‌స్తుతం బీజేపీ ఎంపీగా గోక‌రాజు గంగ‌రాజు ప్రాతినిధ్యం వ‌హిస్తు న్నారు. 

 

ఈ నియోజ‌క‌వ‌ర్గంలో క్ష‌త్రియ ప్ర‌భావం ఎక్కువ‌గా ఉండ‌డంతో క్ష‌త్రియుల‌కే అన్ని పార్టీలూ టికెట్లు ఇచ్చేందుకు ముందుకు వ‌స్తాయి. గ‌త ఎన్నిక‌ల్లో బీజేపీ-టీడీపీ మిత్ర‌ప‌క్షంగా రంగంలోకి దిగ‌డంతో ఇక్క‌డ నుంచి బీజేపీ అభ్య‌ర్థిగా గోక‌రాజు పోటీ చేశారు. భారీ మెజారిటీతో గెలుపొందారు. అయితే, ఇప్పుడు ప‌రిస్థితి యూట‌ర్న్ తీసుకుంది. ఇరు పార్టీలూ వీధిపోరాటాలు చేసుకుంటున్నాయి. ఈ నేప‌థ్యంలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీ త‌న అభ్య‌ర్థినే నిల‌బెట్ట‌నుంది. ఈ క్ర‌మంలోనే చంద్ర‌బాబు ముందుచూపుగా ఇటీవ‌ల ర‌ఘురామ కృష్ణ‌రాజును పార్టీలో చేర్చుకున్నారు. వాస్త‌వానికి ఈయ‌న కూడా వ‌చ్చే ఎన్నిక‌ల్లో న‌ర‌సాపురం నుంచి పోటీ చేయాలని భావించాడు. దీనికి చంద్ర‌బాబు నుంచి పూర్తిస్థాయిలో హామీ రావ‌డంతో పార్టీ మారి.. టీడీపీ తీర్థం పుచ్చుకున్నాడు. 

 

అయితే, ఇప్పుడు వైసీపీ.. ర‌ఘురామ కృష్ణ‌రాజుకు పోటీగా బ‌ల‌మైన అభ్య‌ర్థిని రంగంలోకి దింపాల‌ని భావిస్తోంది. ఈ క్ర‌మంలోనే కాంగ్రెస్ నేత‌, మాజీ ఎమ్మెల్యే క‌నుమూరి బాపిరాజుకు వైసీపీ నేత‌లు వ‌ల విసురుతున్నార‌ని రాజ‌కీయ వ‌ర్గాలు కోడై కూస్తున్నాయి. ఇప్ప‌టికే సిట్టింగ్ ఎంపీ గోక‌రాజును వైసీపీ నేత‌లు సంప్ర‌దించార‌ని, అయితే, ఆయన వ‌చ్చే ఎన్నిక‌ల్లో తాను పోటీ చేయ‌న‌ని చెప్పార‌ని తెలిసింది. ఈ నేప‌థ్యంలోనే క‌నుమూరి బాపిరాజును రంగంలోకి దింపాల‌ని దీనికిగాను ఆయ‌న‌ను అన్ని విధాలా మెప్పించేందుకు కూడా వైసీపీ నేత‌లు ప్ర‌య‌త్నిస్తున్నార‌ట‌. ఈ నేప‌థ్యంలోనే క‌నుమూరి స‌తీమ‌ణి అన్న‌పూర్ణ‌కు వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఉండి అసెంబ్లీనియోజ‌క‌వ‌ర్గం టికెట్ అయినా ఇస్తామ‌ని పార్టీలో చేరాల‌ని పెద్ద ఎత్తున చ‌ర్చ‌లు చేస్తున్నార‌ట‌. 

 

అయితే, దీనికి క‌నుమూరి ఎలా స్పందిస్తాడ‌నేదే ప్ర‌ధాన ప్ర‌శ్న‌. కాంగ్రెస్‌లో ఏళ్ల‌త‌ర‌బ‌డి పాతుకుపోయిన నేత ఒక్క‌సారిగా పార్టీని వీడి బ‌య‌ట‌కు రావ‌డం జ‌రుగుతుందా? అనేది సందేహం. ఒక‌వేళ ఆయ‌న వైసీపీలోకి వ‌చ్చి.. టీడీపీ అభ్య‌ర్థి క‌నుమూరి ర‌ఘురామ‌కృష్ణ‌రాజుపై పోటీ చేస్తే.. రికార్డు కావ‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు. అయితే, గెలుపు మాత్రం ఇప్పుడే చెప్ప‌లేమ‌ని అంటున్నారు. క‌నుమూరికి గుడ్ రికార్డు ఉన్న‌న నేప‌థ్యంలో ఆయ‌న గెలిచే చాన్స్ ఉంటుంద‌ని అంటున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి. 

బాపీరాజుకు వైసీపీ వ‌ల‌.. టీడీపీకి దెబ్బేనా..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share