వైసీపీ గూటికి క‌ర‌ణం వెంక‌టేష్‌!!

November 6, 2018 at 1:16 pm

ప్ర‌కాశం రాజ‌కీయాల్లో సంచ‌ల‌నం చోటు చేసుకుంటోంది. ఇప్ప‌టి వ‌ర‌కు మూడు ద‌శాబ్దాల‌కు పైగా టీడీపీని అంటిపెట్టు కుని రాజ‌కీయాలు చేసిన క‌ర‌ణం బ‌ల‌రామ‌కృష్ణ‌మూర్తి కుటుంబం.. నేడు ఇదే టీడీపీని వీడేందుకు రెడీ అవుతోంది. నిజా నికి ప్ర‌కాశం జిల్లా అద్దంకి నియోజ‌క‌వ‌ర్గంలో రాజ‌కీయాల‌ను శాసించిన ఫ్యామిలీగా క‌ర‌ణంకు పెద్ద పేరుంది. ఆయ‌న మా ట‌కు ఇక్క‌డ తిరుగులేదు. అంతేకాదు, ఆయ‌న ఏం చేసినా అడిగిన నాయ‌కుడు కూడాలేరు. అయితే, రాను రాను.. ఆయ న ప్ర‌త్య‌ర్థి వ‌ర్గం పైచేయి సాధించింది. గొట్టిపాటి ఫ్యామిలీకి క‌ర‌ణం కుటుంబానికి మ‌ధ్య పచ్చ‌గ‌డ్డి వేస్తే భ‌గ్గుమ‌నే ప‌రి స్థితి ఉంది. గ‌తంలో ఇద్ద‌రూ చెరో పార్టీలో ఉండే వారు కాబ‌ట్టి ఎలా జ‌రిగినా ప‌రిస్థితి వేరేగా ఉండేది.37905989_1758062020939049_2177856836378558464_n

కానీ, ఇప్పుడు రాజ‌కీయ స‌మీక‌ర‌ణల నేప‌థ్యంలో గొట్టిపాటి వ‌ర్గం కూడా టీడీపీలోకి చేరిపోయింది. గ‌త ఎన్నిక‌ల్లో అద్దంకి నుంచి క‌ర‌ణం కుమారుడు వెంక‌టేష్‌పై గొట్టిపాటి ర‌వి వైసీపీ అభ్య‌ర్థిగా పైచేయి సాధించారు. ఇక‌, ఇప్పుడున్న ప‌రిస్థితిలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో అద్దంకి టికెట్ త‌న కుమారుడికి ఇప్పించుకునేందుకు క‌ర‌ణం చేస్తున్న ప్ర‌య‌త్నాలు పెద్ద‌గా కొలిక్కి వ స్తున్న దాఖ‌లా క‌నిపించ‌డం లేదు. కానీ, వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎట్టి ప‌రిస్థితిలోనూ త‌న కుమారుడికి టికెట్ ఇప్పించుకోవడం తోపాటు గెలిపించుకుని తీరాల‌ని క‌ర‌ణం బ‌ల‌రాం గ‌ట్టి ప‌ట్టుపై ఉన్నారు. అయితే, ప‌రిస్థితులు మాత్రం ఆయ‌న‌కు అనుకూలంగా లేవు. దీంతో ప్ర‌త్యామ్నాయం కోసం ఆయ‌న అన్వేష‌ణ చేస్త‌న్నారు.24899751_1506058642806056_8083690088097210874_n

ఈ క్ర‌మంలోనే వైసీపీ ఆయ‌న‌కు తురుపు ముక్క‌లా తోచింది. అయితే, వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప‌రిస్థితిని కూడా అంచ‌నా వేయ డం.. త‌న‌పై ఉన్న కేసులు .. వంటి కీల‌క విష‌యాల‌ను దృష్టిలో పెట్టుకుని ఆయ‌న మౌనంగానే ఉంటున్నారు. అయితే, క‌ర‌ణం వెంక‌టేష్ మాత్రం వ్యూహాత్మ‌కంగా అడుగులు ముందుకు వేస్తున్నారు. ఇటీవ‌ల క‌ర‌ణం బ‌ల‌రాం పుట్టిన రోజు వేడుక‌ను ఘ‌నంగా నిర్వ‌హించారు. ఒక ర‌కంగా త‌న బ‌లం ఎంతో చూపించేందుకు క‌ర‌ణం దీనిని ఏర్పాటు చేశార‌నే ప్ర‌చారం కూడా సాగింది. అయితే, దీనిని త‌న‌కు అనుకూలంగా మార్చుకున్న వెంక‌టేష్‌.. ఈ ఫంక్ష‌న్‌కు వ‌చ్చిన వైసీపీ జిల్లాఅ ధ్య‌క్షుడు బాలినేని శ్రీనివాస‌రెడ్డితో ఏకాంతంగా చ‌ర్చ‌లు జ‌రిపిన‌ట్టు స‌మాచారం. ఈ చ‌ర్చ‌ల్లో ఖ‌చ్చితంగా తాను వైసీపీ తీర్థం పుచ్చుకుంటాన‌ని వెంక‌టేష్ చెప్పిన‌ట్టు తెలిసింది. త‌న తండ్రి మాత్రం టీడీపీలోనే ఉంటార‌ని, తాను మాత్రం వైసీపీ తీర్థం పుచ్చుకుంటాన‌ని, వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌న‌కు అద్దంకి టికెట్ ఇస్తానంటే.. ఎంతైనా ఖ‌ర్చు పెట్టి గెలుస్తాన‌ని చెప్పిన‌ట్టు స‌మాచారం. అయితే, ఈ విష‌యాన్ని తాను పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకు వెళ్తాన‌ని బాలినేని హామీ ఇచ్చిన‌ట్టు చెబుతున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

వైసీపీ గూటికి క‌ర‌ణం వెంక‌టేష్‌!!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share