క‌న్న‌డ‌నాట బెట్టింగుల జోరు.. కోట్ల‌లో బిజినెస్‌

May 11, 2018 at 3:34 pm
karnataka- congress-bjp

బెట్టింగ్‌.. బెట్టింగ్‌.. ఐపీఎల్ మొద‌లైన ద‌గ్గ‌ర నుంచి జోరుగా వినిపిస్తున్న ప‌దం! వేలు.. ల‌క్ష‌లు.. దాటిపోయి కోట్ల‌లోనే పందేలు జోరుగా జ‌రిగిపోతున్నాయి. ఐపీఎల్ మొద‌ల‌వుతోందంటేనే బుకీలు, బెట్టింగ్ బంగార్రాజుల హ‌డావుడి కూడా మొద‌లైపోతుంది. ఇది కేవ‌లం క్రికెట్‌కే ప‌రిమితం కాలేద‌న్న విష‌యం ఎప్ప‌టిక‌ప్పుడు బ‌య‌ట‌ప‌డుతూనే ఉంది. ముఖ్యంగా ఎన్నిక‌ల్లోనూ ఈ బెట్టింగ్‌ల జోరు కొన‌సాగుతోంది. ఫ‌లానా నియోజ‌క‌వ‌ర్గంలో ఎవ‌రు గెలుస్తారు? ఎంత మెజారిటీతో గెలుస్తారు? ఆ అభ్య‌ర్థి గెలుస్తాడా?  లేదా? ఎక్క‌డ ఏ పార్టీ విజయం సాధిస్తుంది? ఇలా అనేక ర‌కాలుగా బెట్టింగ్‌ల హ‌డావుడి మొద‌లైపోతుంది. ప్ర‌స్తుతం దేశ‌మంత‌టి దృష్టిని ఆక‌ర్షించిన క‌ర్ణాట‌క ఎన్నిక‌ల్లోనూ బెట్టింగ్‌లు ఒక రేంజ్‌లో కొన‌సాగుతున్నాయ‌ట‌. 

 

దేశవ్యాప్తంగా ఇప్పుడు కర్ణాట‌క ఎన్నిక‌లు అత్యంత ఆస‌క్తి రేపుతున్నాయి. ద‌క్షిణాది రాష్ట్రాల్లో పాగా వేసేందుకు బీజేపీ నేత‌లు పావులు క‌దుపుతుంటే.. మ‌రోవైపు కాంగ్రెస్ నేత‌లు కూడా విజయం సాధించాల‌ని ప‌ట్టుద‌ల‌తో ఉన్నారు. దేశం నుంచి కాంగ్రెస్‌ను పార‌ద్రోలాల‌ని ప్ర‌ధాని మోదీ-పార్టీ అధ్య‌క్షుడు అమిత్ షా.. ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తున్నారు. గుజ‌రాత్ ఎన్నిక‌ల్లో త్రుటిలో త‌ప్పిపోయిన విజ‌యాన్ని క‌ర్ణాట‌క ఎన్నిక‌ల్లో గెలుపొంది బీజేపీపై పైచేయి సాధించాల‌ని కాంగ్రెస్ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీ, సీఎం సిద్ధ‌రామ‌య్య యోచిస్తున్నారు. మోదీ ఇమేజ్ క్ర‌మ‌క్ర‌మంగా త‌గ్గుతోంద‌నే చ‌ర్చ మొద‌లైంది. ఈ నేప‌థ్యంలో కర్ణాట‌క‌లో గెలుపు బీజేపీకి ప్రాణ‌సంక‌టంగా మారింది. దీంతో దేశ‌వ్యాప్తంగా క‌ర్ణాట‌క ఎన్నిక‌లు దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం రేపుతున్నాయి. 

 

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు బుకీలకు కొత్త ద్వారాలు తెరిచాయి. ఇంతకాలం ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ లపై బెట్టింగులు కాసిన వారు కీలకమైన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై దృష్టి సారించి బెట్టింగులకు తెర లేపారు. ఈ నెల 12వ తేదీన జరగనున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలచిన 2,655 మంది అభ్యర్థులు తమ భవిష్యత్ ను పరీక్షించు కోనున్నారు. గురువారం ఎన్నికల ప్రచార పర్వం ముగియడంతో బెట్టింగ్ రాయుళ్లు ఎన్నికల ఫలితాలపై సర్వే నివేదికలను సునిశితంగా పరిశీలించి బెట్టింగ్ కాస్తున్నారు. కర్ణాటక రాష్ట్రంతోపాటు పలు ప్రాంతాల వారు ఎన్నికల ఫలితాలపై రూ.3వేల కోట్లరూపాయలకు పైగా పందాలు కాశారని వెల్లడైంది. 

 

టీవీ ఛానళ్లలో వచ్చే సర్వే ఫలితాలు, పత్రికల్లో వచ్చే కథనాలతో కర్ణాటకలో హంగ్ వస్తుందని ప్రచారం సాగుతుం డటంతో కొందరు బెట్టింగ్ రాయుళ్లు ఫలితాల గురించి ఆరా తీసేందుకు జ్యోతిషులను సంప్రదిస్తున్నార‌ట‌. తదుపరి కర్ణాటక సీఎం ఎవరనే అంశంపై కొందరు సిద్ధరామయ్య అంటుండగా మరికొందరు య‌డ్యూరప్పనే అంటూ బెట్టింగ్ కాస్తున్నారు. రాష్ట్ర మంత్రి రామనాథ్ రాయ్ విజయంపై అధికంగా డబ్బు పందెం కాస్తున్నారు. సీఎం సిద్ధరామయ్య, ఎంపీ శ్రీరాములుపై బుకీలు బెట్టింగ్ కాస్తున్నారు. 

క‌న్న‌డ‌నాట బెట్టింగుల జోరు.. కోట్ల‌లో బిజినెస్‌
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share