కాటమ రాయిడు TJ రివ్యూ

సినిమా : కాటమరాయుడు

నటీనటులు : పవర్ స్టార్ పవన్ కల్యాణ్, శృతి హాసన్, ఆలీ, నాజర్, రావు రమేష్, అజయ్, నర్రా శ్రీను, పృథ్వి, శివబాలాజీ, కమల్ కామరాజు, చైతన్య కృష్ణ, తరుణ్ అరోరా, ప్రదీప్ రావత్
కెమెరా : ప్రసాద్ మూరెళ్ళ
కళ : బ్రహ్మ కడలి
ఫైట్స్ : రామ్-లక్ష్మణ్
సంగీతం : అనూప్  రూబెన్స్
నిర్మాణ సంస్థ : నార్త్ స్టార్ ఎంటర్ టైన్మెంట్స్
నిర్మాత : శరత్ మరార్
దర్శకత్వం : కిషోర్ కుమార్ పార్ధసాని

ఆరవ ఘనవిజయాల్ని చూసి మబ్బుల్లో తేలి అదే తెలుగులో దించేసి పైసా వసూల్ అనుకుంటే అది వాత అవుతుంది తప్ప బలుపు అవ్వదు.ఏ భాషా చిత్రాల్ని అయినా తెలుగులో రీమేక్ చెయ్యొచ్చు కానీ ఒక్క ఆరవ సినిమాల విషయంలో ఒళ్ళు దగ్గరపెట్టుకోవాలి. ఆరవ జనాలకి ఏ సినిమా ఎప్పుడు ఎందుకు నచ్చుతుందో తెలుగునాడికి ఈనాటికీ అంతుపట్టదు.ఒక సంవత్సరం మొత్తం లో బ్లాక్ బస్టర్ అయిన ఓ 10 ఆరవ సినిమాల్ని తీసుకుంటే అందులో ఓ 8 వరకు సినిమాలు ఇవి కూడా సూపర్ హిట్ ఎలా అయ్యాయి అన్న అనుమానం సగటు తెలుగు ప్రేక్షకుడికి రాక మానదు.ఇక్కడ చిన్న పిల్లడు కూడా చెప్పగలిగేదేంటంటే నేపధ్య బలంతో హిట్ అయిన ఆరవ సినిమాల్ని రీమేక్ చేయాలనుకోవడం సూసైడ్ లాంటిది.ఇప్పటి వరకు తెలుగులో ఘన విజయాలు సాధించిన ఆరవ సినిమాల్ని చూస్తే ..సామాజిక స్పృహతో తీసిన ఠాగూర్ లాంటి సినిమాలు,ప్రేమ కథా చిత్రాలు…అక్కడక్కడా కథలో మెయిన్ లైన్ ని వాడుకుని నేపధ్యాన్ని అల్లుకుని విజయం సాధించిన సినిమాలే కనిపిస్తాయి.

వీరం.. వీరుడొక్కడే పవన్ కళ్యాణ్ రీమేక్ మొదలు పెట్టిన దగ్గరి నుండి పవర్ స్టార్ అభిమానులకే కాదు సగటు సినిమా ప్రేక్షకుడికి కూడా అంతు చిక్కని ప్రశ్న పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో ఏముందని రీమేక్ చేస్తున్నాడు అని.అయినా సరే మార్పులు చేసుంటారులే..మెయిన్ ప్లాట్ ని డిస్టర్బ్ చెయ్యకుండా కథని బాగా డెవలప్ చేసుంటారు..అందులోనా అది పవన్ కళ్యాణ్ సినిమా కాబట్టి ఏ ఒరియా సినిమా రీమేక్ చేసినా జనాలు సినిమా హాళ్ళకి వచ్చి పడతారు.

ఇంత వరకు బాగానే వుంది.అసలు తమిళ నేపథ్యం ఏంటి..అందులోనా వీరం హీరో అజిత్ నేపథ్యం ఏంటి..ఆరవ జనాలు అజిత్ నుండి ఎలాంటి సినిమాలు ఆశించి హిట్ చేస్తున్నారు..ఇదంతా ఓ చిన్న L .K .G మాపింగ్.ఇది కూడా చూసుకోకుండా అక్కడ హిట్ అయిపొయింది.ఇక్క పవర్ స్టార్ తో తీసేస్తే హిట్టే.ఇలా కాకి లెక్క లేసుకొని అసలు అంశాన్ని గాలికొదిలేసి కాటమరాయుడిని జనాల మీద కొదిలేశారు.

అసలు సినిమా విషయానికొస్తే..అనగనగా రాయలసీమ ఆ సీమలో నలుగురు తమ్ముళ్ళకి అన్న ,ఊరి పెద్ద అయిన కాటమ రాయుడు,ఆయనకి శత్రువులు,ఫైట్లు,అమ్మాయిలంటే పడదు.ఇంకో పక్క అనగనగా అదే రాయల సీమలో ఇంకో పల్లెటూరు ఆ ఊళ్ళో ఓ జడ్జి ఆయనకి ఓ కూతురు.ఆ జడ్జి గారికి గొడవలంటే పడదు.సింపుల్ గా గాంధేయ వాది.ఆ జడ్జి గారి కూతురు కాటమ రాయుడి మధ్య ప్రేమాయణం..ఈ వయొలెంట్ కాటమరాయుడు, గాంధేయవాది అయినా జడ్జి గారి కుటుంబానికి ఎలా దగ్గరయ్యాడు అన్నదే కతఅంశం.

నిజానికి ఒరిజినల్ కథలో ఓ సగటు తెలుగు ప్రేక్షకుడిగా చూస్తేనే ఎన్నో లోపాలు కనిపిస్తాయి.అనవసరపు బిల్డ్ అప్ షాట్స్ మీద దర్శకుడి ద్రుష్టి తప్ప మాతృకలో లోపాల్ని ఇందులో లేకుండా చేసే ద్యాస కానీ అసలా ఉద్దేశం కానీ లేదు.అసలు కాటమ రాయాయుడి బ్యాక్గ్రౌండ్ ఏంటి..ఆ అన్నదమ్ములెవరు..ఎలా ఊరి పెద్దమనిషయ్యాడో ఎవరికీ తెలియదు.జమీందారీ రజినీకాంత్ పాపారాయుడు అంటే దానికి బ్యాక్గ్రౌండ్ అవసరం లేదు కానీ అనాధ కాటమ రాయుడు ఊరి పెద్ద అయ్యాడంటే దానికున్న నేపథ్యం ఏంటా అనేది కథ పరంగా ఎంతో కీలకం.అది మచ్చుకైనా కనపడదు.ఇక కాటమ రాయుడి తమ్ముళ్లయితే మరీ హాస్యాస్పదం.అసలు వాళ్లేంటో ఏమి చేస్తుంటారో..అసలు అన్నయ్య తమ్ముళ్ళని ఏమి చేయాలనుకుంటున్నాడో అంతా భ్రమ.అసలంటూ అన్న తమ్ముళ్ల అనుబంధం గురించి ఒక్క టీ డైలాగ్ తప్ప సినిమాలో ఇంకేం లేదు.

పవన్ కళ్యాణ్ కాటమ రాయుడిగా తన సిగ్నేచర్ ఆటిట్యూడ్ ,మానరిజంస్ తో అలరించాడు.తమ్ముల్లుగా నలుగురిలో ఒక్క అజయ్ దే కాస్తే గుర్తింపున్న పాత్ర.మిగతా ముగ్గురూ డమ్మీలే.అలీ కామెడీ ప్యాచ్ అప్ లు పెద్దగా పేలలేదు. హీరోయిన్ శృతి హాసన్ అవసరానికి మించిన అభినయం అందాల ఆరబోత రెండు కంటగింపుగానే వున్నాయి.మిగిలిన వాళ్లలో రావు రమేష్ పాత్ర బాగుంది.ఇక విలనీలు చెప్పుకుంటూ పోతే చాంతాడంత లిస్ట్.తలో చెయ్యి వేసి కాటమ రాయుడి చేతిలో తన్నులు బాగానే తిన్నారు.నాజర్ పెద్దమనిషి పాత్రలో బాగానే నటించాడు.ఇంతకుమించి చెప్పుకోదగ్గ పాత్రలేం లేవు.

అసలు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా అంటే సాంకేతికంగా ఎంత హై స్టాండర్డ్స్ కనిపించాలి,వినిపించాలి.ఈ రెండూ ఈ సినిమాకి అతి పెద్ద అవరోధం.అనూప్ రూబెన్స్ పాటలు కానీ బ్యాక్గ్రౌండ్ కానీ ఏ ఒక్క చోట సినిమాని పైకి లేపవు.ఇక ఈ సినిమాకి అతి పెద్ద మైనస్ కెమెరామెన్.ఎంత పేలవంగా ఉందంటే..ఆ లైటింగ్ కానీ కలర్ మిక్సింగ్ కానీ సింప్ల్య్ ప్యాథటిక్.ఎడిటింగ్ కానీ..అక్కడక్కడా అద్దిన గ్రాఫిక్స్ కానీ ఏదో సి గ్రేడ్ సినిమాకి ఉన్న స్టాండర్డ్స్ కూడా లేవు.సాయి మాధవ్ బుర్ర లాంటి మాటల రచయిత సహకారం తో రాసిన డైలాగ్స్ ఏవి గుర్తుంచుకో దగినవి కాదు,సినిమాని మోయగలిగినవి అంతకంటే కాదు. ఇక డైరెక్టర్ డాలీ గురించి మాట్లాడుకోకపోవడమే మంచిది.పవన్ కళ్యాణ్ లాంటి హీరో..ఓ రీమేక్ చేతిలో ఉంటే ఓ దర్శకుడికి ప్రూవ్ చేసుకోవడానికి ఇంకేం కావాలి.నాకేం వద్దు..రీమేక్ ని మక్కి కి మక్కి దించేస్తే ముద్దు.ఇదే చేసాడు డాలీ.

స్పెషల్ రాపిడ్ ఆక్షన్ ఫోర్స్ తో రాత్రంతా పవన్ అభినులపై లాటి ఛార్జ్ చేస్తూ కొనసాగిన బెనిఫిట్ షోల పరవం పొద్దున్న 10 దాటాక కానీ తెలంగాణాలో సినిమా షో పడలేదు.ఇవన్నీ ఓర్చుకుని సినిమాకి వెళ్లిన ప్రేక్షకుడికి సినిమా మొదటి పది నిమిషాలు ఆ కాల రాత్రిని మరిపించేస్తే…మిగిలిన గంటా ముప్పై నిమిషాలు ఇది పవన్ కళ్యాణ్ సినిమానే నా…ఎందుకు చెశాడ్రా అని అనుకోని ప్రేక్షకుడుండడేమో.

రేటింగ్ : 2.5/5
పంచ్ లైన్ : అభిమానులకు పండగే కానీ….