క‌ర్ణాట‌క‌లో బీజేపీకి ఘోర ప‌రాభ‌వం.. మోడీకి ఇక మూడిందే..!

November 6, 2018 at 4:59 pm

త‌న‌కు తిరుగులేద‌ని, తాను ఏం చేసినా.. ప్ర‌జ‌లు చ‌చ్చిన‌ట్టు ప‌డి ఉంటార‌ని భావించిన బీజేపీకి, ఆ పార్టీ ప్ర‌ధాని న‌రేంద్ర మోడీకి క‌ర్ణాట‌క ప్ర‌జ‌లు మాడు ప‌గ‌ల‌గొట్టారు. ఓటు అనే ఆయుధంగా మ‌ళ్లీ తిరిగిలేచే ప్ర‌స‌క్తి కూడా లేకుండా చావు దెబ్బ‌కొట్టారు. క‌ర్ణాట‌క‌లో తాజాగా జ‌రిగిన ఉప ఎన్నిక‌ల్లో బీజేపీకి ఎదురుగాలి వీచింది. ఉపఎన్నికలు జరిగిన ఐదు స్థానాల్లో నాలుగు చోట్ల బీజేపీ ఘోర పరాజయం పొందడంతో.. ఆ పార్టీ ప్రధాన కార్యాలయం వద్ద సందడి లేక వెలవెలబోయింది. వచ్చే ఏడాది ముందస్తు ఎన్నికలకు వెళ్లే యోచనలో ఉన్న బీజేపీకి తాజా ఎన్నికల ఫలితాలు కోలుకోలేని షాక్ ఇచ్చినట్టు కనిపిస్తోంది. నిజానికి బీజేపీ పుంజుకుంటోంద‌ని, ఏక్ భార‌త్ శ్రేష్ట్ భార‌త్ నినాదంతో తాము ముందుకు వెళ్తున్నామ‌ని ప్ర‌ధాని మోడీ చెప్పుకొచ్చారుnews-25-5

ఇక‌, తాము త‌ప్ప ఈ దేశానికి మ‌రో తురుపు ముక్క‌లేద‌ని వ్యాఖ్యానించారు. మ‌రో నెల రోజుల్లో ఐదు రాష్ట్రాల్లో ఎన్నిక‌లు ఉన్న నేప‌త్యంలో తాజాగా జ‌రిగిన క‌ర్ణాటక ఉప ఎన్నిక‌ల ఫ‌లితం బీజేపీకీ శ‌రాఘాతంగా ప‌రిణ‌మించింది. శివమొగ్గ, బళ్లారి, మాండ్య సహా మూడు లోక్‌సభ స్థానాల్లో ఉపఎన్నికల కోసం ఎన్నికల సంఘం ప్రకటన చేసినప్పుడు.. వాస్తవానికి అక్కడ కాంగ్రెస్‌కు బలమైన అభ్యర్థి కూడా లేరు. విస్తృత చర్చలు, సంప్రదింపుల తర్వాత కాంగ్రెస్‌-జేడీఎస్ పార్టీలు ‘‘బయటి వ్యక్తి’’, ఎంఎల్‌సీ వీఎస్ ఉగ్రప్పను తీసుకొచ్చి పోటీకి నిలబెట్టాయి. రెడ్డి సోదరుల అండతో బీజేపీకి కంచుకోటగా ఉన్న బళ్లారిని సొంతం చేసుకునేందుకు బీజేపీ వ్యూమం సిద్ధం చేసుకుంది. కానీ, ఇక్క‌డ కాంగ్రెస్-జేడీఎస్‌లు సంయుక్తంగా పోరుకు సిద్ధ‌మ‌వ‌డంతో బీజేపీ తోక‌ముడ‌వ‌క త‌ప్ప‌లేదు.h-d-kumaraswamy-rahul

బీజేపీ తరపున ప్రచార బాధ్యతలను రెడ్డి సోదరులు, శ్రీరాములు భుజాలకెత్తుకున్నారు. బీఎస్ ఎడ్యూరప్ప సహా బీజేపీకి చెందిన ఇతర నేతలు కూడా వచ్చి ప్రచారం చేసినప్పటికీ… ఇది చివరికి రెడ్డి సోదరులనే కేంద్రంగా చేసుకుని సాగింది. అయితే కాంగ్రెస్ కార్యకర్తలు చాపకింద నీరులా ఉమ్మడి కృషితో మమ్మర ప్రచారం చేశారు. సమిష్టి కృషితో కాంగ్రెస్‌కు భారీ విజయం కట్టబెట్టారు. మ‌రో ఆరు మాసాల్లోనే దేశంలో సార్వ‌త్రిక స‌మ‌రానికి తెర‌లేస్తుండ‌డం, దేశవ్యాప్తంగా బీజేపీ గ్రాఫ్ ప‌డిపోతుండ‌డంతో ఇక‌, వ‌చ్చే ఎన్నిక‌ల్లో బీజేపీ గెలిచి ఢిల్లీ గ‌ద్దెనెక్క‌డం అంత ఈజీకాద‌నే వ్యాఖ్య‌లు జోరుగా వినిపిస్తున్నాయి. మొత్తానికి తాజా క‌ర్ణాట‌క ఉప పోరు ఫ‌లితం మాత్రం.. బీజేపీకి కంటిపై కునుకులేకుండా చేయ‌డంతో పాటు మోడీ గుండెల్లో రైళ్లు ప‌రిగెట్టించ‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు విశ్లేష‌కులు.

క‌ర్ణాట‌క‌లో బీజేపీకి ఘోర ప‌రాభ‌వం.. మోడీకి ఇక మూడిందే..!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share