సీ ఓటర్ సర్వే చూసి కేసీఆర్ గుండె గుభేల్!

October 6, 2018 at 12:41 pm

తెలంగాణలో తర్వలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో అప్పుడే అసెంబ్లీ రద్దు చేశారు అపద్దర్మ ముఖ్యమంత్రి కెసీఆర్. మొదటి నుంచి దూకుడు పెంచుతూ వస్తున్న టీఆర్ఎస్ పార్టీ తాజాగా సీ ఓటర్ సర్వే చూసి ఖంగు తిన్నది. తెలంగాణ కోసం పోరాటం చేసినామని అందుకే ప్రజలు తమ పార్టీకి మద్దతు పలుకుతారని..తాము చేసిన అభివృద్ది పనులు చూసి తెలంగాణలో ప్రతి ఒక్కరూ తమకే సపోర్ట్ గా ఉన్నారని టీఆర్ఎస్ సభ్యులు చెబుతున్నారు. 019 ఎన్నికల్లో టీఆర్ ఎస్ 100 స్థానాలు కైవసం చేసుకుంటుందని కేసీఆర్ కాన్ఫిడెంట్ గా చెప్పిన సంగతి తెలిసిందే.

తాజాగా ఆ సంఖ్యను గులాబీ దళాధిపతి…110కు పెంచారు. ఇక మిత్రపక్షం మజ్లిస్ తో కలుపుకొని మొత్తం 117 స్థానాల్లో విజయభేరి మోగిస్తామని కేసీఆర్ ప్రకటనలు గుప్పిస్తున్నారు. అయితే ప్రజలు అన్ని విషయాలు నిషితంగా పరిశీలిస్తున్న సమయం..ఏ విషయంలోనూ ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండొద్దు అన్న సంకేతాలు ఇప్పుడు టీఆర్ఎస్ కి తెలిసొస్తుంది. తాజాగా కేసీఆర్ కు ఓ జాతీయ స్థాయి సర్వే షాకిచ్చింది. లోక్ సభ ఎన్నికల గెలుపోటముల పై సీ ఓటర్ సర్వే నిర్వహించింది. ఆ సర్వేలో కేసీఆర్ కు షాకిచ్చే రిపోర్టులు వచ్చాయట.

ప్రస్తుతం ఉన్నపళంగా లోక్ సభ ఎన్నికలు జరిగితే టీఆర్ ఎస్ 9 ఎంపీ స్థానాలకు పరిమితం అవుతుందని..ఇక కాంగ్రెస్ పార్టీకి 6 ఎంపీ స్థానాలు వస్తాయని..మజ్లిస్ కు ఒక ఎంపీ స్థానం – బీజేపీకి ఎంపీ స్థానం దక్కనున్నాయట. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ తో టీడీపీ పొత్తు పెట్టుకోవడం వల్ల ఈ పరిణామాలు జరగబోతున్నాయని సర్వే తెలిపింది. తమ పార్టీ క్లీన్ స్వీప్ చేస్తుందని విపరీతమైన కాన్ఫిడెంట్ తో ఉన్న కేసీఆర్ కు తాజా సర్వే షాకిచ్చందని చెప్పవచ్చు. ఇప్పటికైనా కేసీఆర్ కాస్త దూకుడు తగ్గించి అసలు విషయాలు గమనించి ప్రజలకు నాడి ఏంటో కనిపెడతాడా లేదా అన్నది తెలియాల్సి ఉంది.

సీ ఓటర్ సర్వే చూసి కేసీఆర్ గుండె గుభేల్!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share