బ్రేకింగ్ న్యూస్ : తెలంగాణ అసెంబ్లీ రద్దు

September 6, 2018 at 1:32 pm

ఊహించిందే జరిగింది. తెలంగాణలో ముందస్తు ఎన్నికలు ఖాయమయ్యాయి. తెలంగాణ అసెంబ్లీని సీఎం కేసీఆర్ రద్దు చేశారు. గురువారం మధ్యాహ్నం నిర్వహించిన కేబినెట్ సమావేశంలో అసెంబ్లీ రద్దుకు ఏకవ్యాఖ్య తీర్మానం చేశారు. కేవలం నాలుగైదు నిమిషాల్లో మంత్రివర్గ సమావేశం ముగిసింది. అనంతరం రాజ్‌భవన్‌కు వెళ్లి అసెంబ్లీ రద్దు తీర్మానాన్ని సీఎం కేసీఆర్ గవర్నర్ నరహింహన్కు అందజేశారు. కొంతకాలంగా ప్రచారం నిజమైంది. దీంతో సాధారణ ఎన్నికలకంటే ముందే తెలంగాణలో ఎన్నికలు జరగబోతున్నాయి. నిజానికి మూడు నెలల ముందే సీఎం కేసీఆర్ ముందస్తు ఎన్నికలపై కసరత్తు మొదలు పెట్టారు. వచ్చే డిసెంబర్లో జరిగే మధ్యప్రదేశ్, రాజస్తాన్, మిజోరం, చత్తీస్ఘడ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతోపాటే తెలంగాణలోనూ ఎన్నికలు జరిగే అవకాశం ఉందని పలువురు విశ్లేషకులు భావిస్తున్నారు.40573132_2271083346459779_6846932830585356288_n

ఈ క్రమంలోనే ముందస్తు ఎన్నికలకు ఎలాంటి అడ్డంకులు ఎదురుకాకుండా.. ఆయన అన్ని చర్యలు తీసుకున్నారు. ఢిల్లీలో పలుమార్లు ప్రధాని మోడీతో, ఇతర మంత్రులతో సమావేశం అయ్యారు. ఇక కొంగరకలాన్‌లో నిర్వహించిన ప్రగతి నివేదన సభలోనే ఆయన అసెంబ్లీ రద్దు విషయాన్ని వెల్లడిస్తారని అందరూ ఊహించారు. కానీ.. ఆయన ఎక్కడ కూడా ఆ విషయం చెప్పలేదు. దీంతో ముందస్తు ఉండదనే టాక్కూడా వినిపించింది. కానీ. వీటన్నింటినీ తలకిందులు చేస్తూ సీఎం కేసీఆర్ అసెంబ్లీని రద్దు చేశారు. ఇక రేపటి నుంచి జనంలోకి వెళ్లేందుకు అంతా సిద్దం చేశారు. సీఎం కేసీఆర్ తనకు సెంటిమెంట్‌గా భావించే ఉమ్మడి కరీంనగర్ జిల్లా హస్నాబాద్‌లో ప్రజా ఆశీర్వాద సభలో ఆయన ఎన్నికల శంఖారావం పూరించనున్నారు. ఇక్కడి నుంచే అభ్యర్థుల పేర్లను ఆయన వెల్లడించనున్నారు.40607144_705010206520563_4516217579861180416_n

సీఎం కేసీఆర్ ఎక్కడ తాను ముందస్తు ఎన్నికలకు వెళ్తున్నట్లు చెప్పలేదు. కానీ.. అందుకు సంబంధించిన గ్రౌండ్‌వర్క్ పూర్తి చేశారు. ఏక కాలంలో అన్ని చర్యలు తీసుకున్నారు. అటు పార్టీ పరంగా సభల నిర్వహణ కార్యాచరణ చేపడుతూనే.. పాలనా పరంగా తీసుకోవాల్సిన చర్యలపై ఆయన కసరత్తు పూర్తి చేశారు. అయితే.. సబంధిత అధికార యంత్రాంగం, మంత్రుల కదలికలతో దాదాపుగా సీఎం కేసీఆర్ అసెంబ్లీని రద్దు చేయడం ఖాయమని ప్రచారం జరిగింది. ఇలా అందరూ ఊహించినట్లుగానే నాలుగు సంవత్సరాల మూడు నెలలు పాలించిన సీఎం కేసీఆర్ అసెంబ్లీని రద్దు చేశారు. ఇక నుంచి కేసీఆర్ ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగనున్నారు. మిగతా ప్రజాప్రతినిధులు మాజీలు అయ్యారు.

బ్రేకింగ్ న్యూస్ : తెలంగాణ అసెంబ్లీ రద్దు
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share