ఆంధ్రోళ్లు.. ఓట్లు కావాలె.. నాయ‌కులు వ‌ద్దా? కేసీఆర్‌!

October 17, 2018 at 5:30 pm

తెలంగాణాలో ఆంధ్రోళ్లు! ఆంధ్రోళ్ల తెలంగాణా రాజ‌కీయాలు!! ఇప్పుడు అటు ఏపీ, ఇటు తెలంగాణాలోనూ హాట్ టాపిక్‌గా మారిన విష‌యం ఇంది. ముఖ్యంగా తెలంగాణా సీఎం కేసీఆర్ వ్య‌వ‌హ‌రిస్తున్న తీరు, చేస్తున్న వ్యాఖ్య‌లు ఇవ‌న్నీ కూడా ఇరు రాష్ట్రాల రాజ‌కీయాల‌ను ప్ర‌భావితం చేస్తున్నాయి. కేసీఆర్ గ‌తంలో ఆంధ్రోళ్లు! అంటూ ఏపీ వారిని వేరుగా చేసి మాట్లాడిన సంద‌ర్బాలు అనేకం ఉన్నాయి. అదేవిధంగా త‌న‌కు అడ్డుగా వ‌స్తున్నార‌ని, లేదా త‌న‌కు పోటీ అవుతార‌ని అనుకునే నాయ‌కుల‌కు ఆయ‌న తగిలించిన ట్యాగ్ కూడా ఆంధ్రోళ్లు! అంటే తెలంగాణ ఉద్య‌మం సాగిన నేప‌థ్యంలో ఉద్య‌మానికి ఊతం ఇచ్చుకునేందుకు ఆయ‌న ఉప‌యోగించిన భాష‌.. ఆంధ్రోళ్లు! వీరివ‌ల్లే మ‌న‌కు న‌ష్టాలు వ‌స్తున్నాయ‌ని, వీరివ‌ల్లే మ‌న‌కు అవ‌కాశాలు పోతున్నాయ‌ని ఆయ‌న పెద్ద ఎత్తున ప్ర‌చారం చేశారు.

ఈ క్ర‌మంలోనే ఆయ‌న దాదాపు తెలంగాణాలోని యువ‌త‌లోను, ప‌లు జిల్లాల్లోనూ కూడా ఆంధ్రోళ్లు అనే నినాదాన్ని బాగానే తీసుకు వెళ్లారు. రాష్ట్రం సాకార‌మైంది. తెలంగాణ ఏర్ప‌డింది. అయితే, హైద‌రాబాద్‌లో మేజ‌ర్ పార్ట్ ఏపీ ప్ర‌జ‌ల‌దే. హైద‌రా బాద్‌లో మేజ‌ర్ పెట్టుబ‌డులు ఏపీ వ్యాపారుల‌వే. దీంతో ఒక్క‌సారిగా కేసీఆర్ టంగ్ యూట‌ర్న్ తీసుకుంది. జీహెచ్ఎంసీ ఎ న్నిక‌ల్లో ఆయ‌న ఆంధ్రుల‌ను మ‌చ్చిక చేసుకోవ‌డం త‌ప్పిందికాదు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న ఆయ‌న కుమారుడు కూడా రంగంలోకి ఆంధ్రోళ్ల కాలికి ముల్లు గుచ్చు కుంటే నానోటితో తీస్తానంటూ.. పెద్ద ఎత్తున ప్ర‌చారం చేశారు. తెలంగాణాలో ఉన్న ఆంధ్రోళ్లు మొత్తం తెలంగాణా వాళ్లేన‌ని చెప్పుకొచ్చారు. ఇలా మొత్తంగా కేసీఆర్ ఏఏటి కాడ ఆ పాట పాడుతూ వ‌చ్చారు.

ఇప్పుడు అస‌లు సిస‌లు ఎన్నిక‌లు వ‌చ్చాయి. వ‌చ్చే డిసెంబ‌రు 7న తెలంగాణాలో కేసీఆర్ జాతకం రాయ‌బ‌డుతోంది. ఈ నేప‌థ్యంలో మ‌రోసారి తెలంగాణాలో ఆంధ్రోళ్ల రాజ‌కీయాలు ఊపందుకున్నాయి. ఈ క్ర‌మంలోనే కేసీఆర్ గ‌మ్మ‌త్తుగా వ్యాఖ్యానించారు. అసలు ఆంధ్రోళ్లు- అనే ప‌దం ఎందుకు వ‌చ్చింద‌ని ఆయ‌న త‌న‌కు అస‌లు ఏమీ తెలియ‌ద‌న్న‌ట్టుగానే ప్ర‌శ్నించారు. అంతేకాదు, ఆ మాట‌ను కాంగ్రెస్ చీఫ్ ఉత్త‌మ్ కుమార్ రెడ్డే ప‌దేప‌దే అంటున్నార‌ని ఆయ‌న‌పై నెట్టారు. కానీ, నిజం నిప్పు లాంటిది అన్న‌ట్టుగానే.,. ఏపీ వారిని కానీ, ఏపీ నాయ‌కుల‌ను కానీ ఆంధ్రోళ్లు అని సంబోధించిన పెద్ద‌మ‌నిషి కేసీఆరే. ముఖ్యంగా ఇప్పుడు త‌న‌కు అడ్డం వ‌స్తున్నార‌ని, త‌న‌ను శాసించేస్థాయికి ఎదుగుతున్నార‌ని భావించి చంద్ర‌బాబును అడ్డుకునేందుకు ఆయ‌న శ‌త విధాల ప్ర‌య‌త్నిస్తున్నారు.

ఈ నెల తొలివారంలోనే ఆయ‌న ఓ స‌భ‌లో మాట్లాడుతూ.. చంద్ర‌బాబుతో చేతులు క‌లుపుత‌మా ? మ‌ళ్లీ పోయిఆంధ్రోళ్ల పార్టీతో జ‌త‌క‌ట్టుడేంది! అని ప్ర‌శ్నించింది ఆయ‌నే. కానీ, ఎన్నిక‌లు స‌మీపిస్తుండ‌డం తెలంగాణాలోని ఏపీ ప్ర‌జ‌లు చంద్ర‌బాబు వైపు మొగ్గేందుకు సిద్ధ‌మ‌వుతూ ఉండ‌డం నేప‌థ్యంలో క‌ర్ణాట‌క త‌ర‌హాలో తెలంగాణాలోనూ ఏ పార్టీకి స‌రైన మెజారిటీ రాక‌పోతే.. ఏం చేయాలి? త‌న ప‌రిస్థితి ఏంగాను? ఇప్పుడు ఇదే ప్ర‌శ్న కేసీఆర్‌కు కంటిపై కునుకులేకుండా చేస్తోంది. ఈ క్ర‌మంలోనే ఆయ‌న ఆంధ్రోళ్లు అనే ప‌దం డిక్ష‌న‌రీలోనే లేద‌ని చెప్ప‌డానికి కూడా సాహిసించే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. అందుకేఆయ‌న తెలంగాణాలో ఉన్న‌వారంతా తెలంగాణా వారే అనే స‌రికొత్త నినాదాన్ని తెర‌మీదికి తెచ్చారు అంటే.. తెలంగాణాలోని ఆంధ్రోళ్లు తెలంగాణా వాళ్లే.. కానీ, ఇక్క‌డున్న ఏపీ పార్టీ మాత్రం దూరం పెట్టాల్సిందే. ఇదీ కేసీఆర్ రాజ‌కీయ‌నీతి!!

ఆంధ్రోళ్లు.. ఓట్లు కావాలె.. నాయ‌కులు వ‌ద్దా? కేసీఆర్‌!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share